కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాలిక ప్రశీల
శ్రీకాకుళం,ఆమదాలవలస: ఒళ్లంతా గాయాలైన చిన్నారిని చూసి ఆ తల్లి తల్లిడిల్లింది. తనకు ఏమైనా పర్వాలేదు నవ మాసాలు మోసిన బిడ్డ బాగుండాలని తన చర్మంతో వైద్యం చేయించాలని కోరింది. వైద్యమైతే చేయించాలని ఆశపడింది కానీ ఆర్థిక సాయం అందక నిలువునా కుమిలిపోతోంది. దాతలు ఎవరైనా దయతలిస్తే తన కంటి పాపను బతికించుకోవాలని ఆశపడుతోంది. మున్సిపాలిటీలోని రెండోవార్డు కృష్ణాపురం గ్రామానికి చెందిన మెట్ట శ్రీనివాసరావు, పార్వతి దంపతులు విశాఖపట్నం సుజాతానగర్‌లో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు లలిని, ప్రశీలా ఉన్నారు. అయితే మూడు నెలల క్రితం విశాఖపట్నంలో వారి ఇంటివద్ద తల్లి పార్వతి దీపం వెలిగించేటప్పుడు ప్రశీల అగ్ని ప్రమాదానికి గురయ్యింది.
తులసి కోటవద్ద తల్లి పెట్టిన దీపం దుస్తులకు అంటుకోవడంతో 60 శాతం గాయపడింది. వెంటనే విమ్స్‌కి తెసుకెళ్లగా ఎవరి చర్మానైనా ఉపయోగించి శస్త్రచికిత్స చేయవచ్చునని తెలియజేశారు. దీంతో బాలిక తల్లి చర్మం ఇచ్చేందుకు సిద్ధం కావడంతో చికిత్స చేశారు. అయితే వైద్యం కోసం ఇప్పటివరకు రూ.3 లక్షలు ఖర్చు అయ్యిందని, మరో మూడు రూ.లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని బాలిక తండ్రి తెలియజేశారు. వైద్య ఖర్చులకు ప్రస్తుతం డబ్బులు లేవని దాతలు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. వీరికి కర్లకో ట గ్రామానికి చెందిన యువ కిరణాలు సేవా సమి తి సభ్యులు రూ.10 వేల ఆర్థిక సాయం సోమవా రం అందజేశారు.
ఆర్థిక సాయం అందించాలనుకునేవారు
మెట్ట శ్రీనివాసరావు, అకౌంట్ నంబర్ 123810100055034, ఆంధ్రా బ్యాంకు,మధురవాడ బ్రాంచ్, విశాఖపట్టణం, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఏఎన్‌డీబీ 0001238, గోగుల్ పే, ఫోన్ పేకు 7995880331 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment