
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. దీంతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది షాహిద్, మీరా. ఇటీవల షాహిద్ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్‌స్టా అకౌంట్లో మీరా బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టింది. ఈ జంట పెట్టె పోస్ట్‌లను అభిమానులు #కప్గోల్స్గా పిలుస్తారు. అలాగే వారిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటుందని ఫ్యాన్స్ పొగుడుతూ ఉంటారు.
అయితే సోమవారం (ఫిబ్రవరి 28) షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ ఒక కారు నుంచి దిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే షాహిద్, మీరా దిగిన కారు విలువ సుమారు రూ. 2.77 కోట్లు ఉంటుందని అంచనా. వారు ఈ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ కారును కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.11 కోట్ల నుంచి రూ. 2.79 కోట్ల వరకు ఉంటుంది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ బ్లాక్ మెర్సిడేస్ను డెలీవరి చేసేందుకు కంపెనీ నిర్వాహకులు వచ్చారు. ఈ కారును తీసుకునేందుకు షాహిద్, మీరా వచ్చే క్రమంలో ఫొటోగ్రాఫర్లకు చిక్కారు.
Comments
Please login to add a commentAdd a comment