కమెడియన్‌కు రెండోసారి కరోనా.. అభిమానులకు క్షమాపణలు | Comedian Vir Das Test Positive For Covid 19 Second Time | Sakshi
Sakshi News home page

కమెడియన్‌కు రెండోసారి కరోనా.. అభిమానులకు క్షమాపణలు

Published Wed, Jun 15 2022 7:13 PM | Last Updated on Wed, Jun 15 2022 7:16 PM

Comedian Vir Das Test Positive For Covid 19 Second Time - Sakshi

Comedian Vir Das Test Positive For Covid 19 Second Time: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. బ్రేక్‌ ఇచ్చినట్టే ఇచ్చి ఒక్కసారిగా విరుచుకుపడుతున్నట్లుగా ఉన్నాయి కొవిడ్‌ కేసులు. ఇటీవల బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, కత్రీనా కైఫ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు, కమెడియన్‌ వీర్‌ దాస్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా బుధవారం (జూన్‌ 15) తెలిపాడు. ఇలా ఆయనకు కరోనా సోకడం ఇది రెండోసారి. ఇదివరకు ఈ ఏడాది జనవరిలో మహమ్మారి బారిన పడ్డాడు. 

ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న దాస్.. తన కామెడీ షోలు వాయిదా పడటంతో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రాష్ట్రంలో జరగాల్సిన ఈ కామెడీ షోలు తర్వాతి తేదిలలో నిర్వహిస్తారని పేర్కొన్నాడు. 'మీకు కావాలంటే మీ టికెట్లు వాపసు ఇవ్వబడతాయి. క్షమించండి గుజరాత్‌. నేను ఈ విషయం గురించి చాలా విచారంగా ఉన్నాను. కానీ తర్వలో మిమ్మల్ని లైవ్‌లో చూడాలని కోరుకుంటున్నాను. మీరు కొత్త తేదిలలో షోకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.' అని 43 ఏళ్ల వీర్‌ దాస్‌ తెలిపాడు. 

చదవండి:👇  
ముసలిదానివైపోతున్నావ్‌.. అంటూ అనసూయపై కామెంట్లు
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి
ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్‌ హాసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement