navya
-
పాకల బీచ్‌లో పెను విషాదం
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ అనంతరం తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెండు బృందాలుగా సముద్ర స్నానానికి వచ్చినవారిలో ఆరుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరిని వారి స్నేహితులు, స్థానిక మత్స్యకారులు కాపాడారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామం శివన్నపాలేనికి చెందిన నోసిన మాధవ (24), అతని భార్య నవ్య (21), పిన్ని నోసిన సువర్ణరాణి, చెల్లెలు నోసిన జెస్సిక (13), మరదలు కందుకూరు మండలం కొళ్లగుంట గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని(14), మరో 10 మంది బంధువులతో కలిసి ఆటోలో పాకల బీచ్‌కు వచ్చారు. మగవారు మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లగా... మహిళలు ముందుగా సముద్రంలోకి దిగారు. వారు దిగిన ప్రాంతంలో చిన్నపాటి గుంతలు ఉన్నాయి. వాటిని గమనించకుండా వీరు ముందుకు వెళుతుండగా ఒక్కసారిగా అలలు ఉధృతంగా వచ్చి ముంచేశాయి. మాధవ, నవ్య, జెస్సిక, యామిని, సువర్ణరాణి సముద్రంలో కొట్టుకుపోయారు. సముద్రపు అలలపై దూరంగా నవ్య, సువర్ణరాణి తేలియాడుతూ కనిపించడంతో స్థానిక మత్స్యకారుడు సైకం శ్రీను, మాధవ స్నేహితుడు విశాల్ పడవలో వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత మాధవ, జెస్సిక, యామిని మృతదేహాలు అలలపై కనిపించడంతో పోలీసులు బయటకు తీసుకొచ్చి కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పండుగ కోసం స్నేహితుడు మాధవతో కలిసి ఇక్కడికి వచ్చానని, ఆనందంగా గడిపామని, తిరిగి వెళ్లే ముందు ఈ దుర్ఘటన జరిగిందని తెలంగాణలోని మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన విశాల్ అనే యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన కళ్లముందే ఐదుగురు సముద్రంలో మునిగిపోయారని, మత్స్యకారుల సహకారంతో ఇద్దరిని కాపాడామని, స్నేహితుడు మాధవ మరణించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు.స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు గల్లంతుఅదే సమయంలో సింగరాయకొండ శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి పవన్ (22) కూడా తన స్నేహితులతో కలిసి సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చాడు. అలల ఉధృతికి పవన్ సముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. పాకాల బీచ్‌ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించి మెరైన్ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పవన్ ఆచూకీ తెలిసే వరకు అదనపు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టాలని మెరైన్ పోలీసులకు ఎస్పీ దామోదర్ సూచించారు. -
వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. వయనాడ్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా యంగ్ డైనమిక్ లీడర్, కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను ఖరారు చేసింది. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.ఇక, బీజేపీ నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడంతో ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. నవ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. బీటెక్ చదవి ఉద్యోగం చేసిన నవ్య.. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో తన ముద్ర వేసి తక్కువ కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా వయనాడ్ బరిలోకి టికెట్ పొంది బంపరాఫర్ దక్కించుకున్నారు.నవ్య హరిదాస్ రాజకీయ నేపథ్యం..👉నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు.👉బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు.👉నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.👉బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.👉2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి.👉అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.👉నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది.Navya Haridas to take on PriyankaGandhi from the Wayanad Lok Sabha seat on a BJP ticket👍👍 pic.twitter.com/joo5dXrEhT— tsr. (@srikanth690935) October 19, 2024 -
ప్రేమవేధింపులకు విద్యార్థిని బలి
యాచారం: ప్రేమపేరుతో పెడుతున్న వేధింపులను భరించలేక ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ నరేశ్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన గుత్తి జంగయ్య, పద్మ దంపతుల కూతురు నవ్య(14) కందుకూరు మండలం మీర్ఖాన్పేట ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన తోటి విద్యార్థి కొమ్మగోని నందీశ్వర్ తనను ప్రేమించాలని నవ్యను కొద్దికాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆరునెలల క్రితమే బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పడంతో నందీశ్వర్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ వెంటపడటం ప్రారంభించాడు. బాలిక ఇంటి చుట్టూ తిరుగుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన క్లాస్మేట్ రాజేశ్‌తోపాటు మరోతోటి విద్యార్థిని సహకారంతో ఇన్‌స్ట్రాగామ్(బాలిక కుటుంబసభ్యుల ఫోను)లో నవ్యను వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వ్యవసాయ పనులు ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న ముగ్గురు విద్యార్థులను పిలిచి విచారిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పెళ్లి రోజే.. తీవ్ర విషాదం!
నిజామాబాద్: ఐదు నిమిషాల్లో ఇంటికి చేరి పెళ్లిరోజు వేడుకల్లో పాల్గొనాల్సి ఉండగా మృత్యువు వెంటాడింది. భిక్కనూరులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన జమ్మగౌని పేట స్వామి, నవ్వ(38) దంపతులు పెళ్లి రోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం కూడెళ్లి రాజరాజేశ్వరాలయానికి బైకుపై వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరుగుపయనమయ్యారు. జాతీయరహదారి నుంచి భిక్కనూరు చర్చి ప్రాంతం నుంచి మండల కేంద్రంలోకి వస్తుండగా హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు వీరి బైకును ఢీకొట్టింది. దీంతో నవ్య రోడ్డుపై పడిపోయి అక్కడి కక్కడే మృతి చెందింది. స్వామిగౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేవారు. నవ్య మరణవార్త తెలియగానే గ్రామస్తులు వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు కంటతడిపెట్టారు. ఇవి చదవండి: అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి -
ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్ నవ్య
సాక్షి, జనగామ: జానకీపురం సర్పంచ్ నవ్య గుర్తున్నారా? స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై వేధింపుల ఆరోపణలు.. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌గా మారిపోయారామె. ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె ఇవాళ నామినేషన్ వేశారు. కుర్చపల్లి నవ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమె.. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నవ్య సర్పంచ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేసి రాజయ్యపై తీవ్ర విమర్శలే చేశారామె. అయితే.. నవ్య చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదన కూడా ఉంది. కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆ మధ్య మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సర్పంచ్ నవ్య.. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. చదవండి: సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్ -
సెల్‌ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ
దుబ్బాక టౌన్: అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్ చిచ్చు రాజేసింది. ఫోన్‌కోసం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, చెల్లెలు క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మర్గల శంకర్, వసంత దంపతులకు ముగ్గురు కూతుర్లున్నారు. రెండో కుమార్తె నందిని డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్న కుమార్తె నవిత అలి యాస్ నవ్య (18) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఉదయం ఇద్దరూ సెల్‌ఫోన్ విషయమై గొడవ పడ్డారు. ఇది గమనించిన తల్లి, వారిని మందలించి ఫోన్ ను బీరువాలో పెట్టి తాళం వేసి పని కోసం వెళ్లింది. దీంతో అప్పటికే ఆవేశంలో ఉన్న నవిత గడ్డిమందు తాగింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నందిని, చెల్లి అపస్మరక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు చేరుకున్నా రు. వెంటనే నవితను దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం సిద్దిపేట హాస్పిటల్‌కు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నవ్య మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
-
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ధర్మసాగర్(హన్మకొండ): స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై ధర్మసాగర్ మండలం జాన కీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చినట్టు తెలిసింది. జూన్ 21న ఎమ్మెల్యే టి.రాజయ్య, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్, నవ్య భర్త ప్రవీణ్‌లపై వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సర్పంచ్ నవ్య కేసుపై సమాచారం సేకరించాలని పోలీసులను ఆదేశించాయి. ఈ క్రమంలో వేధింపులకు సంబంధించిన ఆధారాలు అందజేయాలని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్‌లు సర్పంచ్ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని చెపుతున్నారు. సర్పంచ్ నవ్య నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించలేదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు బుధవారం పోలీసులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య.. కేసు నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని చెబుతోంది. చదవండి: ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సర్పంచ్ వివాదంలో కొత్తమలుపు
-
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంలో కీలక పరిణామం
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వేధింపుల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రామాభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తూ ఎమ్మెల్యే రాజయ్య ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వడంతో సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమక్షంలో రాజయ్య ఇచ్చిన ప్రొసీడింగ్ లేఖ చూపించి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరంటూ ప్రస్తుతం ఎమ్మెల్యే మంజూరు చేసిన రూ.25 లక్షలు గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వద్ద తన భర్త తీసుకున్న ఏడు లక్షలు ఏదైనా అమ్మి తిరిగి ఇచ్చేయాలని భర్తకు ఆల్టిమేటం ఇచ్చారు. తల తాకట్టు పెట్టైన ఏడు లక్షలు భర్త తిరిగి చెల్లించాల్సిందేనని సూచించారు. నిజాయితీగా ఎమ్మెల్యే వేధింపులపై పోరాటం కొనసాగిస్తానని, ఆధారాలతో మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానని నవ్య చెప్పారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
-
ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు
సాక్షి, జఫర్‌గఢ్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య పై ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలపై నిజానిజాల ఆధారంగా ప్రభుత్వం, పార్టీపరంగా చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొ న్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను ఓ విలేకరి ప్రస్తావించగా.. శ్రీహరి సమాధానమిస్తూ.. రాజయ్యపై వచ్చిన ఆరోపణలపై పోలీసు విచారణ జరుగుతోందని చెప్పారు విచారణలో తేలిన అంశాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలుంటాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజయ్య వేధింపులపై ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు జానకిపురం సర్పంచ్ నవ్య. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య, సరైన ఆధారాలతో రేపు మహిళా కమిషన్‌ను కలుస్తానని తెలిపారు. బెదిరింపు కాల్స్, అసభ్యకరంగా మాట్లాడే కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీపీ కవితతో తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజాయితీగా పోరాడతానని స్పష్టం చేశారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి గుణపాఠం కావాలనే తాను పోరాడతానని నవ్య చెప్పారు. ఎమ్మెల్యే వేధించిన ఆధారాలు అవసరమైనప్పుడు బయటపెడతానని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఐదు జిల్లాలపై సర్కార్ ఫోకస్.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు! -
మహిళా కమిషన్ల ముందుకు నవ్య కేసు
ధర్మసాగర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలమీద విచారణ చేపట్టి నివేదిక అందజేయాల్సిందిగా మహిళా కమిషన్లు పోలీసు శాఖను ఆదేశించాయి. కాగా, ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య శనివారం మరోసారి మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే వద్ద నయాపైసా కూడా తీసుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. సీడీఎఫ్ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టనని.. అందరి బండారం బయట పెడతానని ఆమె హెచ్చరించారు. నోటీసులు జారీ చేసిన పోలీసులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతోపాటు మిగతావారిపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు, ఫోన్ రికార్డులు, డాక్యుమెంటరీ సాక్ష్యం, ఇతర ఏ విధమైన ఆధారాలు ఉన్నా తమకు అందజేయాలని ధర్మసాగర్ పోలీసులు, కాజీపేట ఏసీపీ ఆమెకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారని మీడియా నవ్యను ప్రశ్నించగా అడ్వొకేట్ ద్వారా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు అప్పగిస్తానని తెలిపారు. -
నవ్య ఆరోపణలు సుమోటోగా స్వీకరించిన జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్
-
నా భర్తను ట్రాప్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు : సర్పంచ్ నవ్య
-
వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు
సాక్షి, వరంగల్: స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య- జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వేధింపుల ఎపిసోడ్ కొత్తమలుపు తిరిగింది. సర్పంచ్ నవ్య ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్ లు సుమోటోగా స్వీకరించి.. విచారణ నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా నవ్యకు రెండు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రెండు రోజుల్లో సమర్పించాలని సర్పంచ్ నవ్యను నోటీసుల్లో కోరారు ధర్మసాగర్ ఇన్స్పెక్టర్. అలాగే.. కాజీపేట ఏసీపీ కార్యాలయం నుంచి కూడా మరో నోటీసు నవ్యకు వెళ్లింది. మూడు రోజుల్లోగా సాక్ష్యాలతో తమను సంప్రదించాలని, విచారణకు సహకరించాలని ఏసీపీ కార్యాలయం కోరింది. ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నవ్య తన భర్త, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌పై పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య ఫిర్యాదు టైంలోనే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నవ్య చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సమాచారం. కాకపోతే విచారణ చేపట్టి.. తదుపరి చర్యలుచేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే.. నవ్య మాత్రం ఆ ఫిర్యాదుపై ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారని తెలుస్తోంది. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైస ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ బాండ్ పేపర్ పై అప్పుగా 20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టమని ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తపై ఆరోపణలు చేసిన నవ్య భర్తతో కలిసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎమ్మెల్యే రాజయ్యను సస్పెండ్ చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల ముందు ప్రజలకు పలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించిన సీఎం కేసీఆర్.. చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు, మహిళపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాజయ్యను తక్షణమే సస్పెండ్ చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాల దగా’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బస్టాండ్ సమీపాన అంబేడ్కర్ సర్కిల్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఇందిర మాట్లాడుతూ.. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం తదితర హామీలు ఏమయ్యాయ ని ప్రశ్నించిన ఆమె.. పదేళ్ల పాలనలో రాష్ట్రంలో అవి నీతి పెరిగిపోయిందని అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లకావత్ ధన్వంతి, పార్టీ నాయకులు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, కీసర దిలీప్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, చింత ఎల్లయ్య, సింగపురం వెంకటయ్య, ఐలపాక శ్రీను, కోరుకొప్పుల మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్
-
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్
సాక్షి, వరంగల్: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మధ్య వేధింపుల పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నవ్య తన భర్త, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌పై పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య స్పష్టం చేశారు. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైస ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ బాండ్ పేపర్ పై అప్పుగా 20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టమని ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తపై ఆరోపణలు చేసిన నవ్య భర్తతో కలిసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం.. -
సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం..
సాక్షి, వరంగల్: బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం సర్పంచ్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఎమ్మెల్యే రాజయ్యపై ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాటికొండ రాజయ్య ఓ మహిళా ప్రజాప్రతినిధి ద్వారా డబ్బు ఆశచూపి భర్తను ట్రాప్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆరోపణలు నిజం కాదని, ఎమ్మెల్యేతో రాజీ కుదిరినట్లు బాండ్ పేపర్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వేధింపుల విషయంలో మూడు నెలల క్రితం సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో గ్రామాభివృద్ధికి 20 లక్షలు ఇస్తానని రాజయ్య చెప్పారని సర్పంచ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు గతంలో అప్పు కింద రూ. 20 లక్షలు తీసుకుంటున్నట్లు బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని భర్త ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకున్నాననేది అవాస్తమని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తానంటున్నారు సర్పంచ్ నవ్య. తనకు, తన భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య వల్ల తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని అన్నారు. తమకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణమని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతానని చెప్పారు. చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి కాగా నవ్య ఆరోపణలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే రాజయ్య నిరాకరించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్యను సర్పంచ్ నవ్య ఆరోపణపై నో కామెంట్ అంటూ వెళ్ళిపోయారు. నవ్య భర్త ప్రవీణ్ మాత్రం గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ఇస్తానన్న ఫండ్స్ ఇవ్వకపోగా తమకు 25 లక్షలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. తమ పేరిట గ్రామ పెద్ద మనిషి రూ. 5 లక్షలు తీసుకోవడంతోనే ఈ గొడవ మొదలైందని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు నవ్య సంతకం పెడితే పది లక్షలు వస్తాయని భార్యకు చెప్పడంతో తాను ఎమ్మెల్యే, వారి అనుచరులతో కుమ్మక్కైనట్లు ఆరోపిస్తుందని తెలిపారు. అసత్య ప్రచారమే తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే రాజయ్య నా భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు: నవ్య
-
బుల్లితెర కథానాయిక నవ్య స్వామి గ్లామరస్ (ఫొటోలు)
-
హైదరాబాద్: మంత్రాలు చేసి నా బిడ్డను చంపేశారు!
సాక్షి, హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ బస్తీలో ఆత్మహత్య చేసుకున్న టీనేజర్ వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెను క్షుద్ర పూజలు చేసి బలవన్మరణానికి పాల్పడేలా చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ ఇంటి ముందు ఎవరో క్షుద్ర పూజలు చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు స్పందించలేదని నవ్య తల్లి చెబుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది నవ్య. అయితే తమ ఇంటి ముందు వారం నుంచి ఎవరో పూజలు చేస్తున్నారని, మంత్రాలు చేసి తన కూతురిని చంపేశారని నవ్య తల్లి వాపోతోంది. ‘‘గత వారం రోజులుగా ఇంటి ముందు క్షుద్రపూజలు చేస్తున్నారు. నిమ్మకాయలు, దీపాలు, బొమ్మలు, పసుపు-కుంకుమతో పూజలు చేస్తున్నారు. వాటిని ఫొటోలు తీశాం. వాటిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. కానీ, వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. పోలీసులు చర్యలు తీసుకుని.. నిందితులను పట్టుకుని ఉంటే ఇవాళ నా కూతురు ప్రాణాలతో ఉండేదేమో అంటూ సాక్షితో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నవ్య తల్లి. బుధవారం ఉదయం కూడా నవ్య బాగానే ఉందని, తనను.. తన భర్తను పనులకు నవ్వుతూ సాగనంపిందని, ఇవాళ(గురువారం) కాలేజీకి వెళ్తానని కూడా నవ్య చెప్పిందని ఆమె జరిగిందంతా వివరించారు. మరోవైపు నవ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆత్మహత్య కేసును.. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రకాష్ రాజ్ నా గురించి మైక్ లో చెప్పిన మాట
-
ఆరు గంటలు.. ఇంట్లోనే మకాం వేసి.. 10 లక్షలు దోచేసి.. క్యాబ్‌లో చెక్కేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తల్లి, కూతురును కత్తితో బెదిరించి ఓ ఆగంతకుడు రూ.10 లక్షలతో ఉడాయించాడు. నిందితుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు నివాసం ఉంటున్నారు. కుటుంబం అంతా గురువారం రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి వరకు ఇంటి పరిసరాల్లో కాపుకాసిన ముసుగు ధరించిన ఓ యువకుడు.. గోడ మీదుగా నిచ్చెన వేసుకొని ఇంటి ఆవరణలో దిగాడు. రాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే వారి కళ్లుగప్పి లోనికి ప్రవేశించాడు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో రాజు కూతురు నడింపల్లి నవ్య (30) ఉంటున్న గదిలోకి వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఎనిమిదిన్నర నెలల నిండు గర్భిణి అయిన నవ్య.. ఆ ఆగంతకుడిని చూసి వణికిపోయింది. అరిచేందుకు యత్నించగా.. ఆమెను కత్తితో పొడుస్తానని హెచ్చరించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తన ఒంటి మీద, బీరువాలో ఉన్న నగలు ఇస్తానని తన దగ్గర నగదు లేదని ఆమె వేడుకుంది. అయినాసరే ఆ దొంగ వినిపించుకోలేదు. ఈ క్రమంలో నవ్య పెట్టిన కేకలతో అప్రమత్తమైన ఆమె తల్లి లీల(54) ఆ గదిలోకి పరిగెత్తుకురాగా.. ఆ ఆగంతకుడు ఆమెను కూడా కత్తితో బెదిరించి ఓ మూలన కూర్చోబెట్టాడు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించాల్సిందిగా బెదిరించాడు. దీంతో నవ్య డబ్బులు కావాలని తన భర్తకు ఫోన్ చేసింది. ఆయన రూ. 8 లక్షలు ఆమె బావతో పంపించాడు. దీంతో లీల గేటు వద్దకు వచ్చి అతడి నుంచి నగదు తీసుకొని లోనికి వెళ్లింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే కూతురును హత్య చేస్తానని బెదిరించడంతో ఆమె రూ. 8 లక్షలు తీసుకొచ్చిన అల్లుడికి ఈ విషయం చెప్పలేదు. ఈ విషయాలు ఏమీ తెలియని ఎన్.ఎస్.ఎన్.రాజు తన గదిలో నిద్రిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10 గంటల సమయానికి తల్లీ, కూతురు ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు కలిపి మొత్తం రూ.10 లక్షలను నిందితుడి చేతిలో పెట్టారు. అనంతరం నవ్య మొబైల్ ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయగా ఆగంతకుడు అందులో పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న బాధితులు ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓలా క్యాబ్‌లో నిందితుడు షాద్‌నగర్ బస్టాప్‌లో దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆరుగంటల పాటు తల్లీ, కూతురును గదిలో బంధించి రూ. 10 లక్షలతో ఉడాయించిన ఆగంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్కా్వడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడినట్లు క్యాబ్ డ్రైవర్ వెల్లడించడంతో పోలీసులు పాత నేరస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. -
నవ్యస్వామితో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు
బుల్లితెర నటుడు రవికృష్ణ-నవ్య స్వామి జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరు అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలకి జంటగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే కలిసి ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అలాంటిదేమీ లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పట్నుంచో సమాధానం ధాటేస్తున్న రవికృష్ణకు తాజాగా మరోసారి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీకు, నవ్యస్వామికి ఉన్న రిలేషన్ ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. సీరియల్లోనే తాము మొదటిసారి కలుసుకున్నామని, అప్పట్నుంచి తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు. అయితే ఒకవేళ నవ్యస్వామి వచ్చి ప్రపోజ్ చేస్తే మాత్రం ఆలోచిస్తాను అంటూ ఆమెతో రిలేషన్‌షిప్‌పై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం రవికృష్ణ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రీసెంట్గా విరూపాక్ష సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..!
వరంగల్: మహిళా సర్పంచ్‌పై లైగింక వేధింపుల ఆరోపణలతో ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే సార్‌ను ఓ ఆటా ఆడేసుకుంటున్నారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న ఎమ్మెల్యే.. మహిళలకు సంబంధించి తరుచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఎమ్మెల్యే రాజయ్య తనను లైగింకంగా వేధిస్తున్నాడని హనుమకొండ/జనగామ జిల్లా పరిధి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య ఆరోపించడంతో మూడు రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీతో సహా అన్ని వర్గాల నుంచి ఆగ్రహం పెల్లుబికడంతో నిరసన సెగ ప్రగతిభన్ను తాకింది. పార్టీ వర్గాలు ఓపైపు ఆరా తీస్తుండగానే.. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..! గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే రాజయ్య మహిళలకు సంబంధించిన ఏదో ఒక వివాదంలో తెరపైన కనిపిసూ్తనే ఉన్నాడు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను కేబినెట్ నుంచి ఏకంగా బర్తరఫ్ చేయడం అప్పట్లో హాట్‌టాఫిక్‌గా మారింది. దానిపై అనేక ముచ్చట్లు సైతం వినిపించాయి. ఇదిలా ఉంటే.. గతంలో వేలేరు మండలంలోని ఓ ఊరికి చెందిన మహిళతో ఫోన్లో అసభ్యకరంగా.. శవ్వ, శవ్వ అంటూ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడిన మాటలుగా.. ఆడియో రికార్డు ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశం కాగా.. అది తన వాయిస్ కాదని రాజయ్య కొట్టిపారేశారు. ఆ తర్వాత లింగాలఘణపురంలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో సైతం ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. ఆన్లైన్లో హల్చల్ చేశాయి. ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లాలో లక్ష మందికి పైగా పిల్లలు తన వల్లనే పు ట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు సైతం విమర్శలను ఎదుర్కొనేలా చేసింది. అలాగే లింగాలఘణపురం మండలంలో బతుకమ్మ చీరల పంపిణీలో సీఎం కేసీఆర్ అందరికీ భర్త లాంటి వాడని నోరుజారీ.. సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించడంతో ఎమ్మెల్యేకు అధిష్టానం నుంచి మొట్టికాయలు వేసే వరకు దారి తీసింది. మహిళా కమిషన్ ఆదేశం..పోలీసుల విచారణ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్çపర్సన్ సునీత స్పందించారు. కేసును సుమోటోగా తీసుకుని.. విచారణకు డీజీపీని ఆదేశించారు. దీంతో పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఎమ్మెల్యే.. పార్టీ పెద్దల సూచనలు పాటిస్తూ.. ఆదివారం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. సర్పంచ్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. ప్రొటోకాల్ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే.. మహిళా లోకం తనను క్షమించాలని కోరగా.. నవ్య పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెబుతూనే.. ఎమ్మెల్యేకు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేసింది. వేధింపులకు గురిచేసిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సర్పంచ్ ఇంటికి వెళ్లడంతో నాలుగు రోజుల వివాదానికి తెరపడగా.. మహిళా కమిషన్ విచారణకు ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సర్పంచ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటలిజన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం. ఈ విషయమై సీఎంతోపాటు మంత్రి కేటీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. -
ఒకే వేదికపైకి రాజయ్య, నవ్య
సాక్షి ప్రతినిధి, వరంగల్/ధర్మసాగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలకు సంబంధించి.. ఆమెతోపాటు ఎమ్మెల్యే టి.రాజయ్య ఒకే వేదికపైకి వచ్చారు. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామానికి వెళ్లిన రాజయ్య.. సర్పంచ్ కురుసవల్లి నవ్య, ఆమె భర్త ప్రవీణ్‌లతో చర్చించారు. తర్వాత వారంతా కలిసి జానకీపురంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధ కలిగితే క్షమాపణలు చెప్తున్నా: రాజయ్య మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. ‘‘నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నాను. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాను. నాకు నలుగురు చెల్లెళ్లు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా. నేను పనిచేసే క్రమంలో ఎక్కడైనా, ఎవరైనా మానసిక క్షోభకు గురైతే మహిళా సమాజానికి క్షమాపణలు చెప్తున్నా.. తెలిసీ తెలియక తప్పులు జరిగితే ఒప్పుకోక తప్పదు. జానకీపురం గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నా. సర్పంచ్ నవ్య, ప్రవీణ్‌లను అన్నిరకాలుగా కాపాడుకుంటాను. నేను చేసిన శిఖండి వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుతా. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..’’అని పేర్కొన్నారు. పార్టీ పెద్దల ఆదేశాలతో.. సర్పంచ్ కె.నవ్యపై ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా వచ్చి ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై దుమారం రేగింది. ఈ క్రమంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకే.. రాజయ్య, కొందరు పార్టీ నేతలతో కలిసి జానకీపురం వెళ్లినట్టు తెలిసింది. రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసు సర్పంచ్ నవ్య ఆరోపణల అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా వచ్చిన అభ్యర్థనపై మహిళా కమిషన్ ఆదివారం స్పందించింది. రాజయ్యకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్‌కు కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి లేఖ రాసినట్టు తెలిపింది. మహిళల పట్ల పిచ్చి వేషాలు వేయొద్దు: నవ్య ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, వివక్ష చూపితే సహించేది లేదని సర్పంచ్ నవ్య పేర్కొన్నారు. ‘‘చెడును కచ్చితంగా ఖండిస్తాను. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం. ఎమ్మెల్యే రాజయ్య వల్లే నేను సర్పంచ్ అయ్యాను. అయితే రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దు. ఎవరైనా మహిళలపై పిచ్చివేషాలు వేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టడానికైనా వెనుకాడను. ముఖ్య నాయకులు వారి పద్ధతి మార్చుకుని మహిళలను గౌరవించాలి. ఇక మీదట తప్పులు చేయకూడదు. గతంలో జరిగిన తప్పులను క్షమిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాను. నేను చేసిన ఆరోపణలు నిజం. సమాజంలో మహిళలు కొన్ని విషయాల్లో కొందరి చేత మోసపోతున్నారు. అలాంటి వారు బయటికి వచ్చి నిలదీయాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే వారిపక్షాన నేను ముందుండి కొట్లాడుతా..’’అని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం గ్రామ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదని.. ఇప్పటికైనా అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, వరంగల్: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం.. సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య.. మీడియా సమక్షంలో ఆమెకు క్షమాపణ చెప్పారు. సర్పంచ్ భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రాజయ్య.. నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. వేధిస్తే భరితం పడతాం: సర్పంచ్ నవ్య సర్పంచ్ నవ్య మాట్లాడుతూ, మహిళలకు అన్యాయం జరుగుతోందని, తాను మాట్లాడిన ప్రతి మాట నిజం అంటూ మండిపడ్డారు. అన్యాయాలు, అరాచకాలు సహించవద్దని ఆమె అన్నారు. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, మహిళలను ఎవరైనా వేధిస్తే భరితం పడతామని సర్పంచ్ హెచ్చరించారు. ‘‘ఎమ్మెల్యే రాజయ్యను గౌరవిస్తా. ఆయన వల్లే నేను సర్పంచ్ అయ్యా. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా. పార్టీని ఒక కుటుంబంలా భావిసా. జరిగిన విషయాన్ని మరిచిపోయి ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. తప్పు చేసినట్టు ఒప్పుకుంటే క్షమిస్తా’’ అని సర్పంచ్ నవ్య అన్నారు. క్షమించమని కోరుతున్నా.. ఎమ్మెల్యే రాజయ్య జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ‘‘నాకు నలుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ప్రవీణ్‌పై అభిమానంతో ఆయన భార్యకు సర్పంచ్ టికెట్ ఇచ్చా.. నేను తెలిసి తెలియక చేసిన పనులు వల్ల మానసిక క్షోభకు గురైతే క్షమించమని కోరుతున్నా. జానకిపురం అభివృద్ధికి పాటుపడుతా. అధిష్టానం ఆదేశం మేరకు రూ.25 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నా’’ అని రాజయ్య పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా కమిషన్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. అసలేం జరిగింది.. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్లో ‘చిలిపి’ రాజకీయం! ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. -
లగ్జరీ కారు కొన్న నవ్య స్వామి, నటుడు రవికృష్ణ రియాక్షన్ చూశారా?
టీవీ నటి నవ్య స్వామి.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పలు టీవీ సీరియల్స్‌తో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైంది. తక్కువ సమయంలో నటిగా ఆమె మవంచి గుర్తింపు పొందింది. నటిగానే కాదు, పలు టీవీ షొలతో, సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని అలరిస్తు ఉంటుంది. ఇదిలా తాజాగా ఆమె ఓ లగ్జరీ బెంజ్ కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తాను కారు కొన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో వెంటనే తన ఫొటోను షేర్ చేస్తూ బిగ్‌బాస్ ఫేం, నటుడు, ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రవికృష్ణ నవ్యస్వామికి శుభాకాంక్షలు తెలిపాడు. ‘హే కంగ్రాచ్యూలేషన్స్ రౌడీ ఫెలో.. లిస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అని లవ్ సింబల్స్ పెట్టి తన స్టోరీలో పోస్ట్ చేశాడు. ‘అంతేగా అంతేగా’ అని నవ్యస్వామి బదులిచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. కాగా నటుడు రవి కృష్ణ, నవ్య స్వామి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆమె కథ’ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరికి అప్పుడే పరిచయం ఎర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు.పలు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో తరచూ వీరిద్దరి ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఒకరి పోస్ట్‌పై ఒకరు స్పందించడం, కామెంట్స్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నవ్యస్వామి ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఆహాలో ఈమె హీరోయిన్గా చేసిన ‘ఇంటింటా రామాయణం’ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. అలానే మరికొన్ని కూడా సెట్స్‌పై ఉన్నాయి. -
సింగిల్స్ చాంప్స్ నవ్య, జస్టిన్ హో
సాక్షి, హైదరాబాద్: కొటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్‌లో నవ్య కండేరి (భారత్), జస్టిన్ హో (మలేసియా) విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో నవ్య 21–15, 21–18తో ఇషారాణి బారువా (భారత్)పై, జస్టిన్ 21–18, 21–14తో ప్రణయ్ షెట్టిగర్ (భారత్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో నికోలస్ రాజ్–తుషార్ సువీర్ (భారత్) జోడీ 21–14, 21–18తో అపిలుక్–విత్చాయా (థాయ్‌లాండ్) ద్వయంపై... మహిళల డబుల్స్ ఫైనల్లో ఓంగ్ జిన్ యీ–కార్మెన్ టింగ్ (మలేసియా) ద్వయం 21–16, 21–15తో రాధిక శర్మ–తన్వీ శర్మ (భారత్) జోడీపై నెగ్గాయి. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మయాంక్ రాణా–నర్ధన రవిశంకర్ (భారత్) జోడీ 25–23, 23–21తో కణపురం సాత్విక్ రెడ్డి–వైష్ణవి ఖాడ్కేకర్ (భారత్) జంటను ఓడించింది. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు! -
పాస్‌పోర్టు బ్లాక్.. ఫిలిప్పీన్స్‌లో హైదరాబాద్ యువతి తిప్పలు
ఫిలిప్పీన్స్‌లో నవ్య అనే తెలుగు యువతి తిప్పలు పడుతోంది. మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పాస్‌పోర్ట్ బ్లాక్ అయ్యిందని, తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. దీంతో మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో రాత్రంతా నవ్యదీప్తి పడిగాపులు కాసింది. అయితే తన పాస్‌పోర్ట్‌ను కావాలనే బ్లాక్ చేశారని నవ్య ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మనిల్లా ప్రాంతంలో నవ్య 2 ఏళ్ళుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. కోవిడ్ టైంలో అధిక డబ్బులు ఇవ్వాలంటూ ఇంటి ఓనర్ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె చెబుతోంది. ఇవ్వకపోతే పాస్‌పోర్ట్ బ్లాక్ చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగారని..డబ్బులు కట్టనందుకు పాస్ పోర్ట్ బ్లాక్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ పాస్ పోర్ట్ ఆఫీస్‌లోనే ఇంటి ఓనర్ పనిచేస్తున్నట్లు నవ్య తెలిపారు. కాగా మెడిసిన్ కోసం నవ్య మూడేళ్లేగా ఫిలిప్పీన్స్‌లో ఉంటోంది. కోవిడ్ సమయంలో ఇండియాకు చేరుకున్న ఆమె ప్రస్తుతం పరిస్థితులు చక్కపడటంతో తిరిగి ఫిలిపిన్స్‌కు బయలు దేధారు. రెండు రోజుల క్రితం నవ్య హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్ వెళ్లారు. అయితే మనిల్లా ఎయిర్ పోర్టులో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం సింగపూర్ ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్న ఆమెను.. తిరిగి ఇండియా వెళ్ళేవారకు లగేజ్ ఇవ్వమని తెలిపారు. -
‘గతంలో ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవి కృష్ణతో రిలేషన్!’
బుల్లితెరపై హీరోయిన్‌కు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి నవ్య స్వామి. కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. నా పేరు మీనాక్షి అనే సీరియల్‌తో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకున్న నవ్య కన్నడ, తమిళంలో పలు సీరియల్స్‌లో నటించింది. ఇక తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. ఈ నేపథ్యంలో తను నటించిన ఆమె కథ సీరియల్ సహ నటుడు రవి కృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు ఇంటర్వ్యూలో నవ్య అవి వట్టి పుకార్తేనని, తమ మధ్య ఏం లేదని స్పష్టిచేసింది. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లు, షోలు చేయడం, నవ్య షేర్ చేసిన ఫొటోలకు రవి కృష్ణ లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేయడం చూస్తుంటే ఆ వార్తలకు మరింత బలం చూకూరుతుంది. తాజాగా ఆమె ఫొటోపై రవి కృష్ణ ఇలాగే స్పందించడం చూసి నెటిజన్లు వీరి ప్రేమయాణం గురించి సోషల్ మీడియాలో చర్చికుంటున్నారు. ఓ నెటిజన్ ‘గతంలో నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది. అతడితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నవ్య, రవి కృష్ణల రిలేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. చదవండి: ఓ పార్టీలో చేదు అనుభవం, భయమేసి ఇంటికెళ్లి ఏడ్చాను: నటి -
ఓ పార్టీలో చేదు అనుభవం, భయమేసి ఇంటికెళ్లి ఏడ్చాను: నటి
టీవీ నటి నవ్య స్వామి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నా పేరు మీనాక్షి సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత పలు సీరియళ్లలో ఆఫర్లు దక్కించుకొని ఫుల్ బిజీ ఆయిపోయింది. ఇక ఆమె కథ సీరియల్లో సహానటుడు రవి కృష్ణతో ప్రేమ వ్యవహరంపై వస్తున్న రూమర్లతో ఆమె మరింతగా పాపులర్ అయ్యింది. టీవీ షోల్లో, ఈవెంట్లల్లో జంటగా పాల్గొని వీరిద్దరి లవ్ ట్రాక్‌ని మరింత ఆసక్తిగా మలుస్తున్నారు. ఇటీవల కాలంలో బుల్లితెరపై ఏ షో చూసిన ఈ జంటే దర్శనమిస్తుంది. దీంతో ఇప్పుడు వీరి లవ్ ట్రాక్ సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నవ్య స్వామి ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘మీరు ఓ పార్టీలో ఈవెంట్ మేనేజర్‌ను బాగా కొట్టారని తెలిసింది, ఎందుకని హోస్ట్ అడగ్గా దానిపై ఆమె వివరణ ఇచ్చింది. ‘ఒకసారి ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీకి వెళ్లాను. అక్కడ మేమంతా డ్యాన్సులు వేస్తూ పార్టీ చేసుకుంటున్నాం. అలా గుంపుగా ఉండి రచ్చ రచ్చ చేస్తున్నాం. ఈ క్రమంలో మధ్యలో ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి నన్ను అసభ్యకరంగా తాకాడు. దీంతో వెంటనే వెనక్కి తిరిగి వాడిని తోసేసి చితక్కొట్టాను. ఆ తర్వాత కాళ్లతో తన్నుతూ.. చేతులతో కొట్టేశాను. బతికాడో, చచ్చాడో కూడా తెలియదు. కానీ నేను కొట్టిన కొట్టుడుకు నా చేతి వేళ్లు వాచిపోయాయి. ఇక ఆ ఘటనతో నాకు ఎంతో భయం వేసింది. ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. తెలియని వారు మనల్ని అలా తాకితే ఎలా ఉంటుంది’ అంటునవ్యస్వామి అసలు విషయం చెప్పుకొచ్చింది. అయితే సినిమాల్లో కనిపించాలన్నది తన కోరిక అని, ఇప్పుడు అయితే సీరియళ్లతోనే బిజీగా ఉన్నానని చెప్పింది. ప్రస్తుతం సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని, కానీ దానికి ఇంకా సమయం ఉందని ఆమె పేర్కొంది. -
ఆ పనులు చేయడమంటే పిచ్చి ఇష్టం : నటి నవ్య స్వామి
బుల్లితెరపై హీరోయిన్‌కు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి నవ్య స్వామి. కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీకి అడుగుపెట్టి తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అబ్డేట్స్ని షేర్ చేస్తుంటుంది. కన్నడలో ఆమె నటించి తొలి సీరియల్ 'తంగళి' సూపర్ హిట కావడంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. ఈ నేపథ్యంలో తమిళంలో కూడా ఓ సీరియల్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక కొంతకాలంగా టీవీ నటుడు రవి కృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇద్దరూ కలిసి ఈవెంట్లు, షోలు చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చూకూరినట్లయ్యింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న నవ్య తనకు సంబంధించి చాలా విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్‌లో తాను చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, తనకు కరోనా వచ్చిందని తెలిసి గేటెడ్ కమ్యూనిటీలోకి రానివ్వలేదని తెలిపింది. ఆ సమయంలో ఎంతో బాధ పడ్డానని, తన లైఫ్‌లో అంతలా ఏడ్చిన సందర్బం అదేనని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇక తనకు ఇళ్లు సర్దడం, వంటి చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పాలంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. దీంతో మరో నటి తన ఇంటికి రావాలంటూ ఫన్నీగా సెటైర్ వేసింది. చదవండి : Pavala syamala : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన నటుడు కరోనా బాధితుల కోసం యాంకర్ వింధ్య వినూత్న ఆలోచన -
సీరియల్ నటి నవ్య స్వామి తాజా ఫోటోలు
-
నవ్యరెడ్డి హత్య: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, ఖమ్మం: వివాహిత నవ్యరెడ్డి హత్య కేసులో ఎర్రుపాలెం ఎస్ఐ కీలక విషయాలను వెల్లడించారు. ప్రియురాలిపై మోజుతోనే భార్య నవ్యరెడ్డి ఆమె భర్త నాగశేషురెడ్డి హత్య చేశాడని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడు నాగ శేషురెడ్డి పెగళ్లపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. చదవండి: ఖమ్మం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘాతుకం వివాహేతర సంబంధంపై భర్తను భార్య నవ్యరెడ్డి నిలదీయటంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఎలాగైనా భార్యను చంపి, ప్రియురాలితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నాగ శేషురెడ్డి ఈనెల 2న భార్య నవ్యను సత్తుపల్లి సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద దింపి వస్తానని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు వేసి తాగించాడు. అనంతరం పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామ సమీపంలోని కుక్కలగుట్ట వద్దకు తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేశాడని ఎర్రుపాలెం ఎస్ఐ వివరించారు. నిందితుడిని మధిర కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. హత్య కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. -
‘నవ్య, నేను ఫ్రెండ్స్‌లానే ఉంటాం’
అనుబంధాలతో అల్లుకున్న పొదరింట్లో ఉన్న అమ్మాయి.. నాలో ఏదో చిలిపి కల అంటూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్న ఆమె జీవితంలో.. కల్లోలం రేపేందుకు ఓ విలన్ వచ్చేస్తాడు.. అతడి రాకతో, డాక్టర్‌గా ప్రాక్టిస్ చేస్తున్న అమ్మాయి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది.. విలన్ పన్నే కుట్రలను ఆమె ఎలా తిప్పికొట్టింది.. అతడిని తట్టుకుని నిలబడిందా లేదా? అన్నది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. ప్రముఖ ఛానెల్ ‘స్టార్ మా’లో ప్రసారం కానున్న ‘కస్తూరి’ సీరియల్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా.. అగ్నిసాక్షి సీరియల్‌తో ఇన్ని రోజులు గౌరీగా ప్రేక్షకుల మనసులో నిలిచిన ఆ అందమైన అమ్మాయే.. ఇకపై కస్తూరిగా మనల్ని అలరించనుంది. ఆమె మరెవరో కాదు.. ఐశ్వర్య పిస్సే! అల్లరిపిల్ల ‘గౌరీ’కి సంబంధించిన ముచ్చట్లు మీకోసం.. నిజ జీవితంలోనూ అంతే.. స్టార్ మాలో వచ్చిన ‘‘అగ్నిసాక్షి’’ ముగింపు సమయంలోనే ఐశ్వర్యకు ‘‘కస్తూరి’’ సీరియల్ ఆఫర్ వచ్చిందట. నిజానికి ఫిబ్రవరిలో ఈ షూటింగ్ మొదలవ్వాలి. అయితే లాక్డౌన్ కారణంగా కాస్త ఆలస్యమైనా త్వరలోనే సీరియల్ బుల్లితెరపై ప్రసారం కానుంది. ఐశ్వర్య ఇందులో మెడికోగా కనిపించనుంది. ఇందులో క్యారెక్టర్ ఐశ్వర్య నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుందట. ఐశ్వర్యకి ఓపిక ఎక్కువేనట. బాధ కలిగినా వెంటనేగా ముఖం మీద చూపించదు. కస్తూరిలో అలాంటి క్యారెక్టర్ తనకు ఇచ్చిన యూనిట్‌కు, తన వెన్నంటి ప్రోత్సహిస్తున్న స్టార్ మాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలంటున్నది ఐశ్వర్య. డాక్టర్ కావాలని.. ఐశ్వర్య బెంగళూరులో పుట్టింది. చిన్నప్పుడే వాళ్ల నాన్న తనను, తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు. ఐశ్వర్య వాళ్ల అమ్మ హెల్త్ వర్కర్‌గా పని చేసేది. అందుకే ఐశ్వర్య చిన్నప్పుడు ఆయుర్వేదం డాక్టర్ కావాలని కలలు కన్నది. కానీ అమ్మ కష్టం అర్థమై డాక్టర్ చదువును పక్కకు పెట్టేసింది. పదో తరగతిలో ఉన్నప్పుడు థియేటర్స్‌లో జాయినయింది. అలా మెల్లగా నటన మీద ఆసక్తి పుట్టడంతో చాలా ఆడిషన్లకు వెళ్లింది. అలా నటిగా మారి ఇప్పుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. తన చిన్ననాటి కల తీరనప్పటికీ, ఇప్పుడు ‘స్టార్ మా’ వల్ల కస్తూరిలో తను డాక్టర్ పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నది ఈ కన్నడ భామ. కన్నడతో కెరీర్.. సినిమాల్లో కంటే సీరియల్ ‘బెస్ట్’ అని భావించింది ఐశ్వర్య. అప్పటికే సీరియల్స్ హవా నడుస్తుండటంతో.. అటు వైపుగా అడుగులు వేసింది. మొదట రెండు సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత ఓ సీరియల్లో మెయిన్ లీడ్ చేసింది. అలా నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలో రెండు సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేసింది. కానీ సీరియళ్లలో వరుస అవకాశాల కారణంగా సినిమా అవకాశాలను పక్కకు పెట్టింది. అన్నట్లు.. ఒక సినిమాలోనూ హీరోయిన్గా నటించింది ఐశ్వర్య. కానీ అది ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత ఆర్కా మీడియాలో పని చేసినప్పుడు తెలుగులో ఆఫర్ వచ్చింది. తెలుగు లోగిళ్లలో.. తెలుగులోకి రావాలని అస్సలు అనుకోలేదట ఐశ్వర్య. అయితే ఇక్కడ అడుగు పెట్టాక చాలా కంఫర్ట్‌గా ఫీలయిందట. ముందు ఇంగ్లిష్‌లో రాసుకొని డైలాగులు చెప్పేదాన్నని... ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలనంటున్నదీ అమ్మడు. ఇక స్టార్ మాలో వచ్చిన అగ్నిసాక్షి సీరియల్ తన కెరీర్‌కి చాలా ప్లస్ అయిందని, ఇప్పటికీ తనను గౌరిగానే గుర్తు పెట్టుకుంటారంటున్నరని మురిసిపోయింది. అయితే ఇప్పడు కస్తూరి వచ్చాక మాత్రం తనని కస్తూరి అని పిలువడం ఖాయమంటున్నది. చాలా కాలం తర్వాత వస్తున్నా, ఇటీవల విడుదలైన ప్రోమోకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉందంటున్నది. వాళ్ల అన్నయ్యనే పెళ్లి చేసుకున్నా.. ‘‘నటి నవ్య నాకు మొదటి సీరియల్ నుంచి పరిచయం. వాళ్లన్నయ్యనే నేను పెళ్లి చేసుకున్నా. మేం వదిన, ఆడపడుచులుగా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటాం. తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. కరోనా సమయంలో కూడా తను చూపిన గుండె నిబ్బరం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తను స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే అలా నిలబడగలిగింది. స్టార్ మాలో వచ్చిన ‘ఇస్మార్ట్ జోడి’ వల్ల నేను చాలా నేర్చుకున్నా. భార్యభర్తల అన్యోన్యత గురించి చాలా తెలుసుకున్నా’’అని అంటున్నది ఐశ్వర్య. పద్ధతిగా ఉంటే.. ‘‘ప్రతీ పనిలో అమ్మ తోడ్పాటు మరువలేనంటుననది. తెలుగులో నాకంటూ ఒక గుర్తింపు రావడానికి స్టార్ మా ముఖ్య కారణం. వారి అండతో మరిన్ని మంచి ప్రాజెక్ట్‌లతో కనిపించాలని అనుకుంటున్నారు. అగ్నిసాక్షి సీరియల్‌కి రెండు అవార్డులు అందుకున్నా. ప్రేక్షకుల అభిమానం వల్లే ఈ అవార్డులు అందుకోగలిగాను. పద్ధతిగా ఉండే క్యారెక్టర్లు వస్తే తప్పకుండా సినిమాల్లో కూడా చేస్తాను. గౌరిగా ఆదరించినట్టే.. ఇప్పుడు కస్తూరిగా కూడా అదే అభిమానం చూపిస్తారని ఆశిస్తున్నా’’ అంటున్న ఐశ్వర్యకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం!! -
కరోనా: కోలుకున్న సీరియల్ నటి
-
కరోనాను జయించిన బుల్లితెర స్టార్
కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ బుల్లితెర నటి నవ్య స్వామి ఎట్టకేలకు మహమ్మారి నుంచి కోలుకున్నారు. తన క్వారంటైన్ గడువు కూడా ముగిసిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు శనివారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు వీడియో సందేశం ఇచ్చారు. "నా క్వారంటైన్ ముగిసింది. ముందుకన్నా ఇప్పుడు బాగానే ఉన్నాను. మా తల్లిదండ్రుల ప్రార్థనలు, మీ ప్రేమాభిమానాల వల్ల కరోనాను జయించాను. మీ మద్దతు లేకపోయుంటే ఈ ప్రయాణం పూర్తయ్యేదే కాదు. నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం పరిస్థితులు అస్సలు బాగోలేవు. దయ చేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. కరోనాను నయం చేయవచ్చు. కానీ చికిత్స కన్నా నివారణ మేలు అన్న విషయం గుర్తుంచుకోండి" అని మరీమరీ చెప్పుకొచ్చారు. (మరో ఏడాది థియేటర్లు ఉండవు) వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శారీరక పోరాటం కన్నా మానసిక పోరాటమే ఎక్కువ అని గ్రహించానని తెలిపారు. అందుకే మరింత శక్తి కూడదీసుకుని పోరాడానని పేర్కొన్నారు. మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్లు ప్రతి ఒక్కరూ.. మా ఇంటికి దూరంగా ఉండండి అని చెప్తుంటే బాధగానే ఉందన్నారు. కరోనా కన్నా కూడా ఇదే మరింత బాధిస్తుందని పేర్కొన్నారు. కాగా గత నెల 30న నవ్యకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమె సహనటుడు రవికృష్ణకు సైతం కరోనా సోకగా వారం క్రితమే కోలుకున్నాడు. (ఆ లవ్ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్) -
నవ్య ‘డబుల్’
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కందేరి నవ్య సింగపూర్ యూత్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నమెంట్లో రెండు విభాగాల్లో విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. సింగపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో చిత్తూరు జిల్లాకు చెందిన నవ్య అండర్–13 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ గెల్చుకుంది. సింగిల్స్ ఫైనల్లో నవ్య 21–8, 21–13తో నాలుగో సీడ్ నిసా అలిఫెనియా తానెవగస్తిన్ (ఇండోనేసియా)పై నెగ్గగా... డబుల్స్ ఫైనల్లో నవ్య–వలిశెట్టి శ్రియాన్షి (భారత్) ద్వయం 21–18, 17–21, 21–16తో సుకిత్త సువచాయ్–నారద ఉడోర్న్‌పిమ్ (థాయ్‌లాండ్) జంటను ఓడించింది. మరోవైపు ఇదే టోర్నీ బాలుర అండర్–15, అండర్–13 డబుల్స్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాళ్లు కలగోట్ల లోకేశ్ రెడ్డి, తీగల సాయిప్రసాద్, నాగలింగ ప్రణవ్ రామ్ టైటిల్స్ గెలిచారు. అండర్–15 బాలుర డబుల్స్ ఫైనల్లో లోకేశ్ రెడ్డి–అంకిత్ మోండల్ (బెంగాల్) ద్వయం 25–23, 4–21, 21–18తో రెండో సీడ్ జొనాథన్ గొసాల్–అడ్రియన్ ప్రతమ (ఇండోనేసియా) జంటపై... అండర్–13 బాలుర డబుల్స్ ఫైనల్లో సాయిప్రసాద్–ప్రణవ్ రామ్ జోడీ 21–11, 21–16తో చౌ యు సియాంగ్–ఫాన్ వాన్ చున్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించాయి. -
బుల్లితెర నటి నవ్య నవ్వు
-
‘డ్రగ్స్, శారీరక హింస.. ఇంకెన్నో చూశా’
21 ఏళ్లకు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌమ్యా సేథ్ పలు హిందీ సీరియళ్లలో నటించి ప్రతిభ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నవ్య, చక్రవర్తి అశోక సామ్రాట్ వంటి సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన భావోద్వేగ పోస్ట్ ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నటిగా పరిచయమైన నాటి నుంచి ఈరోజు వరకు తానెంతో పరిణతి సాధించానని రాసుకొచ్చిన సౌమ్య.. ఈరోజుల్లో నిజాయితీగా ఉంటే ఎవరూ లెక్కచేయడం లేదని వాపోయారు. అమ్మాయిలు తమ సొంత కాళ్లపై నిలబడాలని.. అబ్బాయిల్లో తమ సంతోషం వెదుక్కోవడానికి ప్రయత్నిస్తే నిరాశే మిగులుతుందని నిర్వేదానికి లోనయ్యారు. ‘ఎనిమిదేళ్ల క్రితం నవ్య క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఈ ప్రపంచంలో ప్రేమతో మార్చలేనిది ఏదీ లేదని భావించాను. ప్రతీ ఒక్కరిని ప్రేమగా పలకరించాలని, మంచి మనసుతో జీవించాలని అనుకున్నాను. దుష్ట శక్తుల నుంచి నన్ను కాపాడే నా తల్లిదండ్రుల నీడలో హాయిగా జీవించాను. కానీ ఎప్పుడైతే నాకు నేనుగా నిర్ణయాలు తీసుకోవాలని భావించానో అప్పటి నుంచి ద్వేషం, అసూయ, శారీరక హింస, ఎమోషనల్ బ్లాక్మెయిల్, డ్రగ్స్‌తో పాటు.. అందమైన ముఖాలు కలిగి ఉండి కఠిన హృదయం గల వ్యక్తులను చూశాను. నవ్యగా ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత ప్రిన్స్ చార్మ్ గురించి కలలు కనడం వంటి కాన్సెప్టులు ట్రాష్ అని అర్థమైంది. ప్రతీ అమ్మాయి తన మనసు చెప్పిన మాటను వినాలి. అమ్మాయిల సంతోషం ఏ అబ్బాయిపైనో ఆధారపడి ఉండకూడదు. ఈరోజుల్లో నిజాయితీ అనేది చాలా ఖరీదైన వస్తువుగా మారిపోయింది. అయినా నవ్యగా ప్రయాణం జీవితకాలపు అనుభవాన్ని పంచింది. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ధైర్యం ఉన్న ఒక ఆడపిల్ల కథ’ అంటూ సౌమ్యా సేథ్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. కాగా రెండేళ్ల క్రితం సహనటుడు అరుణ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న సౌమ్యకు ఐడెన్ అనే కుమారుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా తనతో పాటు కుమారుడి ఫొటోలను పోస్ట్ చేస్తున్న సౌమ్య.. భర్త గురించి మాత్రం ఎటువంటి సమాచారాన్ని షేర్ చేయడం లేదు. అయితే శుక్రవారం నాటి పోస్టులో నవ్య క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చిన సౌమ్య భర్తతో విడిపోతున్న కారణంగానే ఇలా భావోద్వేగానికి లోనయ్యారేమోనని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘నిన్ను బాధ పెట్టిన వారి ముందు సంతోషంగా ఉండటంలోనే నీ విజయం దాగుంటుంది గనుక ధైర్యంగా ఉండాలి’ అని సౌమ్యకు సూచిస్తున్నారు. View this post on Instagram 8 years ago when I took up Navya I was 21 years old girl... wanted the world to believe in love !!! Wanted to heal the world with love !! I believed everyone deserves love and to be loved. I was in my own country. I lived with my parents who protected me from everything evil. I have grown up - I have seen violence, I have seen illicit drugs (including coccaine), I have seen hate, I have seen jealously, I have seen injustice, emotional manipulation’s and physical abuse! I have seen Beautiful Faces with ugly hearts. People who look well but are sick in heart and mind. 8 years after doing Navya I believe- Prince Charming is the most trashy concept as of today!! Girls just need to listen to their own hearts and believe that they are a women with substance and their happiness should not depend on any guy. Today I can tell being honest is expensive and worthless and painful and stupid. All that being said Navya was a beautiful dream and I am grateful that I got a chance to live it for few days!! Some of the Most memorable days of my life !! Grateful forever!! Amm ladki ki Khaas Kahaani!! A post shared by Somya (@somyaseth) on Apr 4, 2019 at 8:55pm PDT -
చిన్న వయసులో పెద్ద కష్టం!
