న్యూఢిల్లీ: భారత్‌లో డోపింగ్‌కు పాల్పడుతున్న క్రీడాకారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ఈ సంఖ్య 500కు చేరడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఉన్నట్టు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) పేర్కొంది.
ఈ రెండు క్రీడాంశాల తర్వాత కబడ్డీ (58), బాడీబిల్డింగ్ (51), పవర్‌లిఫ్టింగ్ (42), రెజ్లింగ్ (41), బాక్సింగ్ (36), జూడో (9)లలో డోపీలు ఉన్నారు. 2009 జనవరి నుంచి జూలై 2013 వరకు 500 మంది అథ్లెట్లు యాంటీ డోపింగ్ నిబంధనలను అతిక్రమించగా వీరిలో 423 మందిపై డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ తగిన చర్యలు తీసుకుంది. ఆర్టీఐ చట్టం కింద నాడా ఈ విషయాలను వెల్లడించింది. డోపింగ్ మోసాలకు పాల్పడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. జూలై వరకు 52 మంది అథ్లెట్స్ సస్పెన్షన్‌తో భారత్ టాప్‌లో ఉన్నప్పటికీ వీరిలో తొమ్మిది మందిపై నిషేధం ఎత్తివేయడంతో రెండో స్థానంలో ఉంది.
డోపీలు @ 500
Published Mon, Dec 16 2013 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement