badmintion tourny
-
సింగిల్స్ చాంప్స్ నవ్య, జస్టిన్ హో
సాక్షి, హైదరాబాద్: కొటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్‌లో నవ్య కండేరి (భారత్), జస్టిన్ హో (మలేసియా) విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో నవ్య 21–15, 21–18తో ఇషారాణి బారువా (భారత్)పై, జస్టిన్ 21–18, 21–14తో ప్రణయ్ షెట్టిగర్ (భారత్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో నికోలస్ రాజ్–తుషార్ సువీర్ (భారత్) జోడీ 21–14, 21–18తో అపిలుక్–విత్చాయా (థాయ్‌లాండ్) ద్వయంపై... మహిళల డబుల్స్ ఫైనల్లో ఓంగ్ జిన్ యీ–కార్మెన్ టింగ్ (మలేసియా) ద్వయం 21–16, 21–15తో రాధిక శర్మ–తన్వీ శర్మ (భారత్) జోడీపై నెగ్గాయి. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మయాంక్ రాణా–నర్ధన రవిశంకర్ (భారత్) జోడీ 25–23, 23–21తో కణపురం సాత్విక్ రెడ్డి–వైష్ణవి ఖాడ్కేకర్ (భారత్) జంటను ఓడించింది. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు! -
36 ఏళ్ల తర్వాత....ఇప్పుడు మళ్లీ
బ్యాడ్మింటన్ చరిత్రలో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. 36 ఏళ్ల తర్వాత ఆ కల నెరవేరింది. ఏంటా కల? కొత్త చరిత్ర లిఖించిన ఆ క్రీడాకారులు ఎవరు? వివరాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
సాయి ప్రణీత్ సంచలనం
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ పెను సంచలనం సృష్టించాడు. అంచనాలకు మించి రాణించి... రియో ఒలింపిక్స్ చాంపియన్ , ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ లాంగ్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–18, 21–13తో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా, ఒకసారి ఆసియా చాంపియన్ గా నిలిచిన చెస్ లాంగ్‌ను చిత్తు చేశాడు. నేడు జరిగే ఫైనల్లో చైనాకే చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకితో సాయిప్రణీత్ అమీతుమీ తేల్చుకుంటాడు. వెనుకబడి... పుంజుకొని చెన్ లాంగ్‌తో గతంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సాయిప్రణీత్ మూడో ప్రయత్నంలో గెలుపొందడం విశేషం. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సాయిప్రణీత్ ఒకదశలో 7–11తో వెనుకబడ్డాడు. కానీ పట్టుదలతో ఆడిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ఆ తర్వాత స్కోరును సమం చేయడమే కాకుండా 17–13తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఆరంభం నుంచే సాయిప్రణీత్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చెన్ లాంగ్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మొదట్లోనే 7–4తో ఆధిక్యంలోకి వెళ్లిన సాయిప్రణీత్ క్రమం తప్పకుండా పాయింట్లు స్కోరు చేసి ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన ఐదో భారతీయ ప్లేయర్‌గా సాయిప్రణీత్ గుర్తింపు పొందాడు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018)... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2011, 2012) ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా విజేతలుగా కూడా నిలిచారు. ►సాయంత్రం గం. 4.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
క్వార్టర్స్‌లో భారత్ ఓటమి
మర్‌ఖమ్ (కెనడా): యువ షట్లర్ లక్ష్య సేన్ చెలరేగినా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. మిక్స్డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–ధ్రువ్ జంట 22–20, 14–21, 12–21తో నా యున్ జియాంగ్–చాన్ వాంగ్ జోడీ చేతిలో ఓడింది. బాలుర సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ లక్ష్యసేన్ 16–21, 21–18, 21–12తో జీ హూన్ చోయ్ పై నెగ్గి ఆధిక్యాన్ని 1–1తో సమం చేశాడు. అనంతరం బాలుర డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జోడీ 21–19, 19–21, 11–21తో యాగ్ షిన్–చాన్ వాంగ్ చేతిలో ఓడింది. బాలికల సింగిల్స్‌లో మాళవిక 17–21, 12–21తో గా యున్ పార్క్ చేతిలో ఓడటంతో భారత్ పరాజయం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి అనంతరం 5 నుంచి 8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 3–1తో డెన్మార్క్‌పై గెలిచి నేడు మలేసియాతో పోరుకు సిద్ధమైంది. -
నేటి నుంచి బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జరగనుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. అండర్-13, 15, 17, 19 బాలబాలికల విభాగాలతో పాటు, మహిళలు, వెటరన్ కేటగిరీల్లో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. సోమవారం జరిగే ఈవెంట్ ఆరంభోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డి హాజరుకానున్నట్లు జిల్లా సంఘం కార్యదర్శి కుంతా పాణీరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 94400-65604 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చు.