శ్రీకాకుళం, మందస: పేదరికమే శాపమైన ఆ కుటుంబంలో జన్మించిన చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమార్తెకు క్యాన్సర్ ఉందని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లుపోతున్నారు. మందస మండలంలోని లొహరిబంద గ్రామానికి చెందిన రెయ్యి రాజు, లక్ష్మీకాంతం దంపతుల కుమార్తె నవ్య(7) రెండో తరగతి చదువుతోంది. నవ్య మెడపై ఇటీవల చిన్నగా వాపు రావడంతో గగ్గలుగా భావించారు. రెండు నెలలైనా తగ్గకపోవడంతో ఒడిశాలోని బరంపురం, విశాఖపట్నంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లగా క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. నవ్య తండ్రి రాజు పొట్టకూటికోసం గుజరాత్‌లోని అహ్మదాబాదులో కూలీగా పని చేస్తున్నారు. తల్లి, అమ్మమ్మలు చిన్నారికి కేన్సర్ సోకినట్టు గుర్తించలేకపోవడం, అప్పటికే స్టేజ్–2కు చేరడంతో వైద్యానికి రూ.1.5 లక్షలు ఖర్చయ్యింది. మరో రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. నవ్య పేరు సాధికార సర్వేలో లేకపోవడంతో ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం వర్తించడంలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓ వైపు పేదరికం.. మరో వైపు చికిత్స చేయించలేని ధైన్యం.. దీంతో ఆ తల్లిదండ్రులు ఆదుకునే ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. -
కష్టాలే ప్లాట్‌ఫాం.. నవ్య సోపానం
బతుకు బండిని లాగేందుకు ప్లాట్‌ఫాంపై టిఫిన్ బండి నడుపుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఆమెలో కసిపెంచాయి. వారి ఆశలను, తన ఆశయాలను నెరవేర్చేందుకు చదువొక్కటే మార్గమని భావించింది. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూనే చదువులో సత్తా చూపింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించి, ప్రస్తుతం చెన్నైలోని ఓ సంస్థలో ఆర్టికల్‌షిప్ చేస్తోంది పాకాల మండలానికి చెందిన వి.నవ్య. ఆమె గురించి ఆమె మాటల్లోనే.. – తిరుపతి ఎడ్యుకేషన్ మాది పాకాల మండలం వల్లివేడు గ్రామం. మా తల్లిదండ్రులు వి.శివారెడ్డి, వి.గోమతిలకు మేం ముగ్గురు సంతానం. అక్క వి.నందిప్రియ నీట్‌కు సిద్ధమవుతోంది. నేను రెండో కుమార్తెను. చెల్లెలు వి.దివ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వ్యవసాయం పెద్దగా అచ్చిరాలేదు. మా ఉన్నత చదువుల కోసం అమ్మానాన్న పొట్ట చేత్తో పట్టుకుని మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చేశారు. రుయా ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై టిఫిన్ బండి పెట్టారు. వచ్చే ఆదాయంతో మమ్మల్ని చదివిస్తున్నారు.– సీఏ–ఐపీసీసీ ఆలిండియా 21వ ర్యాంకర్ వి.నవ్య కష్టాలు కసి పెంచాయి.. మా ముగ్గురిని చదివించేందుకు అమ్మాన్నాన్న ఎంతో కష్టపడుతున్నారు. సొంత ఊరిని వదిలిపెట్టి తిరుపతికి వచ్చారు. ఫ్లాట్‌ఫాంపై టిఫిన్ బండి నడుపుతున్నారు. వారు పడుతున్న కష్టం, బాధ చూసి నాలో కసి పెరిగింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించాను. చదువు ప్రస్థానం.. పదో తరగతి వరకు పాకాల మండలం, రమణయ్యగారిపల్లెలోని వశిష్ఠ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాను. పదిలో 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించాను. మదనపల్లిలోని జవహర్ నవోదయలో ఎంపీసీ చేశాను. 94.4శాతం మార్కులను సాధించాను. సీఏ చేయాలన్న కోరికతో తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాలలో 6నెలలు సీఏ–సీపీటీలో శిక్షణ తీసుకున్నా. ఇంటర్ మార్కుల ఆధారంతో సీపీటీలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ పరీక్షలో 200కు 177మార్కులు సాధించడంతో సెకెండ్ లెవెల్ అయిన సీఏ–ఐపీసీసీలోనూ ఎమరాల్డ్స్ కళాశాల యాజమాన్యం 9నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు సాధించగలిగాను. సీఏ ఫైనల్ చేయాలంటే తప్పనిసరిగా రెండున్నర ఏళ్ల పాటు ఆడిటర్ వద్ద ఆర్టికల్‌షిప్ చేయాలి. దీనికోసం చెన్నైలోని డెలాయిట్ సంస్థలో చేరాను. సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చును ఎమరాల్డ్స్ కళాశాల యాజమాన్యం భరించింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తల్లిదండ్రులకు సాయంగా.. అమ్మానాన్న ఇద్దరూ టిఫిన్ బండిపై కష్టపడేవారు. వారి కష్టంలో నేను కూడా పాలుపంచుకోవాలని వారికి సాయంగా ఉంటున్నాను. టిఫిన్ బండిపై దోసెలు పోస్తూ, వచ్చిన కస్టమర్లకు టిఫిన్ వడ్డిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నా. ఖాళీ సమయంలో చదువుపైనే దృష్టి పెడుతున్నా. సివిల్స్ సాధించడమే నా కల... సీఏ పూర్తయిన తరువాత సివిల్స్‌కు సిద్ధమవుతాను. సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడమే నా కల. నాలాంటి పేద విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ పరంగా వారికి అండగా నిలవడానికి, మరెందరో పేదలకు సేవ చేయడానికి తప్పకుండా నా కలను సాకారం చేసుకుంటా. నా తల్లిదండ్రుల ఆశలను నెరువేరుస్తా. -
పెద్దలకు భయపడి విషం తాగిన ప్రేమికులు
కుక్కునూరు(పశ్చిమ గోదావరి జిల్లా): కుటుంబ పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుక్కునూరు మండలం పాములేరు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అశ్వాపురం మండలం జగ్గారంకు చెందిన ఆటో డ్రైవర్ కిషోర్(23), ఆశ్వాపురం మండల కేంద్రం మంచికంటి నగర్ కు చెందిన నవ్య అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవలె ఈ విషయం వాళ్ల ఇళ్లల్లో తెలియడం, వారి పెళ్లికి అంగీకరించని కారణంతో ఇద్దరూ కలిసి పాములేరు వద్ద పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారి సహా తల్లి బలవన్మరణం
మోటకొండూరు: భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన చిన్నారితో పాటు ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వంగపల్లి గ్రామానికి చెందిన నవ్య(21)కు నాలుగేళ్ల క్రితం నాంచారిపేటకు చెందిన గచ్చ నరేష్‌తో వివాహమైంది. వారికి ఒక కుమార్తె మాధురి ఉంది. గత కొంతకాలంగా నరేష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంత మంది వైద్యులకు చూపించినా ఫలితం లేదు . దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ్య గురువారం రాత్రి బాత్రూంలో కుమార్తెతో పాటు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వారు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజు సంఘటన స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సంతానం కలగడం లేదని..
వివాహిత ఆత్మహత్య నాగోలు: పిల్లలు పుట్టడం లేదని జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన నవ్య (25) అలియాస్ కస్తూరి నాగోల్ జైపురికాలనీకి చెందిన నరేశ్‌తో గత నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మధ్యలో గర్భం దాల్చినా అబార్షన్ జరిగింది అప్పటి నుంచి సంతానం కలుగక పోవటంతో మనస్తాపానికి లోనైన నవ్య శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో చిన్నారికి తీవ్ర గాయాలు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అరవింద్‌రావు దంపతులు తమ కూతురు నవ్య(6)తో కలసి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారి నవ్య డిపార్చర్ రైలింగ్ పైనుంచి కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయాలుకాగా చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. -
మనవరాళ్లకు అమితాబ్ లేఖ!
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మనవరాళ్లకు అమితాబ్ ఓ అందమైన లేఖ రాశారు. ఫేమ్ కలిగిన కుటుంబంలో జన్మించిన మీకు.. మహిళలకు ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకునే అవకాశాలను మాత్రం ఆ 'ఫేమ్' ఇవ్వలేదని లేఖలో పేర్కొనడం విశేషం. మహిళ జీవితంలో ఎదురయ్యే సున్నిత సమయాలను, సమస్యలను ప్రస్తావించిన అమితాబ్ లేఖను పూర్తిగా చూద్దాం.. లేఖలోని సారాంశం డియర్ నవ్య, ఆరాధ్య.. మీ ముత్తాత గార్లు అయిన డా.హరివన్ష రాయ్ బచ్చన్, హెచ్ పీ నందల పేర్లు మీ ఇంటిపేరుగా నిలవడం వల్ల మీకు ఒక గుర్తింపు వస్తుంది. మీరు నంద అయినా లేక బచ్చన్ అయినా ముందు గుర్తించవలసింది మీరు కూడ ఒక మహిళేనని!. మీరు మహిళలు కాబట్టే ఇతరులు వారి వారి ఆలోచనలు మీపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలా ఉండాలో, ఎవరిని కలవాలో, ఎక్కడి వెళ్లాలో.. కూడా వాళ్లే చెప్తారు. వారి ఆలోచనల నీడల్లో మీరు జీవించొద్దు. మీ తెలివితేటలతో మీ జీవితాన్ని మీరే లీడ్ చేయాలి. మీ గుణం మంచిది అనడానికి మీరు వేసుకునే స్కర్ట్ పొడవు సింబల్ అనే ఎదుటివారిని మాటలను నమ్మొద్దు. మీ స్నేహితులను మీరే ఎన్నుకోండి. మీకు ఎవరిని పెళ్లాడాలని అనిపిస్తే వారినే వివాహం చేసుకోండి. అనవసర కారణాలతో ఇతరులను వివాహం చేసుకోకండి. ఇతరులు మాట్లాడతారు. కానీ మీరు ప్రతి ఒక్కరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేరేవాళ్లు ఏం అనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించొద్దు. మీ కర్మలకు కర్త, క్రియ మీరే కావాలి. అప్పుడే మీ తప్పులను మీరే సరిదిద్దుకో గలుగుతారు. నవ్య.. నీ ఇంటిపేరు ఓ మహిళ ఎదుర్కొనే కష్టాలనుంచి నిన్ను కాపాడలేదు. ఆ కష్టాల నుంచి నిన్ను నువ్వే రక్షించుకోవాలి. ఆరాధ్య.. ఈ లేఖ సారాంశం నీకు అర్ధమయ్యే సమయానికి నేను నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ, నేను ఈ రోజు చెబుతున్నవి ఆ సమయానికి ఇలానే ఉంటాయని భావిస్తున్నాను. మహిళగా జీవించడం కష్టమే కావొచ్చు. కానీ నీ లాంటి వాళ్లు ఆ కష్టాలు లేకుండా చేస్తారని నా విశ్వాసం. నీకు నువ్వే హద్దులు పెట్టుకోవడం, నీకు ఇష్టమైన దాన్ని ఎంచుకోవడం, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం అంత సులువు కాకపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్న మహిళలకు నువ్వు ఒక ఉదాహరణగా నిలవొచ్చు. నువ్వు ఇది చేస్తే, నేను సాధించిన దాని కన్నా ఎక్కువ సాధించిన వ్యక్తివి అవుతావు. అది నాకు గొప్ప గౌరవం. అప్పుడు నేను అమితాబ్ బచ్చన్ ను కాదు ఆరాధ్యకు తాతయ్యను అవుతాను!. ప్రేమతో.. మీ తాతయ్య -
హల్చల్ చేస్తున్న మెగా వారసురాలు
ముంబై: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫోటోలతో సంచలనం సృష్టిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు 'నవ్య నవేలి నంద' మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే తనదైన శైలిలో సోషల్ మీడియాలో వైరల్ లా మారడం బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో చదువుకుంటున్న నవ్య తాజాగా మరికొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఓ యువకుడితో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్టు చేసింది. సెలబ్రిటీ కుటుంబానికి చెందిన నవ్య కొన్ని సంచలన ఫోటోలను షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారడం కామనే. ఇటీవలే ఆమె 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనతో పాటు చదువుకుంటున్న గర్ల్ గ్యాంగ్, మరికొందరు స్టార్ కిడ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. దీంతోపాటు, తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో లండన్ లోనే చదువుకుంటున్న షారుక్ తనయుడు ఆర్యన్ ఎక్కువగా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.. -
నిన్ను కొడుకు లెక్కచూసుకున్నం బిడ్డా..
డాక్టర్ అయి ఆదుకుంటనంటివి అప్పుడే మమ్మల్ని వదిలేసి పోయావా.. తల్లి మందలించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు జవహర్‌నగర్: ‘నిన్ను కొడుకు లెక్క చూసుకున్నం బిడ్డా.. డాక్టరై మమ్మల్ని ఆదుకుంటనంటివి.. అంతలోనే ఎంతపనిచేస్తివి.. బిడ్డా.. మమ్మల్ని వదిలిపెట్టి పోతివా తల్లీ..’ అంటూ ఆ తల్లి గుండెలుబాదుకుంటూ రోదించింది. తల్లి మందలించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి న ఘటన శుక్రవారం జవహర్‌నగర్‌లోని బీజే ఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన యాడారం గ్రామానికి చెందిన శ్రీనివాసచారి, శోభారాణి దంపతులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం జవహర్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌కు వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె నవ్య(17) ఈసీఐఎల్‌లోని చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. శ్రీనివాసచారి కార్పెంటర్ పని చేస్తూ భార్యాపిల్లలను పోషించుకునేవాడు. చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉండే నవ్య డాక్టర్ కావాలన్న లక్ష్యంతో కష్టపడేది. ఈనేపథ్యంలో గురువారం ఉదయం టిఫిన్ విషయంలో శోభారాణి నవ్యను మందలించడంతో ఆమె మనస్తాపానికిలోనైంది. కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన నవ్య సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం మల్కాజిగిరి రైల్వేస్టేషన్ పరిధిలో పట్టాలపై నవ్య మృతదేహం ఉన్నట్లు రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా తల్లిదండ్రులు బోరున విలపించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగేళ్లకే నూరేళ్లు
నీటితొట్టిలో పడి బాలిక మృతి ఆ చిన్నారికి నాలుగేళ్లకే నూరేళ్లు నిండారుు.. ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడడంతో మృత్యువాత పడింది.. నర్సరీ చదువుతున్న చిన్నారి నవ్య మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో ము నిగారు. ఈ ప్రమాదం నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నర్సంపేట : నీటితొట్టిలో పడి బాలిక వుృతి చెందిన సంఘటన నర్సంపేట వుండలంలోని నాగుర్లపల్లి గ్రావుంలో వుంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రావూనికి చెందిన వుుప్పారపు పరమేశ్, శోభ దంపతులకు ఇద్దరు కువూర్తెలు. పెద్ద కువూర్తె నవ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్న కువూర్తె వుుప్పారపు నవ్య(4) వూధన్నపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఇంటి వద్దనే ఉన్నారు. పరమేశ్ హనువూన్ వూలాధారణతో ఉండగా.. వుంగళవారం ఇంట్లో బిక్ష చేస్తుండగా అతడి భార్య వడ్డిస్తోంది. దివ్య, నవ్యలతో పాటు వురికొంత వుంది చిన్నారులు ఇంటి వుుందు ఆడుకుంటున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి వద్దకు నవ్య వెళ్లి తొంగి చూస్తూ అందులో ప్రవూదవశాత్తు పడిపోరుుంది. కొద్ది సవుయుం తర్వాత చూసిన దివ్య కేకలు వేయుడంతో ఇంట్లో బిక్ష చేస్తున్న పరమేశ్, శోభ నీటి తొట్టిలో పడ్డ చిన్నారిని రక్షించే ప్రయుత్నం చేశారు. అప్పటికే నవ్య వుృతి చెందింది. దీంతో గ్రావుంలో, అవ్మువ్ము గ్రావుమైన సర్వాపురంలో విషాదఛాయులు అలువుుకున్నారుు. అప్పటి వరకు ఆడుకుం టూ ఉన్న నవ్య వుృతిచెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. -
గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున బోరబండలోని సైట్-౩ వీకర్ సెక్షన్ కాలనీ దేవయ్యబస్తీలో ఇంటి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు సాయి చరణ్ (4), నవ్య (3)గా గుర్తించారు. తల్లిదండ్రులకు తీవ్రంగా గాయలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న రాజు సోమవారం రాత్రి బోరబండలో ఓ గది అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. వెంటనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవటంతో స్థానికంగా విషాదం నెలకొంది. కాగా గాయపడిన రాజు పరిస్థితి విషమంగా ఉండగా, అతని భార్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తల్లిదండ్రులకు కడుపుకోత
నీళ్ల తొట్టె పగిలి ఇద్దరు చిన్నారుల మృతి కన్నీరు మున్నీరవుతున్న దంపతులు నాసిరకంగా నిర్మించడమే కారణం మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: సిమెంట్ ఇటుకలతో నిర్మించిన నీళ్ల తొట్టె పగిలి ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. ‘నాన్నా, తల్లీ లేవండ్రా అంటూ’ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదించడం కంటతడి పెట్టించింది. కూలి కోసం వచ్చిన ఆ దంపతులకు తీరని దుఃఖం మిగిలింది. ఈ సంఘటన ఆదివారం పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. చిన్నారుల తండ్రి కథనం మేరకు.. బెరైడ్డిపల్లె మండలం గౌనితిప్పేపల్లెకు చెందిన హనుమంతప్ప, భాగ్యమ్మ దంపతులు కూలీనాలి చేసుకుని జీవిస్తున్నారు. వీరికి కుమార్తె నవ్య(04), కుమారుడు మోహన్‌బాబు(ఒకటిన్నర సంవత్సరం) ఉన్నారు. ఈడిగపల్లెలో శ్రీనివాసులుకు చెందిన ఇటుకల బట్టీ వద్దే ఉండి పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే పనికి కుదిరారు. శ్రీనివాసులు ఇటుక బట్టీలను నిర్వహిస్తుండగా, వారి తమ్ముళ్లు నర్సరీలను ఏర్పాటు చేసుకున్నారు. నర్సరీకి, ఇటుకల బట్టీకి ఉమ్మడిగా సిమెంట్ ఇటుకలతో సుమారు వెయ్యి లీటర్ల పైగా సామర్థ్యం ఉన్న ఆరు అడుగుల నీటితొట్టెను నిర్మించుకున్నారు. నీటితొట్టెకు కిందభాగంలో కొళాయిని ఏర్పాటు చేశారు. ఈ తొట్టెని నాసిరకంగా నిర్మించారు. హనుమంతప్ప తొట్టెకు నీళ్లు పట్టాడు. నిండి పోవడంతో మోటారును ఆఫ్ చేయడానికి వెళ్లాడు. ఇదే సమయంలో ఇతని పిల్లలు నవ్య, మోహన్‌బాబు నీళ్లు పట్టుకోవడానికి తొట్టె వద్దకు వెళ్లారు. కొళాయి వద్ద నీళ్లు పట్టుకుంటుండగా ఒక్కసారిగా నీటితొట్టె పగిలిపోయింది. సిమెంట్ ఇటుకలు, నీళ్లు పిల్లలపై పడడంతో గట్టిగా అరిచారు. తల్లిదండ్రుల కళ్లముందే ఇదంతా జరగడంతో ఏంచేయాలో వారికి అర్థం కాలేదు. గట్టిగా కేకలు వేస్తూ తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆటోలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బిడ్డలిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే బిడ్డలను పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులకు మాటలు రాలేదు. మరణించిన బిడ్డలను తలచుకుని ఆ తల్లి బోరున విలపించింది. ఈ సంఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వైద్యురాలు మృతి
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మంచిర్యాలలో వైద్యురాలు నవ్య(26) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉదయం బాత్రూంలో విగతజీవిగా కనిపించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రేడియాలజిస్టు రాంబాబు కూతురు నవ్యకు పెద్దపల్లికి చెందిన జనరల్ ఫీజిషియన్ మనోజ్‌కుమార్‌తో 2009 ఆగస్టు 8న వివాహం జరిగింది. నవ్య గైనకాలజిస్టుగా పట్టభద్రురాలు కావడంతో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో నిత్య నర్సింగ్‌హోం తెరిచారు. ఆమె ఏడాదిపాటు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేసింది. పీజీ చేయడానికి శిక్షణ పొందుతూ ఈ నెల చివరి వారంలో పరీక్షకు సిద్ధమవుతోంది. వీరికి ఏడాదిన్నర వయసు ఉన్న కుమారుడు లక్కీ ఉన్నాడు. వారం క్రితమే కుటుంబ సభ్యులు కలిసి తిరుపతికి వెళ్లొచ్చారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చలనం లేకుండా పడి ఉందని భర్త మనోజ్‌కుమార్ తెలిపాడు. ఎన్ని గంటలకు చనిపోయిందనేది చెప్పడం లేదు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవ్య మృతదేహాన్ని బెల్లంపల్లి చౌరస్తాలోని తన తండ్రి రాంబాబు నివాసానికి తరలించారు. మృతురాలి భర్త, అతడి తల్లిదండ్రులు రావడంతో నవ్య కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నవ్యను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు పంపించారు పోలీసుల విచారణ రాంబాబు ఫిర్యాదు మేరకు ఇన్చార్జి సీఐ కరుణాకర్, ఎస్సై వెంకటేశ్వర్లు, తహశీల్దార్ రవీందర్ విచారణ చేపట్టారు. నవ్య పడక గదిని పరిశీలించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందా..? లేక భర్తే హత్య చేసాడా..? సహజ మరణమా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నవ్య భర్త అనుకుని ఫణికుమార్ అనే వైద్యుడిని పోలీసులు జీపులో పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని యత్నించడం కొద్దిసేపు వివాదానికి దారి తీసింది. ఉదయం ఆస్పత్రులు బంద్ నవ్య మరణంతో ఉదయం ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు. వైద్యులు రమణ, అన్నపూర్ణ, మల్లేశ్, రమేశ్‌బాబు, నర్సయ్య, రాజగోపాల్, బద్రి నారాయణ, నాగమల్లేశ్వర్రావు, పురపాలక సంఘం మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.