బుల్లితెర నటి షబీనా షేక్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది.ఈ మేరకు తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. జులై 17ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కాబోయే భర్తతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో సీరియల్ నటులు సహా పలువురు ఈ జంటకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా షబీనా తొలుత ‘కస్తూరి’, ‘గృహలక్ష్మీ’, ‘నా పేరు మీనాక్షి’ వంటి సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ షోకు ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు సంపాదించుకుంది. కాగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న షబీనా కొంతకాలంగా సీరియల్స్‌లో కనిపించడం లేదు. టీవీ షోస్‌లోనూ అప్పుడప్పుడూ తళుక్కుమంటుంది. దీంతో పెళ్లి అయ్యాక షబీనా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుందా? లేదా అన్న సందేమం కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment