హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున బోరబండలో ఇంటి
హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున బోరబండలోని సైట్-౩ వీకర్ సెక్షన్ కాలనీ దేవయ్యబస్తీలో ఇంటి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు సాయి చరణ్ (4), నవ్య (3)గా గుర్తించారు. తల్లిదండ్రులకు తీవ్రంగా గాయలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న రాజు సోమవారం రాత్రి బోరబండలో ఓ గది అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. వెంటనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవటంతో స్థానికంగా విషాదం నెలకొంది. కాగా గాయపడిన రాజు పరిస్థితి విషమంగా ఉండగా, అతని భార్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.