Hyderabad: శిశువును బండకేసి బాదిన ‘మైనర్‌’ తండ్రి | 10Th Class Student Marriage | Sakshi
Sakshi News home page

Hyderabad: శిశువును బండకేసి బాదిన ‘మైనర్‌’ తండ్రి

Published Sun, Jun 18 2023 8:13 AM | Last Updated on Sun, Jun 18 2023 8:25 AM

10Th Class Student Marriage - Sakshi

రహమత్‌నగర్‌(బోరబండ): పరిపక్వత లేని వయస్సు, చదువుకునేటప్పుడు ఏర్పడ్డ ఆకర్షణ ఆ మైనర్లను ఒకటి చేసింది. అది కాస్తా పెళ్లికి దారి తీసింది. తెలిసీతెలియని వయస్సులో వారు ఓ బిడ్డకు సైతం జన్మనిచ్చారు. తమ సుఖాలకు అడ్డువస్తున్నదనే అక్కసుతో కన్న తండ్రి తమ పేగుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు శిశువును చంపాలని యత్నించాడు. జరిగిన ఘోరాన్ని సదరు బాలిక తమ కుటుంబ సభ్యులకు తెలిపింది.

 వారంతా పోలీసులను ఆశ్రయించడంతో విషయంవెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలుడు, మైనర్‌ బాలిక ఇంటర్‌ మీడియట్‌ చదువుతున్నారు. వీరు ఎనిమిదో తరగతి నుండే ఒకనొకరు ఇష్ట పడ్డారు. పదవ తరగతి చివరి పరీక్ష పూర్తి కాగానే యాదగిరిగుట్టలో ఇరువురు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత బోరబండ డివిజన్‌ ఓ ప్రాంతంలో కాపురం పెట్టారు. 2022లో వీరికి ఓ పాప పుట్టింది. 

తన దాంపత్య జీవితానికి అడ్డంకిగా మారుతున్నదని సదరు తండ్రి పసి గుడ్డుపై పలు మార్లు హత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో మే 4న తిరిగి బిడ్డను బండకేసి బాదాడు. ఈ ఘటనలో శిశువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారంతా కలిసి శుక్రవారం బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement