Comedian Racha Ravi Buys Nexa Grand Vitara New Car photo Goes Viral - Sakshi
Sakshi News home page

Racha Ravi: ఖరీదైన కారు కొన్న రచ్చ రవి, ధరెంతంటే..

Published Sun, Oct 9 2022 3:56 PM | Last Updated on Sun, Oct 9 2022 4:33 PM

Comedian Racha Ravi Buys Nexa Grand Vintage New Car photo Goes Viral - Sakshi

నటుడు, కమెడియన్‌ రచ్చ రవి ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. దసరా పండుగ సందర్భంగా కొత్త కారు కొన్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేసి దానితో దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా ‘ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలుస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. కాగా రచ్చ ఈ కారు విలువ దాని ఫీచర్లను బట్టి దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

చదవండి: ఆదిపురుష్‌ టీజర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్‌ కామెంట్స్‌ 

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు రచ్చ రవి. ఈ షోలో తనదైన కామెడీ, పంచ్‌ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందాడు.  అదే క్రేజ్‌తో సినిమాల్లో సైతం ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో జబర్థస్త్‌ షో నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీంతో నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రవిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement