Tv Serial Actress Navya Swamy Buy New Luxury Car Photos Goes Viral - Sakshi

Tv Actress Navya Swamy: లగ్జరీ ‍కారు కొన్న నవ్య స్వామి, నటుడు రవికృష్ణ రియాక్షన్‌ చూశారా?

Published Tue, Jan 3 2023 12:33 PM | Last Updated on Tue, Jan 3 2023 1:14 PM

Tv Actress Navya Swamy Buy New Luxury Car Photos Goes Viral - Sakshi

టీవీ నటి నవ్య స్వామి.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పలు టీవీ సీరియల్స్‌తో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైంది. తక్కువ సమయంలో నటిగా ఆమె మవంచి గుర్తింపు పొందింది. నటిగానే కాదు, పలు టీవీ షొలతో, సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ని అలరిస్తు ఉంటుంది. ఇదిలా తాజాగా ఆమె ఓ లగ్జరీ బెంజ్‌ కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. తాను కారు కొన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. 

దీంతో వెంటనే తన ఫొటోను షేర్‌ చేస్తూ బిగ్‌బాస్‌ ఫేం, నటుడు, ఆమె రూమర్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌ రవికృష్ణ నవ్యస్వామికి శుభాకాంక్షలు తెలిపాడు. ‘హే కంగ్రాచ్యూలేషన్స్ రౌడీ ఫెలో.. లిస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అని లవ్ సింబల్స్ పెట్టి తన స్టోరీలో పోస్ట్ చేశాడు. ‘అంతేగా అంతేగా’ అని నవ్యస్వామి బదులిచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. కాగా నటుడు రవి కృష్ణ, నవ్య స్వామి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆమె కథ’ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరికి అప్పుడే పరిచయం ఎర్పడింది.

అప్పటి నుంచి వీరిద్దరు ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు.పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొంటున్నారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో తరచూ వీరిద్దరి ఫొటోలను షేర్‌ చేస్తుంటారు. ఒకరి పోస్ట్‌పై ఒకరు స్పందించడం, కామెంట్స్‌ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నవ్యస్వామి ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఆహాలో ఈమె హీరోయిన్‌గా చేసిన ‘ఇంటింటా రామాయణం’ సిరీస్‌ రిలీజ్ కావాల్సి ఉంది. అలానే మరికొన్ని కూడా సెట్స్‌పై ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement