నటి రాధ నుంచి నా భర్తను విడిపించండి | Woman alleges actor Radha's hand in husband's disappearance | Sakshi
Sakshi News home page

నటి రాధ నుంచి నా భర్తను విడిపించండి

Published Sat, Aug 13 2016 1:45 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

నటి రాధ నుంచి నా భర్తను విడిపించండి - Sakshi

నటి రాధ నుంచి నా భర్తను విడిపించండి

తమిళసినిమా: నటి రాధ బారి నుంచి తన భర్తను విడిపించాలని కోరుతూ స్థానిక కోడంబాక్కమ్, కామయరాజర్ కాలనీకి చెందిన ఉమాదేవి అనే మహిళ గురువారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో ఆమె పేర్కొంటూ తన భర్త మునివేల్ సుందరాట్రావెల్స్ చిత్ర నాయకి రాధతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఈ విషయమై తాను స్థానిక విరుగమ్‌బాక్కమ్, టీ.నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాన ంది.
 
 దీంతో పోలీసులు తన భర్తను, నటి రాధను పిలిపించి విచారించి అనంతరం తన భర్తను తనతో పంపించార ని తెలిపింది. అయితే అప్పటి నుంచి నటి  రాధ తన భర్తకు తరచూ ఫోన్ చేస్తూ తమ కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తోందని అంది.అదే విధంగా తనకు వేరే వ్యక్తితో సంబంధం కలుపుతూ అసభ్యంగా మాట్లాడుతోందని చెప్పింది. తనను తన కూతురిని బెదిరిస్తోందిని పేర్కొంది. దీంతో తన కూతురు ఆమెకు భయపడి నాలుగు రోజులుగా కాలేజ్‌కు కూడా వెళ్లడం లేదని తెలిపింది. కొన్ని రోజులుగా తన భర్త కూడా కనిపించడం లేదని చెప్పింది.
 
 నటి రాధ నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని, తన భర్తను ఆమె బారి నుంచి విడిపించి తనకు అప్పగించాలని ఫిర్యాదు పత్రంలో పేర్కొంది. ఉమాదేవి ఫిర్యాదును పరిశీలించిన పోలీస్‌కమిషనర్ టీకే.రాజేంద్రన్ వెంటనే విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదును టీ.నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పంపారు. దీంతో అక్కడి పోలీసులు ఒకటి రెండు రోజుల్లో నటి రాధను పిలిపించి విచారించే అవకాశం ఉంది. నటి రాధ ఇంతకు ముందొకసారి తనను ఒక వ్యాపారవేత్త మోసం చేశారని పోలీసులను ఆశ్రయించిందన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement