క్యాన్సర్‌తో బాధపడుతున్న నవ్య
శ్రీకాకుళం, మందస: పేదరికమే శాపమైన ఆ కుటుంబంలో జన్మించిన చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమార్తెకు క్యాన్సర్ ఉందని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లుపోతున్నారు. మందస మండలంలోని లొహరిబంద గ్రామానికి చెందిన రెయ్యి రాజు, లక్ష్మీకాంతం దంపతుల కుమార్తె నవ్య(7) రెండో తరగతి చదువుతోంది. నవ్య మెడపై ఇటీవల చిన్నగా వాపు రావడంతో గగ్గలుగా భావించారు. రెండు నెలలైనా తగ్గకపోవడంతో ఒడిశాలోని బరంపురం, విశాఖపట్నంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లగా క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు.
నవ్య తండ్రి రాజు పొట్టకూటికోసం గుజరాత్‌లోని అహ్మదాబాదులో కూలీగా పని చేస్తున్నారు. తల్లి, అమ్మమ్మలు చిన్నారికి కేన్సర్ సోకినట్టు గుర్తించలేకపోవడం, అప్పటికే స్టేజ్–2కు చేరడంతో వైద్యానికి రూ.1.5 లక్షలు ఖర్చయ్యింది. మరో రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. నవ్య పేరు సాధికార సర్వేలో లేకపోవడంతో ఆరోగ్యశ్రీ(ఎన్‌టీఆర్ వైద్యసేవ) పథకం వర్తించడంలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓ వైపు పేదరికం.. మరో వైపు చికిత్స చేయించలేని ధైన్యం.. దీంతో ఆ తల్లిదండ్రులు ఆదుకునే ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment