tb
-
టీబీ నుంచి డెంగ్యూ వరకూ.. 8 టీకాల పరీక్షకు అనుమతి
న్యూఢిల్లీ: టీకాలతో కరోనాకు అడ్డుకట్టవేడంలో విజయం సాధించిన అనంతరం ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం ఎనిమిది కొత్త వ్యాక్సిన్లను పరీక్షించడానికి ఆమోదించింది.ఇందులో టీబీ నుండి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వరకూ టీకాలు ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలో నాలుగు వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయి. ఈ టీకాల సాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రయోజనాలను పొందవచ్చు. వచ్చేరెండేళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తవుతాయని అంచనా. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు ఎనిమిది వేర్వేరు వ్యాక్సిన్లపై ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్ఈసీ) సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్- ఈ కంపెనీకి డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బీ (ఆర్డిఎన్ఎ), ఇన్‌యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి వ్యాక్సిన్లపై ఫేజ్- II ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. న్యూమోకాకల్ పాలీశాకరైడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీ అనుమతి పొందింది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యుమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. అదేవిధంగా డెంగ్యూ వ్యాక్సిన్‌పై మూడవ దశ ట్రయల్ నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.టీబీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చాలా కాలంగా బీసీజీ వ్యాక్సిన్‌పై కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా టీబీ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి లభించింది. ట్రయల్లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా సీడీఎస్సీఓ దశ- III ట్రయల్‌ను ప్రారంభించడానికి కూడా అనుమతిని ఇచ్చింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్వీ)తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని సీడీఎస్సీఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఊపిరితిత్తులు,శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో స్థానం దక్కింది. దీని కోసం మూడవ దశ ట్రయల్‌కు జీఎస్కే కంపెనీకి అనుమతి లభించింది. -
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్యశాఖ బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్‌ను వేగంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 12జిల్లాల్లో టీకా పంపిణీని ఈ నెల 12న ప్రారంభించింది. తొలి రెండు వారాల్లోనే 16.98శాతం టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోను వైద్యశాఖ పాటిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా వైద్యం, మందులు, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2025 నాటికి టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెద్దలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నారు. హైరిస్క్ వర్గాలకు... క్షయ వ్యాధి బారినపడే అవకాశం ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి టీకా పంపిణీ వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు.. ఇలా ఆరు వర్గాలకు చెందిన వారికి తొలి దశలో టీకా పంపిణీ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఆరు వర్గాలకు చెందినవారు 50లక్షల మంది వరకు ఉన్నట్టు వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. తొలి మూడు నెలల్లో 20లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా, రెండు వారాల్లోనే 16.98 శాతం 3,39,640 మందికి పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 45,891మందికి, నెల్లూరులో 38,602మందికి, వైఎస్సార్ జిల్లాలో 37,995మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ఎంపికచేసిన 12 జిల్లాల్లో ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటికే పిల్లలకు టీకా ఇప్పటికే వైద్యశాఖ పిల్లలకు సాధారణ టీకాలతోపాటు టీబీకి సంబంధించిన టీకాను వేస్తోంది. వైద్యశాఖ 2022లో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. తొమ్మిది నెలల్లోపు పిల్లలకు మూడు డోసులుగా ఈ టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాలలోపు ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోపు మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. -
టీబీ రోగులకు డ్రోన్ సేవలు
బీబీనగర్ : టీబీ రోగుల కోసం బీబీనగర్ ఎయిమ్స్ ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రోన్ సేవలు విజయవంతమయ్యాయి. టీబీ రోగులు, అనుమానితుల నుంచి రక్త పరీక్షలకు నమునాలు సేకరించి వెనువెంటనే ల్యాబ్‌లకు పంపించడం, తిరిగి అవసరమైన మందులను రోగులకు పంపేందుకు డ్రోన్ సాయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలపరిధిలో 150 మంది నమునాలను సేకరించి డ్రోన్ ద్వారా ల్యాబ్‌లకు పంపి.. తిరిగి మందులు చేరవేశారు. ఆదివారం ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్‌భాటియా డ్రోన్ సేవల గురించి వెల్లడించారు.రెండు నెలలుగా డ్రోన్ సేవలపై చేపట్టిన ప్రయోగాలు ఫలించడంతో టీబీ రోగులకు చాలా సులువుగా సేవలు అందుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన డ్రోన్ సేవలను ఇటీవల ఎయిమ్స్‌కు వచ్చిన కేంద్రమంత్రి ఆర్కే.సింగ్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు అనుసంధానం భువనగిరి, రామన్నపేట, బీబీనగర్ బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు డ్రోన్లను అనుసంధానం చేశారు. ఇక్కడి నుంచి రోగుల నమునాలను సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్లకు డ్రోన్ ద్వారా పంపుతారు. తిరిగి అక్కడి నుంచి రోగులకు అవసరమయ్యే టీబీ మందులు, ట్యూబ్‌లు, రియాజెంట్లను డ్రోన్‌లో అమర్చి రోగులకు పంపుతారు. దీని కోసం ప్రస్తుతం ఎయిమ్స్‌లోని 3 డ్రోన్ పైలెట్లు, 2 డ్రోన్లు అందుబాటులో ఉంచారు. రోగుల ఖర్చు తగ్గించేందుకు సహాయపడుతుంది డ్రోన్ సేవల ద్వారా టీబీ నిర్థారణలో ట్యూమరౌండ్ సమయం తగ్గించడం, దూర ప్రాంతాల్లో, రవాణా సరిగ్గా లేని చోట నివసించే వ్యక్తులకు రవాణా ఖర్చులు తగ్గించేలా డ్రోన్ సేవలు సహాయపడతాయి, జిల్లా టీబీ కార్యాలయం నుంచి డ్రోన్ కార్యకలాపాలను పీహెచ్‌సీలతో పాటు సబ్‌సెంటర్లకు సైతం విస్తరిస్తున్నాం. – వికాస్‌భాటియా, డైరెక్టర్, ఎయిమ్స్ -
టీబీకి టాటా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ వ్యాధి (టీబీ) కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా పెద్దలకు టీకా పంపిణీకి వైద్య శాఖ సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోనూ వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు నిర్వహిస్తూ ప్రస్తుతం దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇదిలా ఉండగా మరింతగా దేశంలో పెద్దలకు టీబీ నుంచి రక్షణ కోసం బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో వచ్చే నెలలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు అంశాల ప్రాతిపదికగా.. ఆరు అంశాల ప్రాతిపదికగా వివిధ వర్గాల వ్యక్తులకు తొలుత టీకా పంపిణీ చేపడతారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు, ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18 కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు ఇలా ఈ ఆరు వర్గాలకు చెందిన వారికి తొలుత టీకాలు వేస్తారు. టీకా పంపిణీకి ఎంపిక చేసిన 12 జిల్లాల్లో ఈ వర్గాలకు చెందిన వారు 50 లక్షల మంది వరకూ ఉన్నట్టు వైద్య శాఖ ప్రాథమికంగా నిర్థారించింది. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి టీకా పంపిణీకి అర్హులైన వారి ఎంపిక చేపడుతున్నారు. కాగా, ఇప్పటికే వైద్య శాఖ పిల్లలకు టీకా పంపిణీ చేస్తోంది. గత ఏడాది నుంచి వైద్య శాఖ ఉచితంగా టీకా పంపిణీ ప్రారంభించింది. తొమ్మిది నెలలలోపు పిల్లలకు మూడు డోసులుగా టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాల వయసులో ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోగా మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇదే తరహాలోనే నిర్ధేశించిన పరిమాణంలో పెద్దలకు టీకాలు పంపిణీ చేయనున్నారు. టీకా పంపిణీకి అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాలను ఎంపిక చేశారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత పంపిణీ వ్యాక్సిన్ వెయిల్స్, సిరంజ్‌లు ఎంపిక చేసిన 12 జిల్లాలకు సరఫరా చేస్తున్నాం. 59 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశాం. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్‌కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్‌లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్‌గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్‌రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్‌లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్‌లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్‌తో ఫ్లూయిడ్‌ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..!
యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. వీటి సహాయంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించి, రోగి ప్రాణాలు కాపాడవచ్చన్న విషయం తెలిసిందే. అయితే... ఈ యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా, విచక్షణరహితంగా వాడటం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా ఇప్పటికీ వాటి దురుపయోగం ఆగడం లేదు. దాంతో తాజాగా ఇప్పుడు ఎంతకూ తగ్గని టైఫాయిడ్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందంటూ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నివేదిస్తున్నారు. ఈ ముప్పును గుర్తెరిగి అప్రమత్తం అయ్యేందుకు ఉపయోగపడే కథనమిది. గతంలో కొన్ని జబ్బులు చాలా తేలిగ్గా... అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్ వాడగానే తగ్గిపోయేవి. అసలు కొన్ని జబ్బులైతే ఎలాంటి మందులూ / యాంటీబయాటిక్స్ వాడకపోయినా తగ్గుతాయి. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా వ్యాధులను వ్యాప్తి చేసే వ్యాధికారక క్రిములు... ఆ మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకుంటున్నాయి. తాజాగా టైఫాయిడ్‌ను వ్యాప్తి చేసే క్రిమి కూడా అలా నిరోధకత పెంచుకుంటోందని కొన్ని అధ్యయనాల్లో aతేలింది. ఆసియాలో పెరుగుతూ.. అంతర్జాతీయంగా వ్యాప్తి టైఫాయిడ్ చాలా పురాతనమైన జబ్బు. దాదాపు వెయ్యేళ్ల నుంచి మానవాళిని బాధిస్తోందన్న దాఖలాలున్నాయి. ఇలా చాలాకాలం నుంచి వేధించిన మరోపురాతనమైన జబ్బు టీబీలాగే... టైఫాయిడ్ కూడా యాంటీబయాటిక్స్ తర్వాత పూర్తిగా అదుపులోకి వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనవాళ్లు లేకుండా మటుమాయమైంది. ఇది సాల్మొనెల్లా ఎంటరికా లేదా సాల్మొనెల్లా టైఫీ అనే రకాల క్రిము కారణంగా వ్యాప్తి చెందుతుంది. మనదేశంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నిర్వహించిన పరిశోధనల్లో ఆందోళన కలిగించే అనేక అంశాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు మనదేశంతో పాటు ఆయా దేశాల్లోని 3,489 రకాల టైఫీ స్ట్రెయిన్ల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పరిశీలించారు. దాంతో ఇప్పుడు తాజాగా యాంటీబయాటిక్స్‌కు ఓ పట్టాన లొంగని కొత్త స్ట్రెయిన్ టైఫాయిడ్ జబ్బును కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు తేలింది. నిపుణులు దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ టైఫాయిడ్ లేదా ‘ఎక్స్‌డీఆర్’టైఫాయిడ్‌గా పేర్కొంటున్నారు. టైఫాయిడ్ కొత్త స్ట్రెయిన్స్... ‘‘ఉత్పరివర్తనం చెందిన ‘ఎక్స్‌డీఆర్ టైఫాయిడ్’ 2016లో తొలిసారి పాకిస్తాన్లో వెలుగుచూసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతున్న ఈ ‘ఎక్స్ఆర్డీ’ టైఫీ స్రెయిన్స్ వ్యాప్తి... భారత్, పాక్, నేపాల్, బంగ్లాదేశ్... ఈ నాలుగు ఆసియా దేశాలనుంచే జరుగుతోంది. ఈ సూపర్‌బగ్స్ యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడాల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎంతో ఆందోళనకరం. అందుకే వీలైనంత త్వరగా ఈ అనర్థానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’’ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెంది జేసన్ ఆండ్రూస్ ప్రపంచానికి హితవు చెబుతున్నారు. ప్రతి ఏడాదీ దాదాపు కోటీ 10 లక్షల టైఫాయిడ్ కేసులు వస్తుండటం... ప్రస్తుతం ఆ వ్యాధి దాఖలాలే లేని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుండటం... అది మందులకు ఓ పట్టాన లొంగకుండా వ్యాధిగ్రస్తుల్లో 20 శాతం మంది మృత్యువాతపడుతుండటం అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే ఓ ఆరోగ్యాంశం అవుతుందని కూడా ఆండ్రూ హెచ్చరిస్తున్నారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెంచుకుంటున్న మరికొన్ని జబ్బులు ►క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా వల్ల వచ్చే నీళ్ల విరేచనాలు ఇప్పుడు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించేలా తయారయ్యాయి. ఈ క్లాస్ట్రీడియమ్ బ్యాక్టిరియా ఇటీవల యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్నట్లుగా తెలుసోది. ►గతంలో చిన్న పిల్లల్లో, పెద్దల్లో తరచూ వచ్చే సెగగడ్డలు అప్పట్లో చిన్న డోస్‌తో కేవలం మామూలు యాంటీబయాటిక్స్ తగ్గిపోయేవి. కానీ ఇప్పుడవి ఒక పట్టాన తగ్గడం లేదు. ►అప్పట్లో ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ (టీబీ), క్లెబిసిలియా నిమోనియా, సూడోమొనాస్ వంటి సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గానే లొంగిపోయేవి. కానీ ఇప్పుడవి మరింత మొండిగా మారాయి. ► ఈ వేసవిలో మామిడిపండ్లు కాస్త ఎక్కువగానే తిన్నప్పుడు కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగగానే కొందరు ఆన్‌కౌంటర్ మెడిసిన్ వాడుతుంటారు. ఎలాంటి మందులు వాడకపోయినా అవి మర్నాటికల్లా తగ్గిపోతాయి. ఇలా ఆన్‌కౌంటర్ మెడిసిన్స్ వాడటం వల్ల విరేచనాలే కాదు... మరెన్నో సమస్యలు మొండిగా మారుతున్నాయి. అందుకే ఆన్‌కౌంటర్ మెడిసిన్స్‌ను వాడకపోవడమే మంచిది. అందుబాటులో టైఫాయిడ్ వ్యాక్సిన్ టైఫాయిడ్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంతేకాదు... మనదేశంలో పిల్లలందరికీ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన (మ్యాండేటరీ) వ్యాక్సినేషన్ షెడ్యూల్ జాబితాలో ఉంది. టీసీవీ వ్యాక్సిన్ రూపంలో దీన్ని 9 – 12 నెలల పిల్లలకు ఇస్తుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే... రెండేళ్లు దాటిన పిల్లలకు దీన్ని ఇప్పించడం ద్వారా టైఫాయిడ్ నుంచి అనేక మంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చు. ఏ జబ్బుకు ఏ యాంటీ బయాటిక్... ఏ మోతాదులోనంటే? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి. దురుపయోగం చేయవద్దు... మన ప్రాణాలను రక్షించే ఈ యాంటీబయాటిక్స్ మందులను అదేపనిగా వాడటం వల్ల లేదా అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ మోతాదుల్లో వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి. మనకు చెడు చేసే సూక్ష్మజీవులు ఈ మందులకు నిరోధకత (రెసిస్టెన్స్) సాధిస్తే... ఆ తర్వాత మనల్ని రక్షించుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే యాంటీబయాటిక్స్‌ను దురుపయోగం చేసుకుని, వాటిని నిరుపయోగం చేసుకోకుండా, యాంటీబయాటిక్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. చదవండి: Green Tea- Weight Loss: గ్రీన్ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా? -
టీబీ లేకుండానే మందులిచ్చారు!
కృష్ణాజిల్లా, నూజివీడు : పట్టణంలోని జీఎంహెచ్ (అమెరికన్ ఆస్పత్రి)లోని ఎక్స్‌రే యూనిట్ సిబ్బంది ఒకరి ఎక్స్‌రే రిపోర్ట్ మరొకరికి ఇవ్వడంతో లేని టీబీ రోగానికి ఐదు నెలల పాటు మందులు మింగిన మహిళ ఉదంతమిది. ముసునూరు మండలం సూరేపల్లికి చెందిన కోకిలపాటి రజని (27) ఈ ఏడాది మే 30వ తేదీ అస్వస్థతగా ఉంటే వైద్యం కోసంపట్టణంలోని అమెరికన్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరిశీలించి ఊపిరితిత్తులు ఎక్స్‌రే తీయించడంతో పాటు కొన్ని రక్తపరీక్షలు సైతం చేయించి నెమ్ము, టీబీ లక్షణాలున్నాయని చెప్పగా, డబ్బులు పెట్టుకోలేమని రజని చెప్పడంతో ప్రభుత్వాస్పత్రికి వెళితే ఉచితంగా ఇస్తారని తెలిపారు. దీంతో ఏరియా ఆసుపత్రిలోని టీబీ యూనిట్ వద్దకు వెళ్లగా వాళ్లు ఎక్స్‌రే చూసి టీబీ మందులు ఇచ్చేశారు. ఆ మందులు ఆమె వాడుతుండగా తీవ్ర స్థాయిలో నీరసానికి గురవ్వడం జరుగుతుండటంతో ప్రతి రోజూ గ్రామంలోనే సెలైన్ పెట్టించుకుంటూ నెట్టుకొస్తోంది. పరిస్థితి మరింత తీవ్రమవుతుండటంతో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు శ్రీకాంత్ వద్దకు ఈ నెల 8న వచ్చి తన బాధ చెప్పుకోవడంతో ఆయన మళ్లీ ఎక్స్‌రే తీయించగా టీబీ ఏమీ లేదని తేలింది. అమెరికన్ ఆసుపత్రిలో తీసిన ఎక్స్‌రేను మంగళవారం డాక్టర్‌కు చూపించారు. ఆయన పరిశీలిం చి ఆ ఎక్స్‌రే బి.గోపయ్య అనే వ్యక్తిదని, దానిపై బి.గొప్పయ్య అని ఉందని చెప్పారు. అమెరికన్ ఆసుపత్రిలోని ఎక్స్‌రే యూనిట్ సిబ్బంది తప్పిదానికి రజనీ అవస్థపడాల్సివచ్చింది. బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. టీబీ యూనిట్‌లోనూ నిర్లక్ష్యమే.. ఎక్స్‌రే రిపోర్టు తీసుకువచ్చినప్పుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కళ్లె పరీక్ష చేసి నిర్ధారించాల్సిన టీబీ యూనిట్ సిబ్బంది కూడా ఇక్కడ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందరి నిర్లక్ష్యానికి రజనీ నాలుగు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. -
పాతికేళ్లకే టీబీ
ఒకప్పుడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎయిడ్స్ రోగుల్లో మాత్రమే టీబీ లక్షణాలు కన్పించేవి. అయితే ప్రస్తుత వాతావరణ కాలుష్యం.. చిన్న తనంలోనే స్మోకింగ్‌కు అలవాటు పడటం, విటమిన్ డి లోపం తదితర కారణాలతో యుక్తవయసులోనే వెలుగు చూ స్తుండటంపైసర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నెల 24న ప్రపంచటీబీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు నగరాన్ని స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడా స్థానాన్ని ట్యూబరిక్లోసిస్(టీబీ)ఆక్రమించింది. నగరంలో క్షయ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో ఏటా కొత్తగా సుమారు 15 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. ఎయిడ్స్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, మధుమేహం తర్వాత అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా క్షయను పరిగణిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష మందికి పైగా ఎయిడ్స్ రోగులు ఉండగా, వీరిలో మూడొంతుల మంది టీబీతో బాధపడుతున్నట్లు ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి వైద్యుల సర్వేలో వెల్లడైంది. గతేడాది హైదరాబాద్‌లో 7 వేలు, రంగారెడ్డి జిల్లాలో 6 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉండటం విశేషం. వీరిలో 12 ఏళ్లలోపు వారు 10 శాతం ఉంటే, 25–50 ఏళ్లలోపు వారు 60 శాతం మంది ఉన్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 41, రంగారెడ్డిలో 48 క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉండగా, వీటిలో చాలా చోట్ల ల్యాబ్ టెక్నిషియన్లు లేరు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఒకరి నుంచి 15 మందికి..: ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొత్తగా తొమ్మిది మిలియన్ల మంది టీబీ బారిన పడుతుండగా వీరిలో సుమారు 1/3 వంతు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే టీబీ ఎక్కువ ఉన్న దేశం మనదే కావడం గమనార్హం. దేశంలో ప్రతి సెకనుకు ఒకరు టీబీ బారిన పడుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చొప్పున..రోజుకు వెయ్యి మంది చనిపోతున్నారు. ఈ లెక్కన్న దేశంలో ఏటా మూడు లక్షల మంది టీబీతో మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఒక్కో టీబీ రోగి తను చనిపోయేలోగా మరో 15 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తున్నాడు. సంతానలేమితో బాధపడుతున్న చాలా మందిలో గర్భాశయ టీబీ కనుగొనబడుతుంది. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరి యా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది . ఇలా ఒకసారిగాలిలో కి ప్రవేశించిన బ్యాక్టీరియా 18–20 గంటల పాటు జీవిస్తుంది. ప్రతి వ్యక్తికి టీబీ ఉన్నా, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే అది బయట పడుతుంది. మనిషి శరీరంలో ఎంత కాలమైనా ఇది జీవిస్తుంది. శీతల గదిలో 8–10 రోజులు జీవిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుంది. లక్షణాలు ఇలా గుర్తించవచ్చు ♦ సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం. ♦ ఆకలి, బరువు తగ్గడం, నీరసం,ఆయాసం, ఛాతిలో నొప్పి ఉంటుంది. ♦ తెమడ పరీక్ష ద్వారా వ్యాధినినిర్ధారిస్తారు. ♦ ఆరు మాసాలు విధిగా మందులువాడాలి. ♦ బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి. ♦ బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి. ♦ వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పహ కలిగి ఉండాలి.– డాక్టర్ రమణప్రసాద్, కిమ్స్ -
క్షయ రోగికి ప్రతి నెలా రూ. 500
కర్నూలు (హాస్పిటల్): 2025 నాటికి ఎండ్ టీబీ స్టాటజీ ప్రోగ్రామ్‌లో భాగంగా మందులతో పాటు ప్రతి క్షయ రోగికి రూ.500 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం జిల్లా క్షయ నివారణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 2003 నుంచి ఇప్పటి వరకు 91,154 మంది టీబీ రోగులకు చికిత్స అందించామన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీతోపాటు నంద్యాల జిల్లా ఆసుపత్రిలో టీబీ న్యాట్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ మిషన్‌తో ఇతర వైద్యపరీక్షల్లో బయటపడని టీబీ జబ్బు కూడా బయటపడుతుందన్నారు. ఇదే యంత్రం ద్వారా యూనివర్శల్ డ్రగ్ సెన్సిటివిటి టెస్ట్ కూడా చేస్తున్నామన్నారు. టీబీ రోగులకు ఏ మందులు పడతాయో, ఏవీ పడవో గుర్తించి చికిత్స చేసేందుకు ఈ పరీక్ష ద్వారా సులభమవుతుందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా ఉచితంగా మందులు ఇస్తున్నామన్నారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు క్షయ నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. -
క్షయ పరీక్ష.. సులువు ఇక
ప్రొద్దుటూరు క్రైం : క్షయ వ్యాధి నిర్ధారణ కావాలంటే గతంలో నాలుగైదు రోజులు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వచ్చేది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు రెండు గంటల్లోనే టీబీ వ్యాధి నిర్ధారణ జరుగుతోంది. ఇటీవల జిల్లా ఆస్పత్రికి సీబీ నాట్ అనే కొత్త పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీని వల్ల టీబీ జన్యువును గుర్తిస్తారు. రూ.30 లక్షలు విలువ చేసే ఈ పరికరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు టీబీ కంట్రోల్ ప్రోగ్రాం కింద అన్ని ప్రముఖ ఆస్పత్రులకు మంజూరు చేశారు. ఒకేసారి నలుగురికి పరీక్షలు గతంలో టిబి వ్యాధి నిర్ధారణ జరగాలంటే ముందుగా జిల్లా ఆస్పత్రిలోని క్షయ వ్యాధి విభాగంలో సంప్రదించాలి. సంబంధిత అధికారి పరిశీలించి క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే రోగి గల్ల సేకరిస్తారు. మూడు రోజుల తర్వాత దాని రిపోర్టు వస్తుంది. ఒక్కోసారి మరింత ఆలస్యం కావచ్చు. ఇలా రోగులు అనేక మార్లు తిరగాల్సి వచ్చేది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే మంజూరు చేసిన సీబీనాట్ పరికరాన్ని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. టీబీకి సంబంధించి రెండు గంటల్లోనే రిపోర్టు వస్తుందని అధికారులు తెలిపారు. ఒక ఎంఎల్ స్పుటంలో 10 వేలకుపైగా కాలనీస్ ఉంటేనే టీబీ ఉందో లేదో తెలిసేది. సీబీ నాట్ మిషన్‌లో ఒక ఎంఎల్ స్పుటంలో కేవలం 130 కాలనీస్ ఉన్నా టీబీ నిర్ధారణ జరుగుతుందని సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఒకే సారి నలుగురికి పరీక్షలు నిర్వహించవచ్చు. యూపీఎస్ ద్వారా ఆన్లైన్ పరీక్షలు చేస్తారు. శరీరంలో ఏ భాగంలో ఉన్నా గుర్తింపు ఇంత వరకు ఊపిరి తిత్తులకు సంబంధించిన క్షయ వ్యాధిని మాత్రమే గుర్తించి, నివారణకు మందులను ఇచ్చే వారు. ఇది కూడా రోగి నుంచి సేకరించిన గల్ల ద్వారా నిర్ధారణ చేసేవారు. మనిషి శరీరంలోని ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు అంటున్నారు. హెచ్ఐవీ, షుగర్ ఉన్నవారికి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారికి, మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజలకు, బీడీ, చేనేతలకు టీబీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దగ్గుతో బాధపడుతున్న వీరు వెంటనే వైద్యులను సంప్రదించి సీబీ నాట్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఊపిరితిత్తుల్లో మినహా శరీరంలో ఇతర ఏ భాగాల్లో టీబీ సోకినా అది ఇతరులకు ప్రమాదం కాదన్నారు. ప్రత్యక్ష పర్యవేక్షణ పోగ్రాం ద్వారా మందులు టీబీ సోకిన వారికి కేంద్ర ప్రభుత్వం ఖరీదైన మందులను ఉచితంగా అందిస్తోంది. గ్రామాల్లోని వ్యక్తులకు ప్రొద్దుటూరు టీబీ కేంద్రం నుంచి ఆయా పీహెచ్‌సీలకు మందులను పంపిస్తారు. అంగన్వాడీ సిబ్బంది లేదా ఆశా వర్కర్ల పర్యవేక్షణలో మందులు వాడేలా చూస్తారు. టీబీ ఉన్న వారి టవల్‌ను ఇతరులు వాడకుండా చూడాలి. వయసుతో నిమిత్తం లేకుండా ఈ వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపారు. టీబీ రాకుండా ఉండేందుకు పిల్లలు పుట్టగానే బీసీజీ టీకాను వేస్తారన్నారు. టీబీ 100 శాతం నయం అయ్యే వ్యాధి క్షయ వ్యాధి 100 శాతం నయం అవుతుంది. ప్రభుత్వం ఖరీదైన మందులను ఉచితంగా అందచేస్తోంది. క్రమం తప్పకుండా కోర్సు వాడితే వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సీబీ నాట్ పరికరం ద్వారా 2 గంటల్లోనే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. – లక్ష్మీప్రసాద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు. -
సమష్టిగా క్షయను నిర్మూలించాలి
కర్నూలు(హాస్పిటల్): సమష్టికృషితో క్షయ వ్యాధిని నిర్మూలిద్దామని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ కేంద్రం అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ హెచ్ఐవీ, డయాబెటీస్ ఉన్న వారికి చాలా మందికి క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి సోకుతుందని చెప్పారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని, కానీ ఆరేళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి వస్తే ఇతరులకు సోకదన్నారు. క్షయతో జీవనప్రమాణాలు తగ్గుతాయన్నారు. ఊపిరితిత్తులకే గాకుండా అన్ని అవయవాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ క్షయ పూర్తిగా నిర్మూలించగలిగే జబ్బన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐఎంఏ కర్నూలు అధ్యక్షుడు కైప శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితమే క్షయ ఉందని, కాలక్రమేణా ఈ వ్యాధికి మెరుగైన వైద్యవిధానం అందుబాటులోకి రావడంతో మరణాల సంఖ్య తగ్గిందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ మీనాక్షి మహదేవ్ మాట్లాడుతూ టీబీ మందులు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయని చెప్పారు. అనంతరం క్షయ నిర్మూలనలో విశేష సేవలందించిన డాక్టర్ సుశీల్ ప్రశాంత్, ల్యాబ్‌టెక్నీషియన్ బి. వెంకటేశ్వర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ జె. శ్రావణ్‌కుమార్, డి. మౌలాలితో పాటు బెస్ట్ డాట్ ప్రొవైడర్ అంగన్వాడీ వర్కర్‌గా మీనాక్షి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకున్నారు. చివరగా క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలైన పీజీ వైద్య విద్యార్థులు శశిభరత్కుమార్రెడ్డి, సరితశ్యాముల్(ప్రథమ), పి.కళ్యాణి, శాంతికుమారి(ద్వితీయ), ఎ. గోపీచంద్, సాయికిరణ్(తృతీయ), టి. వినీత, సర్ఫరాజ్, ప్రభావతి, ఇ. వెంకటేశ్వర్లకు జ్ఞాపికలు అందజేశారు. -
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
- కలెక్టర్ అరుణ్‌కుమార్ పిలుపు - కాకినాడలో టీబీ నిర్మూలన దినోత్సవ ర్యాలీ కాకినాడ వైద్యం : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి(జీజీహెచ్)లో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏటా ఒక కొత్త రోగి నుంచి క్షయ వ్యాధి 15 మందికి సోకుతోందని, దీనినిబట్టి దీని ప్రభావం సమాజంపై ఏమేరకు పడుతోందో గుర్తించాలని అన్నారు. క్షయ నివారణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి, ఉచితంగా మందులు అందిస్తోందన్నారు. ఈ కారణంగా వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో రోగ నిర్ధారణకు చాలా రోజులు పట్టేదని, ప్రస్తుతం అత్యాధునిక విధానాలతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే కళ్లె పరీక్షతో క్షయ వ్యాధిని గుర్తిస్తున్నారని చెప్పారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా డాట్ చికిత్స పొంది ఆరోగ్యంగా జీవించాలని కోరారు. రోగులు సక్రమంగా మందులు వేసుకోకపోతే వ్యాధి తీవ్రత మరింత పెరిగిపోయే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రోగి ఇంటికే డాట్ ప్రొవైడర్లు వెళ్లి చికిత్స అందించే ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని వివరించారు. ఏజెన్సీలో క్షయ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అక్కడ ప్రత్యేక అవగాహన సమావేశాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 2,656 మందికి డాట్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో 261 మందికి ఈ చికిత్స అందిస్తున్నామన్నారు. వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, పారా మెడికల్, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వాస్పత్రి నుంచి బాలాజీచెరువు సెంటర్ వరకూ సాగింది. అక్కడ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ-2 రాధాకృష్ణమూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, జెబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ కాకినాడ వైద్యం : జిల్లాను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాకినాడ జీజీహెచ్ క్షయ నివారణాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 6,716 మంది టీబీ కేసులు నమోదు కాగా, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ (డాట్) చికిత్స ద్వారా 6,157 మందికి వ్యాధిని నయం చేశామన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాట్ప్లస్ సెంటర్ ద్వారా మొండి క్షయ రోగులకు రెండు లక్షలు విలువైన మందులను పీహెచ్‌సీల ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. దీని నివారణ కోసం డీఆర్‌టీబీ చికిత్స రెండేళ్లపాటు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. టీబీ వ్యాధిని కల్లి పరీక్ష ద్వారా నిర్ధారిస్తామన్నారు. జిల్లాలో కల్లి పరీక్షను చేసేందుకు 63 మైక్రోస్కోపి సెంటర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. రోగ నియంత్రణకు 23 ట్రీట్మెంట్ యూనిట్స్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రసుత్తం 2,656 మందికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.ఇందులో 73 మొండి క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. హెచ్ఐవీ సోకిన రోగుల్లో టీబీని నిర్ధారించడానికి జిల్లాలో కాకినాడలో ఒకటి, రాజమహేంద్రవరంలో రెండు సిబీనాట్ సెంటర్లు ఉన్నట్టు తెలిపారు. ఒక్కో మెషీన్ ఖరీదు సుమారు రూ.20 లక్షలు దాకా ఉందన్నారు. వీటిని 2015 నుంచి అందుబాటులోకి తీసుకురాగా ఫిబ్రవరి నెలాఖరుదాకా 9,680 మందికి పరీక్షలు నిర్వహించామని, 432 క్షయ కేసులు, 34 మొండి కేసులు గుర్తించామన్నారు. నేడు ర్యాలీ మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నుంచి బాలాజీచెరువు దాకా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ప్రారంభిస్తారన్నారు. ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. 23కెకెడీ165: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ -
హెచ్ఐవీ బాధితులకు త్వరగా క్షయ
కర్నూలు(హాస్పిటల్): ఇతర రోగుల కంటే హెచ్ఐవీతో బాధపడే వ్యక్తులకు క్షయ(టీబీ) త్వరగా వచ్చే అవకాశం ఉందని ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధులిక చెప్పారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్లో నేస్తం పాజిటివ్ నెట్వర్క్ విహాన్ సీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్ఐవీ–టీబీ వారోత్సవాల్లో ఆమె మాట్లాడారు. క్షయ వ్యాధి గాలి ద్వారా వ్యాపించే అంటు వ్యాధి అని తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు. క్షయ శరీరంలోని ఏ భాగానికైనా సోకుతుందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విహాన్ సీఎస్సీ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బి. నాగరాజు, ఏఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
హెచ్ఐవీ బాధితులకు టీబీ పరీక్ష తప్పనిసరి
కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు తప్పనిసరిగా టీబీ పరీక్ష చేయించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. హెచ్ఐవీ, టీబీ మందులపై శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏఆర్టీ, టీబీ యూనిట్ల వైద్యసిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. హెచ్ఐవీ, టీబీ రోగులకు ఏఆర్టీ థెరపి మందులు ఏఆర్టీ సెంటర్లోనే ఇస్తారన్నారు. గతంలో టీబీ రోగులకు ఆరు నెలలకు సరిపడా మందులు ఒకేసారి ఇచ్చేవారమని, ఇప్పుడు నెలకు ఒక బాక్స్ మాత్రమే ఇస్తున్నామన్నారు. ఇకపై ప్రతి నెలా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ.. టీబీ లేకుండా హెచ్ఐవీ ఉన్న వారు.. గతంలో ఏడు మాత్రలు మింగేవారని, ఇప్పుడు ఏడు మందులు కలిపి రెండు మాత్రలుగా చేశారన్నారు. రెండు మాత్రలను చించిన తర్వాత ఫోన్ నెంబర్ ఉంటుందని, ఆ ఫోన్ నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తేనే వారు మింగినట్లు ఆన్లైన్లో నమోదవుతుందన్నారు. ఎవరైనా ఫోన్ చేయకపోతే వారి ఇంటికి సిబ్బంది వెళ్లి మందులు మింగేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో(ఎయిడ్స్ అండ్ లెప్రసి) డాక్టర్ రూపశ్రీ, డీఐవో డాక్టర్ వెంకటరమణ, డబ్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ జోసఫ్, కర్నూలు, నంద్యాల ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 18 టీబీ యూనిట్లు మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ల్యాబ్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
డాట్స్ చికిత్సతో పూరిర్తి స్వస్థత
తాడేపల్లిగూడెం: డాట్స్ చికిత్సతతో టీబి రోగులకు పూర్తిస్వస్ధత చేకూరుతుందని జిల్లా క్షయనివారణాధికారి డాక్టర్ వి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌లో కళ్లె పరీక్ష నిర్వహణను పరిశీలించారు. మైక్రోస్కోపిక్ సెంటర్లో రికార్డులను. రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. డాట్‌సెంటర్ ద్వారా చికిత్సపొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల్లో క్షయ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువన్నారు. హెచ్ఐవి సోకిన వారు విధిగా క్షయ పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యితే ఏఆర్‌టీతో పాటు టీబి నియంత్రణకు డాట్స్ చికిత్స కూడా తీసుకొని పోషకాహారం క్రమబద్దీకరణలో వైద్యుల సూచనలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ వి.సుజాత, మొబైల్ టీం ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, వెంకట్రామన్నగూడెం టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంటు సూపర్వైజర్ కె.లక్ష్మీనారాయణ, సీహెచ్..జోషి, కె.అనూరాధ తదితరులు ఉన్నారు. -
డాట్స్ చికిత్సతో పూర్తి స్వస్థత
తాడేపల్లిగూడెం: డాట్స్ చికిత్సతతో టీబి రోగులకు పూర్తిస్వస్ధత చేకూరుతుందని జిల్లా క్షయనివారణాధికారి డాక్టర్ వి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌లో కళ్లె పరీక్ష నిర్వహణను పరిశీలించారు. మైక్రోస్కోపిక్ సెంటర్లో రికార్డులను. రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. డాట్‌సెంటర్ ద్వారా చికిత్సపొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల్లో క్షయ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువన్నారు. హెచ్ఐవి సోకిన వారు విధిగా క్షయ పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యితే ఏఆర్‌టీతో పాటు టీబి నియంత్రణకు డాట్స్ చికిత్స కూడా తీసుకొని పోషకాహారం క్రమబద్దీకరణలో వైద్యుల సూచనలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ వి.సుజాత, మొబైల్ టీం ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, వెంకట్రామన్నగూడెం టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంటు సూపర్వైజర్ కె.లక్ష్మీనారాయణ, సీహెచ్..జోషి, కె.అనూరాధ తదితరులు ఉన్నారు. -
అందుకే భారత్‌లో టీబీ ఇంతలా..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా క్షయ(ట్యుబరిక్యులోసిస్) వ్యాధి ప్రభావానికి లోనవుతున్న దేశం మనదే. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులపై దాడి చేసే బ్యాక్టీరియా కారక అంటువ్యాధి. భారత్‌లో ఈ వ్యాధి ఇంతలా ప్రభావం చూపడానికి కారణం ఇక్కడ అవలంభిస్తున్న ఔషధ విధానాలే అని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా పరిశీలనలో తేలింది. ప్రపంచంలో అత్యధికంగా యాంటీ బయాటిక్స్ వినియోగిస్తున్న దేశం ఇండియానే. అయితే.. ఈ యాంటీ బయాటిక్స్ మితిమీరిన వాడకం మూలంగానే భారత్‌లో క్షయ వ్యాధి మందులకు లొంగకుండా తయారవుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన మధుకర్ పాయ్ వెల్లడించారు. ఇక్కడి ఫార్మసిస్టులు క్షయ వ్యాధి లక్షణాలు గల వారికి ఎలాంటి ఔషధాలు ఇస్తున్నారు అనే అంశంలో నిర్వహించిన పరిశీలనలో నివ్వెరపరిచే విషయాలు వెల్లడయ్యాయి. పూర్తిగా క్షయ వ్యాధి లక్షణాలతో ఉన్నవారికి ఫార్మిసిస్టులు సాధారణ యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. సరిగ్గా క్షయ వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడే ఫస్ట్‌లైన్ యాంటీ టీబీ డ్రగ్స్(ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబుటాల్, స్ట్రెప్టోమైసిన్)ను ఫార్మసిస్టులు ఇవ్వడంలేదని గుర్తించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్న యాంటీ బయాటిక్స్ మూలంగా రోగులకు తీవ్ర హాని కలగడంతో పాటు.. భవిష్యత్తులో టీబీ మందులకు లొంగకుండా తయారవుతోందని పరిశోధకులు వెల్లడించారు. -
1670 టీబీ కేసులు నమోదు
పొందూరు: జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,670 క్షయ వ్యాధి(టీబీ) కేసులు నమోదయ్యాయని జిల్లా క్షయ నివారణాధికారి ధవళ భాస్కరరావు తెలిపారు. బుధవారం పొందూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పొందూరు పరిధిలో 230 కేసులు నమోదయ్యాయని చెప్పారు. క్షయ రోగులకు డాట్ ప్రొవైడర్ ద్వారా సేవలను అందిస్తున్నామని తెలిపారు. మొండి క్షయ బాధితులు 26 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్ఏ సురేష్ కుమార్ ఉన్నారు. -
నెల్లూరు పెద్దాస్పత్రి దీనస్థితి
► రోగులకు మందుల్లేవ్! ► ఆవేదన వ్యక్తం చేస్తున్న రోగులు పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి పరిస్థితి. వైద్య కళాశాల ఏర్పడ్డాక ఇక్కడ మెరుగైన సేవలందుతాయని ఆశించిన పేదలకు నిరాశే ఎదురవుతోంది. అన్ని రకాల మందులు దొరుకుతాయని భావించిన వారికి అత్యవసర మందులు సైతం లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. రకరకాల మందులు బయటే కొనుగోలు చేయాల్సి రావడంతో దిక్కులు చూడాల్సి వస్తోంది. నెల్లూరు(అర్బన్): ప్రజల చిరకాల వాంఛ నెల్లూ రు ప్రభుత్వ వైద్య కళాశాల. ఈ కళాశాల ఏర్పడ్డాక చిన్నపిల్లల ఆస్పత్రితో పాటు జూబ్లీ ప్రసూతి, టీబీ ఆస్పత్రులను పెద్దాస్పత్రిలో విలీ నం చేశారు. 750 పడకలుగా స్థాయి పెంచారు. పెద్ద సంఖ్యలో రోగులు పెరిగారు. ప్రతిరోజూ దాదాపు 900 నుంచి 1200 వరకు ఓపీ ఉంటుంది. అయితే వీరికి తగిన స్థాయిలో పలురకాల మందులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. ఒక రోజు ఉన్న మందులు రెండో రోజు ఉండటం లేదు. దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు.. మహిళలు, రక్తహీనత ఉన్న వారికి ఐరన్ మాత్రలు తప్పనిసరి. ప్రధా న మందుల షాపులో అసలు లేవు. అక్కడకు మందుల చీటీలు తెచ్చిన వారిని బయట కొనుక్కోమంటున్నారు. ప్రసూతి వార్డులో కూడా ఇవి ఖాళీ అయితే కొద్ది మేరకు మాత్రమే మళ్లీ ఏర్పాటు చేశారు. పాంటప్రజోల్ మాత్రలు తెచ్చామని సూపరింటెండెంట్ ఈనెల 28న తెలిపారు. 29న ప్రధాన మందులషాపు వద్దకు వెళ్లి అడిగితే అయిపోయాయని ఫార్మాసిస్టు చెప్పారు. సేవలు అంతంత మాత్రమే మందుల సంగతి అటుంచితే సేవలు కూడా అంతంత మాత్రంగానే అందిస్తూ రోగుల సహనాన్ని డాక్టర్లు పరీక్షిస్తున్నారు. సోమవారం సహజంగానే ఓపీలన్నీ రద్దీగా ఉంటాయి. ఈనెల 20న ఉదయం నుంచి ఎంసీహెచ్‌లో ప్రతి గది వద్ద పెద్దఎత్తున మహిళా రోగులు, గర్భిణులు నిండి పోయారు. అయితే సూపరింటెండెంట్ ఎంసీహెచ్ డాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోపు రోగులు నర్సులతో గొడవ పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఉదయం 11.00 గంటలకు వచ్చిన డాక్టర్లు హడావుడిగా రోగులను పరీక్షించారు. ఈ నెల 27 సోమవారం స్కానింగ్ చేసేదానికి డాక్టరమ్మ రాలేదు. దీంతో తమ బిడ్డల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆశతో వచ్చిన గర్భిణులు ఎదురు చూసీ చూసీ స్కానింగ్ చేయించుకోకుండానే నిరాశతో వెనుదిరిగిపోయారు. రోగుల చీటీలో మందుల వివరాలు రాయని డాక్టర్లు డాక్టర్లు మందులు రాసేటప్పుడు మెడికల్ షాపునకు ఒక చీటి, రోగుల కోసం ఓపీ చీటీ ఇస్తారు. ఓపీ చీటీలో మందుల వివరాలుండాలి. అందుకు విరుద్ధంగా కొంతమంది డాక్టర్లు మెడికల్ షాపునకు అందచేసే చీటీలోనే మందులు రాస్తున్నారు. వీటిని ఫార్మాసిస్టులు తీసుకుని భద్రపరచాలి. రోగులకు ఇచ్చే చీటీల్లో మందుల గురించి రాయడం లేదు. దీంతో షాపులో లేని మందుల గురించి రోగులకు ఏ చీటీలో రాయాలో ఫార్మాసిస్టులకు అర్థం కావడంలేదు. కొరతలేకుండా చూస్తాం మందుల కొరత ఎందుకు ఉందో విచారిస్తాం. కొరత ఉన్నవాటిని వెంటనే ఏర్పాటు చేసేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ భారతితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. చాట్ల నరసింహారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లోకల్ పర్చేజికి ఆర్డర్ పెట్టాం కొన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో వెంటనే లోకల్‌గా కొనుగోలు చేసేందుకు ఆర్డర్ పెట్టాం. త్వరలోనే వస్తాయి. డాక్టర్ భారతి, సూపరింటెండెంట్. షుగర్ మందు లేదన్నారు నాకు షుగర్‌కి చెందిన రెండు రకాలు మందులు రాశారు. అయితే గ్లిమిప్రైడ్ అనే షుగర్ మందు లేదని బయట కొనుక్కోమన్నారు. చీటీని మందుల షాపులో తీసుకున్నారు. నా ఓపీ చీటిలో మందుల వివరాలు రాసివ్వలేదు. బయట కొనుక్కోమన్న మందును చీటిలో రాసివ్వకపోతే నేనెలా కొనుక్కోగలను. - సుబ్బరత్నమ్మ, బాలాజీనగర్ 12 గంటలకే ఓపీ చీటీలు ఆపేశారు 12 గంటలకే ఓపీ చీటీలు ఆపేశారు. బతిమిలాడుకున్నా చీటీ రాయలేదు. నర్సులు ఎమర్జెన్సీ వార్డుకెళ్లి రాయిం చుకోమన్నారు. అడుక్కున్నా అక్కడా రాయలేదు. తెలిసిన వ్యక్తి వస్తే చివరికి ఎలాగోలా ఎమర్జెన్సీలో ఓపీ చీటి రాసి మందులు రాసిచ్చారు. అందులో కూడా పాంటప్రజోల్ మాత్ర లేదు బయట కొనుక్కోమన్నారు. -జి.వెంకటయ్య, వీరంపల్లి అందుబాటులో లేని కొన్ని మందులు 1. డెరిఫిలిన్ ఇంజక్షన్ (ఆయాసంతో వచ్చిన వారికి అత్యవసరం) 2. హైడ్రోకార్టిజోన్ ఇంజక్షన్ (రియాక్షన్, ఇతర సమస్యలకు) 3. అమికాసిన్ (గాయాలైనప్పుడు గాని, చిన్నపిల్లలకు గాని యాంటిబయాటిక్) 4. మెట్రోజిల్ ఇంజక్షన్ (విరేచనాలు, అమీబియాసిస్ లాంటి వ్యాధులకు) 5 ఎకోస్ప్రిన్ (గుండెనొప్పి వస్తే అత్యవసరంగా వేసుకోవాల్సిన టాబ్లెట్) 6. ర్యాన్టిడిన్ (యాంటిబయాటిక్, నొప్పుల మాత్రలు రాస్తే కడుపులో మంటరాకుండా ఉండేందుకు ఇది తప్పనిసరి) 7. మెగ్నీషియం సల్ఫేట్ ఇంజక్షన్ (బీపీతో ఉన్న గర్భిణులకు తప్పనిసరి) 8. బ్లడ్ సెట్ (రక్తం ఎక్కించేందుకు పైపు. రోగులు బయట రూ.150 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు) 9. యాంటి-డి (మదర్ పాజిటివ్ ఉండి, బేబీ నెగెటివ్ ఉంటే ఈ ఇంజక్షన్ తప్పని సరి. రూ.2వేల వరకు ఖరీదుంటుంది) 10. ఇన్సులిన్ ఇంజక్షన్ ( షుగర్ వ్యాధి కంట్రోల్ కాని వారికి అత్యవసరం) 11. ఐరన్ టాబ్లెట్లు (ప్రసూతి వార్డులో మాత్రమే ఉన్నాయి. మిగతా చోట్ల అందుబాటులో లేవు) 12. ఫోలిక్ యాసిడ్ (అండంలో బిడ్డ పెరుగుదలకు తప్పనిసరి. ఇవి కూడా లేవు) -
మామిడిపండు వేడి చేస్తుందా!
ఆయుర్వేద కౌన్సెలింగ్ మామిడిపండ్లు తింటే వేడి చేస్తుందని, ఒళ్లంతా సెగ్గడ్డలు వస్తాయని అంటుంటారు కదా... అది నిజమేనా. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడిపండ్లు తినవచ్చా? - ఎమ్. సుమన్, విశాఖపట్నం సంస్కృతంలో మామిడికి అనేక పర్యాయపదాలు ఉన్నాయి. ఆమ్ర, రసాల, సహకార, అతిసౌరభ, కామాంగ, చూతక, మంజరీ మొదలైనవి. మామిడిపండ్లు రెండు రకాలు. మొదటివి చెట్టుకు పండినవి. రెండోవి ముదిరిన కాయలను ఎండుగడ్డిలో పదిలపరచి, వేడిమి ద్వారా ముగ్గబెట్టినవి. (గమనిక : కార్బైడు వంటి రసాయనాల ద్వారా ముగ్గిస్తే మాత్రం అది విషతుల్యం. అది సహజంగా ముగ్గబెట్టిన రెండో కోవలోకి రాదు). సహజంగా సక్రమంగా ముగ్గబెట్టిన ‘పండు’ (కృత్రిమ పక్వ ఫలం) గుణాలు : చాలా తియ్యగా ఉంటుంది (మధుర రసం). చలవ చేస్తుంది (శీతవీర్యం). తేలికగా జీర్ణమవుతుంది (లఘువు). మలవిసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది (సరం). బలకరం. వీర్యవర్థనం (శుక్రకరం). మొత్తం పండు తింటే దీనివల్ల కలిగే ఫలం, ఫలితం కనిపిస్తాయి. అదే పిండి కేవలం రసం మాత్రమే స్వీకరిస్తే ప్రయోజనాలు తగ్గుతాయి. అలా రసం మాత్రమే తీసుకుంటే కాస్త ఆలస్యంగా జీర్ణమవుతుంది (గురువు). వాతహరం. కఫకరం. చెట్టుకు పండిన పండు : దీంట్లో తియ్యదనంతో పాటు కొంచెం పులుపు కూడా ఉంటుంది (అమ్లరసం). కాబట్టి పిత్తాన్ని వృద్ధిచేసి కొంచెం వేడిచేస్తుంది. వాతహరం. పూర్తిగా మగ్గని పండు అమ్లరసంతో కూడి, ఉష్ణవీర్యమై, మలవిసర్జనకు సహకారం అందించదు. కాబట్టి ఎలా పండినదైనా వాటిని అతిగా తింటే అనర్థమే. శ్లోకం : ‘‘తదేవ వృక్షసంపక్వం గురు వాతహరపరం మధురామ్లరసం కించిత్ భవేత్ పిత్త ప్రకోపనం; ఆమ్రం కృత్రిమ పక్వంచ తత్ భవేత్ పిత్తనాశనం... చూషితం తత్పరం రుచ్యం, బల్యం, వీర్యకరం లఘు; ... పక్వంతు మధురం వృష్యం స్నిగ్ధం బల సుఖ ప్రదం... హృద్యం, వర్ణం’’ కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వేసవి రాజ ఫలమైన మామిడిపండును ఆస్వాదించండి. ఒకవేళ పుల్లని మామిడి పండ్లను తిన్నట్లయితే, వెంటనే అరచెంచాడు జీలకర్రను నమిలి తినండి. లేదా మూడు గ్రాముల శుంఠి చూర్ణాన్ని తిని వేడినీళ్లు తాగండి. దుర్గుణాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. ఇది పండ్లను అధికంగా తినడం వల్ల కలిగే అనర్థాలకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు: తియ్యటి పండ్లను ఒకపూట ఆహారంగా నిర్భయంగా తినవచ్చు. అన్నం, రొట్టెల వంటి ఆహారంతో పాటు తినవద్దు. సాధారణంగా మధుమేహ రోగులు పాటించే ఆహార విహార (వ్యాయామం, ప్రాణాయామం, తగినంత నిద్ర మొదలైనవి) నియమాలను పాటిస్తూ, వ్యాధి తీవ్రతను బట్టి వాడే మందులను వాడుకుంటూ, ఒకరోజు మొత్తం మీద తీసుకోవాల్సిన ఆహారంలో భాగంగా మామిడిపండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. అప్పుడది వాతకరం కాదు. కాబట్టి మధుమేహానికి వ్యతిరేకం కాదని ఆయుర్వేద సిద్ధాంతం. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ స్కిన్ కౌన్సెలింగ్ నా కుడి చేతి మధ్యవేలిపై వెంట్రుకలు ఉండే భాగంలో తీవ్రమైన దురద వస్తోంది. దాంతో అక్కడ గీరుకున్న కొద్దీ అక్కడి చర్మం నల్లబారిపోయింది. నాకు తగిన పరిష్కారం చూపండి. - రమేశ్‌కుమార్, ఒంగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఆ భాగంలో బహుశా మీకు అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చిందేమోనని అనిపిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అక్కడ ఉంగరం ధరించడం లేదా మీరు వాడుతున్న హ్యాండ్ వాష్ కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు కారణాలు కావచ్చు, మీకు దేనివల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి దానికి దూరంగా ఉండటం నివారణ అంశాల్లో ప్రధానమైనది. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ కింది సూచనలు పాటించండి. ప్రతిరోజూ మీకు దురద వస్తున్న భాగంలో మాయిష్చరైజింగ్ క్రీమును రోజుకు రెండుసార్లు రాయండి. మెమటోజోన్ ఫ్యూరోయేట్ లాంటి మాడరేట్ కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌ను ప్రతిరోజూ మీకు దురద వస్తున్న ప్రాంతంలో రాయండి. దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున 3-5 రోజుల పాటు రాయాలి. అప్పటికీ దురద రావడం తగ్గకపోతే ఒకసారి మీ డర్మటాలజిస్ట్‌కు చూపించండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్ టీబీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. ఒక నెల రోజులుగా నాకు తీవ్రమైన దగ్గు, రాత్రిపూట కాస్త జ్వరం వస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డస్ట్ అలర్జీగానీ లంగ్ ఇన్ఫెక్షన్ గానీ అయి ఉంటుందని ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. కానీ ఏమాత్రం తగ్గలేదు. వారం క్రితం దగ్గినప్పుడు రెండుసార్లు కఫంలో ఎర్రటి చారలు కనిపించాయి. రక్తమేమోనని అనుమానంగా ఉంది. అసలు నాకు ఏమైందోనని భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - గిరిధర్, విజయవాడ మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీకు టీబీ (క్షయ) వ్యాధి సోకినట్లుగా అనుమానంగా ఉంది. ఈ వ్యాధి సోకినా మొదట్లో సాధారణంగానే ఉంటుంది. రెండు మూడు వారాలు దాటిన తర్వాతగానీ ఈ వ్యాధిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మీ విషయంలో కూడా అలాగే జరిగింది. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్‌ను సంప్రదించినట్లుగానే... అది తగ్గనప్పుడు కూడా మీరు మరోసారి ఆయన దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మీరు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. క్షయవ్యాధి నిర్ధారణకు సంబంధించి మీరు రెండు, మూడు రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అసలు వ్యాధి ఉందా, లేదా; ఉంటే ఏ దశలో ఉంది అనే అంశాలపై ఒక నిర్ధారణకు రావచ్చు. దీన్ని బట్టే మీ చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదయం లేవగానే వచ్చే కఫం (కళ్లె) పరీక్ష చేయించాలి. ఛాతీ ఎక్స్-రే తీస్తే వ్యాధిపై ఒక అంచనాకు రావచ్చు. ఇక 100 నిమిషాలలో గుర్తించే ఎన్ఏఏటీ పరీక్ష విధానం కూడా అమల్లోకి వచ్చింది. దానితో కూడా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ మీకు క్షయం ఉందని, అది చాలా అడ్వాన్స్డ్ దశలో ఉందని తేలితే ట్యాబ్లెట్స్ పనిచేయకపోవచ్చు. ఆ దశ వస్తే సర్జరీ చేయాల్సి రావచ్చు. అయినా ఆందోళన పడాల్సిందేమీ లేదు. టీబీ వల్ల లంగ్స్‌కు ఏర్పడిన ముప్పును ఇప్పుడు వైద్య ప్రక్రియలలో వచ్చిన అత్యాధునిక చికిత్సలతో వంద శాతం రూపుమాపే అవకాశం ఉంది. అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీని నిర్వహిస్తే మీకు సత్ఫలితాలు అందుతాయి. ఈ వ్యాధి చికిత్సకు సంబంధించి ఎలాంటి సొంత నిర్ణయమూ తీసుకోకూడదు. వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. డాక్టర్ అరుణ్ కనాలా సీనియర్ థొరాసిక్ (లంగ్) సర్జన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ -
మనుషుల్లో టీబీని గుర్తించే ఎలుకలు
బ్రస్సెల్స్: శిక్షణ పొందిన ఎలుకల ద్వారా మందుపాతరలను కచ్చితంగా గుర్తిస్తూ వచ్చిన అపోపో (ఏపీఓపీఓ) అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు ఆఫ్రికాకు చెందిన ఎలుకలకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనుషుల్లో టీబీ (ట్యూబర్క్లోసిస్)ని కచ్చితంగా గుర్తిస్తోంది. కొన్ని కేసుల్లో ల్యాబ్ టెక్నీషన్ కూడా టీబీని గుర్తించడంలో విఫలం చెందవచ్చని, కానీ తమ సంస్థ డాక్టర్లు శిక్షణ ఇచ్చిన ఎలుకలు మాత్రం టీబీని కచ్చితంగా గుర్తిస్తున్నాయని అపోపో, అమెరికా డెరైక్టర్ చార్లీ రిక్టర్ తెలియజేస్తున్నారు. ఓ మనిషిలో టీబీని గుర్తించాలంటే ల్యాబ్ టెక్నీషన్కు కనీసం నాలుగు రోజులు పడుతోందని, అదే శిక్షణ పొందిన ఓ ఎలుక 20 నిమిషాల్లో వంద శాంపుళ్లను గుర్తిస్తుందని రిక్టర్ వివరించారు. చాలా చౌకైన ఈ విధానాన్ని ప్రస్తుతం టాంజానియా, మొజాంబిక్ జైళ్లలో అమలు చేస్తున్నామని, త్వరలోనే ఈ విధానాన్ని ఈ దేశాల్లోని అన్ని జైళ్లలో అమలు చేస్తామని ఆయన తెలిపారు. పేద దేశాలకు ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. కఫంలోని శ్లేష్మం వాసనను పసిగట్టడం ద్వారా ఎలుక టీబీని గుర్తిస్తుందని, శాంపిల్‌లో టీబీ ఉన్న విషయాన్ని గుర్తించినట్లయితే ఎలుక కాసేపు దానిపైనే తచ్చాడుతుందని ఆయన వివరించారు. అయితే ఎలుక ద్వారా టీబీని గుర్తించే విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం లేదు. ఏ కొత్త విధానమైనా ల్యాబరేటరీ టెస్ట్‌లకు నిలబడాలని, కచ్చితమైన డాటా ఉండాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదన. వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా ఎయిడ్స్ తర్వాత ఎక్కువ మంది టీబీ కారణంగా మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 90 లక్షల మంది టీబీ బారిన పడుతుంటే అందులో 20 లక్షల మంది మరణిస్తున్నారు. -
పల్మొనాలజీ కౌన్సెలింగ్
నాకు ఎడతెరిపిలేకుండా దగ్గు వస్తోంది. టీబీ అయి ఉండవచ్చా? ఇలా ముందుకూడా వచ్చింది కానీ దానంతట అదే తగ్గిపోయింది. ఈసారీ అలాగే అవుతుందని ఎదురుచూస్తున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - శంకర్‌గుప్తా, జగ్గయ్యపేట నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మధ్య గొంతు దగ్గర గ్లాటిస్ అనే అవయవం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలిని గ్లాటిస్ నుంచి అత్యధిక పీడనంతో బలంగా నోటి ద్వారా ఒక్కసారిగా బయటకు వదిలేస్తే వెలువడేదే దగ్గు. మనలో పేరుకునే అనేక వ్యర్థాలను, కొన్ని ప్రమాదకరమైన ద్రవాలను బయటకు విసర్జించడానికి దగ్గు ఉపయోగపడుతుంది. దగ్గు అనేది టీబీ లక్షణం మాత్రమే కాదు. సైనుసైటిస్, నిమోనియా, ఆస్తమా వంటి జబ్బుల నుంచి గుండెజబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు అనేక వ్యాధులకు దగ్గు ఒక లక్షణం. కాబట్టి మీరు అదే తగ్గుతుందని ఊరుకోకుండా తక్షణం మీకు దగ్గర్లోని డాక్టర్ని కలిసి దగ్గుకు కారణాన్ని కనుగొని, దానికి తగిన చికిత్స తీసుకోండి. నేను విపరీతంగా పొగతాగుతాను. ఇప్పుడు స్మోకింగ్ మానేయాలనుకుంటున్నాను. దీంతో నాలో పేరుకుపోయిన పొగ తాలూకు కాలుష్యాలు బయటకు వెళ్తాయా? - కృష్ణమూర్తి, మాచర్ల మీరు పొగతాగడం మానేయాలనుకోవడం మంచి సూచన. మీరు మానేసిన 20 నిమిషాల్లోనే మీ ఊపిరితిత్తుల్లోంచి పొగ కాలుష్యాలను బయటకు నెట్టేసే పనిని మీ లంగ్స్ ప్రారంభిస్తాయి. ఊపిరితిత్తుల్లో మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ అనే కణాలుంటాయి. వీటి ఉపరితలం పొడవైన కణాలు ఉంటాయి. వీటిని సీలియా అంటారు. అవి నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు ఎంత వేగంగా ఉంటాయంటే... వీటిలో కొన్ని 1000 సార్లకు మించి స్పందిస్తుంటాయి. ఈ స్పందనల వల్ల వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేసే ప్రక్రియ కొనసాగుతుంటుంది. సీలియా సక్రమంగా పనిచేయడానికి, వాటి చుట్టూ పలచని మ్యూకస్ ఉంటుంది. ముక్కు ఉపరితలం వద్దకు రాగానే ఈ మ్యూకస్ ఎండిపోయి, గాలికి రాలిపోతూ ఉంటుంది. మీలోనూ మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ పనిచేసి ఇంతకాలం మీరు తాగిన పొగ వల్ల పేరుకున్న కాలుష్యాన్ని బయటకు పంపుతాయి. మీరు స్మోకింగ్ పూర్తిగా ఆపేసిన 3 - 5 ఏళ్ల కాలంలో మీ ఊపిరితిత్తులు పూర్తిగా శుభ్రపడి, మునపటిలా నార్మల్‌గా అవుతాయి. డాక్టర్ రమణప్రసాద్ వి.వి. సీనియర్ కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వ్యక్తి మృతి
స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి మరణించిన సంఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లా పంగలూరు మండలానికి చెందిన శ్రీనివాసరావు(45) అనారోగ్యానికి గురికావడంతో శనివారం ఒంగొలులోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మూడు రోజులుగా జలుబు, దగ్గుతో బాధ పడుతున్నానని చెప్పడంతో అనుమానం వచ్చిన వైద్యులు అతని నుంచి నమూనాలు సేకరించి స్వైన్‌ఫ్లూ నిర్ధారన టెస్టులకు పంపించారు. ఆదివారం ఉదయం రోగి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. అయితే రోగికి టీబీ వ్యాధి కూడా ఉందని వైద్యులు తెలిపారు. -
ఆ వ్యాధి నుంచి బయటపడ్డా: అమితాబ్
ముంబయి : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంతకాలం ఓ విషయాన్ని దాచిపెట్టారు. దాచిపెట్టిన ఆ విషాయాన్ని ఆయన ఎట్టకేలకు బయటపెట్టారు. అమితాబ్ నిర్వహణలో 2000లో మొదలైన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు క్షయా (టీబీ) ఉన్నట్లు వెల్లడైందట. క్షయపై ఆదివారం ముంబయిలో అవగాహన ప్రచారం ప్రారంభించిన అమితాబ్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఆ వ్యాధిన నుంచి బయటపడినట్లు ఆయన వెల్లడించారు.