సెల్‌ఫోన్‌ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ | Siblings fight for cellphone | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ

Published Sat, Sep 2 2023 3:23 AM | Last Updated on Sat, Sep 2 2023 3:23 AM

Siblings fight for cellphone - Sakshi

దుబ్బాక టౌన్‌: అక్కాచెల్లెళ్ల మధ్య సెల్‌ ఫోన్‌ చిచ్చు రాజేసింది. ఫోన్‌కోసం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, చెల్లెలు క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మర్గల శంకర్, వసంత దంపతులకు ముగ్గురు కూతుర్లున్నారు. రెండో కుమార్తె నందిని డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. చిన్న కుమార్తె నవిత అలి యాస్‌ నవ్య (18) డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది.

గురువారం ఉదయం ఇద్దరూ సెల్‌ఫోన్‌ విషయమై గొడవ పడ్డారు. ఇది గమనించిన తల్లి, వారిని మందలించి ఫోన్‌ ను బీరువాలో పెట్టి తాళం వేసి పని కోసం వెళ్లింది. దీంతో అప్పటికే ఆవేశంలో ఉన్న నవిత గడ్డిమందు తాగింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నందిని, చెల్లి అపస్మరక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు చేరుకున్నా రు.

వెంటనే నవితను దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం సిద్దిపేట హాస్పిటల్‌కు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నవ్య మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement