
సాక్షి, హైదరాబాద్: కొటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్‌లో నవ్య కండేరి (భారత్), జస్టిన్ హో (మలేసియా) విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో నవ్య 21–15, 21–18తో ఇషారాణి బారువా (భారత్)పై, జస్టిన్ 21–18, 21–14తో ప్రణయ్ షెట్టిగర్ (భారత్)పై గెలిచారు.
పురుషుల డబుల్స్ ఫైనల్లో నికోలస్ రాజ్–తుషార్ సువీర్ (భారత్) జోడీ 21–14, 21–18తో అపిలుక్–విత్‌చాయా (థాయ్‌లాండ్) ద్వయంపై... మహిళల డబుల్స్ ఫైనల్లో ఓంగ్ జిన్ యీ–కార్మెన్ టింగ్ (మలేసియా) ద్వయం 21–16, 21–15తో రాధిక శర్మ–తన్వీ శర్మ (భారత్) జోడీపై నెగ్గాయి. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో మయాంక్ రాణా–నర్ధన రవిశంకర్ (భారత్) జోడీ 25–23, 23–21తో కణపురం సాత్విక్ రెడ్డి–వైష్ణవి ఖాడ్కేకర్ (భారత్) జంటను ఓడించింది.
చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment