Actor Manish Paul Buys New Mercedes-Benz GLS 400 Car: కోట్ల రూపాయల కారులో షికారు - Sakshi
Sakshi News home page

Maniesh Paul: అప్పుడు ఒక్క పైసా లేదు.. ఇప్పుడు కోట్ల రూపాయల కారులో షికారు

Published Wed, Mar 2 2022 3:47 PM | Last Updated on Wed, Mar 2 2022 5:29 PM

Actor Maniesh Paul Roaming In Crore Rupees Car With His Family - Sakshi

Actor Maniesh Paul Roaming In Crore Rupees Car With His Family: జీవితం చాలా విచిత్రమైనది. అప్పుడే బాధలు, కష్టాలతో సతమతం చేసి ఆ వెంటనే ఎవరికీ అందనంతా అందలం ఎక్కిస్తుంది. ఇలాంటి సంఘటనే ఓ ప్రముఖ సెలబ్రిటీకి జరిగింది. బాలీవుడ్​లో మోడల్​గా, కమెడియన్​గా తనదైన ముద్ర వేసుకున్నాడు మనీష్ పాల్​. ఇటీవల తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి నోరు విప్పాడు. 2021లో ముంబైకి మారినప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపాడు. అప్పుడు తనకు ఉద్యోగం లేదని, ఇంటి అద్దె చెల్లించడానికి కూడా ఒక్క పైసా లేదని పేర్కొన్నాడు. అయితే 2022 సంవత్సరానికి వచ్చే సరికి సీన్​ మారింది. ఏకంగా రూ. 1.14 కోట్ల విలువైన కారులో ముంబైలో తిరిగుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. 



పైస్థాయికి చేరుకోడానికి చాలా కష్టపడిన మనీష్​ సోషల్​ మీడియాలో పోస్ట్​లతో తరచుగా వార్తల్లో నిలుస్తాడు. కానీ ఈసారి తన కుటుంబం మీడియా దృష్టిని ఆకర్షించింది. మనీష్​, తన భార్యా పిల్లలతో కలిసి క్లాన్​ మెర్సిడెస్​ జీఎల్​ఎస్​ 400 కారులో నగరంలో షికారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. మనీష్​ వారి కుటుంబంతో కలిసి రెస్టారెంట్​కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్​ వైరల్​ భయానీ తన ఇన్​స్టా అకౌంట్​లో షేర్​ చేశాడు. ఇంత విలువైన కారులో తిరిగేందుకు మనీష్​ అర్హుడు అంటూ అభిమానులు కామెంట్స్​ పెడుతున్నారు. ఈ వీడియోలో మనీష్​ ప్యాచ్​లతో కూడిన డెనిమ్​ జాకెట్​లో స్టైలిష్​గా కనిపించాడు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement