buy cars
-
లగ్జరీ కారు కొన్న నవ్య స్వామి, నటుడు రవికృష్ణ రియాక్షన్ చూశారా?
టీవీ నటి నవ్య స్వామి.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పలు టీవీ సీరియల్స్‌తో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైంది. తక్కువ సమయంలో నటిగా ఆమె మవంచి గుర్తింపు పొందింది. నటిగానే కాదు, పలు టీవీ షొలతో, సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని అలరిస్తు ఉంటుంది. ఇదిలా తాజాగా ఆమె ఓ లగ్జరీ బెంజ్ కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తాను కారు కొన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో వెంటనే తన ఫొటోను షేర్ చేస్తూ బిగ్‌బాస్ ఫేం, నటుడు, ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రవికృష్ణ నవ్యస్వామికి శుభాకాంక్షలు తెలిపాడు. ‘హే కంగ్రాచ్యూలేషన్స్ రౌడీ ఫెలో.. లిస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అని లవ్ సింబల్స్ పెట్టి తన స్టోరీలో పోస్ట్ చేశాడు. ‘అంతేగా అంతేగా’ అని నవ్యస్వామి బదులిచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. కాగా నటుడు రవి కృష్ణ, నవ్య స్వామి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆమె కథ’ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరికి అప్పుడే పరిచయం ఎర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు.పలు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో తరచూ వీరిద్దరి ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఒకరి పోస్ట్‌పై ఒకరు స్పందించడం, కామెంట్స్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నవ్యస్వామి ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఆహాలో ఈమె హీరోయిన్గా చేసిన ‘ఇంటింటా రామాయణం’ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. అలానే మరికొన్ని కూడా సెట్స్‌పై ఉన్నాయి. -
ఖరీదైన కారు కొన్న రచ్చ రవి, ధరెంతంటే..
నటుడు, కమెడియన్ రచ్చ రవి ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దసరా పండుగ సందర్భంగా కొత్త కారు కొన్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేసి దానితో దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా ‘ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలుస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. కాగా రచ్చ ఈ కారు విలువ దాని ఫీచర్లను బట్టి దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. చదవండి: ఆదిపురుష్ టీజర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు రచ్చ రవి. ఈ షోలో తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందాడు. అదే క్రేజ్‌తో సినిమాల్లో సైతం ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో జబర్థస్త్ షో నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీంతో నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రవిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. View this post on Instagram A post shared by Racha Ravi (@meracharavi) -
అప్పుడు ఒక్క పైసా లేదు.. ఇప్పుడు కోట్ల రూపాయల కారులో షికారు
Actor Maniesh Paul Roaming In Crore Rupees Car With His Family: జీవితం చాలా విచిత్రమైనది. అప్పుడే బాధలు, కష్టాలతో సతమతం చేసి ఆ వెంటనే ఎవరికీ అందనంతా అందలం ఎక్కిస్తుంది. ఇలాంటి సంఘటనే ఓ ప్రముఖ సెలబ్రిటీకి జరిగింది. బాలీవుడ్లో మోడల్‌గా, కమెడియన్‌గా తనదైన ముద్ర వేసుకున్నాడు మనీష్ పాల్. ఇటీవల తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి నోరు విప్పాడు. 2021లో ముంబైకి మారినప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపాడు. అప్పుడు తనకు ఉద్యోగం లేదని, ఇంటి అద్దె చెల్లించడానికి కూడా ఒక్క పైసా లేదని పేర్కొన్నాడు. అయితే 2022 సంవత్సరానికి వచ్చే సరికి సీన్ మారింది. ఏకంగా రూ. 1.14 కోట్ల విలువైన కారులో ముంబైలో తిరిగుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. పైస్థాయికి చేరుకోడానికి చాలా కష్టపడిన మనీష్ సోషల్ మీడియాలో పోస్ట్‌లతో తరచుగా వార్తల్లో నిలుస్తాడు. కానీ ఈసారి తన కుటుంబం మీడియా దృష్టిని ఆకర్షించింది. మనీష్, తన భార్యా పిల్లలతో కలిసి క్లాన్ మెర్సిడెస్ జీఎల్ఎస్ 400 కారులో నగరంలో షికారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. మనీష్ వారి కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ఇంత విలువైన కారులో తిరిగేందుకు మనీష్ అర్హుడు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో మనీష్ ప్యాచ్‌లతో కూడిన డెనిమ్ జాకెట్లో స్టైలిష్‌గా కనిపించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కొత్త కారు కొన్న బ్యూటీఫుల్ కపుల్.. దాని విలువ కోట్లలోనే
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. దీంతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది షాహిద్, మీరా. ఇటీవల షాహిద్ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్‌స్టా అకౌంట్లో మీరా బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టింది. ఈ జంట పెట్టె పోస్ట్‌లను అభిమానులు #కప్గోల్స్గా పిలుస్తారు. అలాగే వారిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటుందని ఫ్యాన్స్ పొగుడుతూ ఉంటారు. అయితే సోమవారం (ఫిబ్రవరి 28) షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ ఒక కారు నుంచి దిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే షాహిద్, మీరా దిగిన కారు విలువ సుమారు రూ. 2.77 కోట్లు ఉంటుందని అంచనా. వారు ఈ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ కారును కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.11 కోట్ల నుంచి రూ. 2.79 కోట్ల వరకు ఉంటుంది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ బ్లాక్ మెర్సిడేస్ను డెలీవరి చేసేందుకు కంపెనీ నిర్వాహకులు వచ్చారు. ఈ కారును తీసుకునేందుకు షాహిద్, మీరా వచ్చే క్రమంలో ఫొటోగ్రాఫర్లకు చిక్కారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అక్రమార్కుల్లో దడదడ
ఠారెత్తిస్తోన్న ఇన్‌కంట్యాక్స్ దాడులు పన్ను ఎగవేతదారులపై ఐటీ కన్ను జిల్లా వ్యాప్తంగా బంగారం, కార్ల కొనుగోళ్లపై ఆరా చిత్తూరు, తిరుపతిల్లో మొదలైన ఐటీ వేట జిల్లాలో ఐటీ వేట మొదలైంది. పన్ను చెల్లించకుండా నల్ల«ధనాన్ని వెనకేసుకున్న అక్రమార్కులను బయటకు లాగే పనిలో పడ్డారు ఐటీ అధికారులు. ఇందుకోసం మొదట చిత్తూరు, తిరుపతి పట్టణాలను ఎంపిక చేసుకున్నారు. అనుమానమున్న నల్లకుబేరుల చిట్టాలను తిరగేస్తున్నారు. ఓ నిర్ధారణకు వచ్చాక అకస్మాత్తుగా దాడులకు పూనుకుటున్నారు. దీంతో ప్రస్తుతం సంపన్నులుగా చలామణి అవుతున్న బడా బాబుల్లో ఐటీ భయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తిరుపతి : అక్రమార్కుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కోట్ల విలువ చేసే నగదు, డాక్యుమెంట్లను మూడో కంటికి తెలియకుండా దాచే పనుల్లో నిమగ్నమయ్యారు. వరుసగా జరుగుతున్న ఐటీ సోదాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమార్కుల్లో ఐటీ జ్వరం తీవ్రస్థాయికి చేరుతోంది. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా నల్లధనాన్ని వెనకేసుకున్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇన్‌కంట్యాక్స్ పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల చిత్తూరులో బద్రీనారాయణ ఇంట్లోనూ, పలమనేరు మండలంలోనూ ఐటీ సోదాలు జరిగాయి. తాజాగా రెండ్రోజు ల నుంచి తిరుపతి పట్టణంలోని గుణశేఖర్‌యాదవ్ ఇంట్లోనూ, వరరూప హ్యాపీ హోమ్స్ సంస్థల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దీంతో మిగిలిన నల్లకుబేరుల్లో ఆందోళన పెరిగింది. మరో వందకుపైగా ఖాతాలు ఆదాయపుపన్ను శాఖ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరంతా ఐటీ బారి నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయ్యాకనే.. పెద్ద నోట్ల రద్దు తదనంతరం ఐటీ అధికారుల విజిలెన్సు బాగా పెరిగింది. నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చాక జిల్లాలోని వివిధ బ్యాంకుల ఖాతాల్లోకి వెల్లువెత్తిన నల్లధనంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. పరిమితికి మించి జరిగిన లావాదేవీల ఖాతాలను పరిశీలిస్తోంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్, బంగారు వ్యాపారులపై ఐటీ ఫోకస్ పెట్టింది. నోట్ల రద్దు తరువాత వ్యాపారం లేదని గగ్గోలు పెట్టిన జ్యూవెలరీ వ్యాపారులు పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాల్లో వేసిన డిపాజిట్లను బయటకు లాగుతోంది. పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే బంగారు వర్తకుల ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏ రోజు ఎంతెంత నగదు జమైందన్న విషయాలను ఐటీ అధికారులు బయటకు తీస్తున్నారు. తిరుపతి కేంద్రంగా జరిగిన బంగారం అమ్మకాలను పరిశీలించిన ఐటీ అధికారులు అరడజను మంది వ్యాపారులు రూ.4 కోట్లకు పైగా ఖాతాల్లో జమ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెల్సింది. అంతేకాకుండా నోట్ల రద్దు తరువాత జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్ల కొనుగోళ్ల పై కూడా ఆదాయపు పన్ను శాఖ వివరాలు సేకరిస్తోంది. సుమారు వంద మందికి పైగా అక్రమార్కులు కార్ల కొనుగోళ్లపై ఎక్కువ మొత్తం నల్లధనాన్ని మార్చినట్లు సమాచారం.