పెద్దలకు భయపడి విషం తాగిన ప్రేమికులు | suicide attempt by lovers in west godavari | Sakshi
Sakshi News home page

పెద్దలకు భయపడి విషం తాగిన ప్రేమికులు

Published Mon, May 8 2017 7:20 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

suicide attempt by lovers in west godavari

కుక్కునూరు(పశ్చిమ గోదావరి జిల్లా): కుటుంబ పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుక్కునూరు మండలం పాములేరు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అశ్వాపురం మండలం జగ్గారంకు చెందిన ఆటో డ్రైవర్ కిషోర్(23), ఆశ్వాపురం మండల కేంద్రం మంచికంటి నగర్ కు చెందిన నవ్య అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే, ఇటీవలె ఈ విషయం వాళ్ల ఇళ్లల్లో తెలియడం, వారి పెళ్లికి అంగీకరించని కారణంతో ఇద్దరూ కలిసి పాములేరు వద్ద పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement