
బుల్లితెర నటి నవ్య స్వామి (Navya Swamy) బర్త్‌డే నేడు (మార్చి 17). పుట్టినరోజు వేడుకల కోసం ఆమె ఇప్పటికే బాలి వెళ్లిపోయింది. అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి కేక్ కట్ చేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. తనకు బర్త్‌డే విషెస్ చెప్పినవారికి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కృతజ్ఞతలు చెప్తూ రిప్లై ఇస్తోంది. అయితే ఓ స్పెషల్ బర్త్‌డే విషెస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడు రవికృష్ణ (Ravi krishna) ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్య కృష్ణతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. 'ఓ స్వామీ.. హ్యాపీ బర్త్‌డే.. ఈ ఏడాది ఒక పెద్ద సంఘటన జరగబోతోంది.
అదే కోరుకుంటున్నా..
నేనేం కోరుకుంటున్నానో నీకు బాగా తెలుసు. నన్ను స్పెషల్‌గా ఫీలయ్యేలా చేసే నీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చాలా మంచిదానివి. అలాగే నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. మరెన్నో సంతోషకరమైన బర్త్‌డేస్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. దీనికి నవ్యస్వామి స్పందిస్తూ.. థాంక్యూ.. నువ్వు కోరుకునేదేంటో నాకు తెలుసులే అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు.. ఏంటి, పెళ్లి చేసుకోబోతున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు.

సమ్‌థింగ్.. సమ్‌థింగ్..
కాగా రవికృష్ణ, నవ్యస్వామి ఆమె కథ సీరియల్‌లో కలిసి నటించారు. ఈ సీరియల్‌లో ఇద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలో రియల్‌లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. దానికి తోడు పలు ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు కలిసే వెళ్లేవారు. అయితే డేటింగ్ గురించి ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి అలాంటిదేం లేదని సులువుగా చెప్పేవాడు. ఇప్పుడేకంగా ఈ ఏడాది ఒక స్పెషల్ ఉండబోతుందనడంతో అది ఏమై ఉంటుందా? అన్న ఆసక్తి నెలకొంది. ప్రేమను అధికారికంగా ప్రకటిస్తారా? లేదా డైరెక్ట్‌గా పెళ్లి చేసుకుంటారా? అదీ కాకుండా ఇద్దరూ కలిసి ఏమైనా సినిమా చేస్తున్నారా? అని నెటిజన్లు రకరకాలుగా ఆరా తీస్తున్నారు.
సినిమా
విరూపాక్ష సినిమాతో విశేష గుర్తింపు తెచ్చుకున్న రవికృష్ణ ద బర్త్‌డే బాయ్ అనే థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఇది ఆహాలో అందుబాటులో ఉంది. గతేడాది లవ్‌మీ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా కోసం పుష్ప 2 ఆఫర్ వదిలేసుకున్నాడు. డేట్స్ కుదరకపోవడం వల్లే అంత పెద్ద సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చిందన్నాడు. రవికృష్ణ ప్రస్తుతం దండోరా సినిమా చేస్తున్నాడు.
చదవండి: రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. లక్షల్లో కాదు కోట్లల్లో పారితోషికం!
Comments
Please login to add a commentAdd a comment