మనవరాళ్లకు అమితాబ్ లేఖ! | Amitabh Bachchan: You may be a Nanda or a Bachchan, but never ever worry about log kya kahenge | Sakshi
Sakshi News home page

మనవరాళ్లకు అమితాబ్ లేఖ!

Published Mon, Sep 5 2016 10:05 AM | Last Updated on Mon, Sep 4 2017 12:25 PM

మనవరాళ్లకు అమితాబ్ లేఖ!

మనవరాళ్లకు అమితాబ్ లేఖ!

సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మనవరాళ్లకు అమితాబ్ ఓ అందమైన లేఖ రాశారు. ఫేమ్ కలిగిన కుటుంబంలో జన్మించిన మీకు.. మహిళలకు ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకునే అవకాశాలను మాత్రం ఆ 'ఫేమ్' ఇవ్వలేదని లేఖలో పేర్కొనడం విశేషం. మహిళ జీవితంలో ఎదురయ్యే సున్నిత సమయాలను, సమస్యలను ప్రస్తావించిన అమితాబ్ లేఖను పూర్తిగా చూద్దాం..

లేఖలోని సారాంశం
డియర్ నవ్య, ఆరాధ్య.. మీ ముత్తాత గార్లు అయిన డా.హరివన్ష రాయ్ బచ్చన్, హెచ్ పీ నందల పేర్లు మీ ఇంటిపేరుగా నిలవడం వల్ల మీకు ఒక గుర్తింపు వస్తుంది. మీరు నంద అయినా లేక బచ్చన్ అయినా ముందు గుర్తించవలసింది మీరు కూడ ఒక మహిళేనని!. మీరు మహిళలు కాబట్టే ఇతరులు వారి వారి ఆలోచనలు మీపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలా ఉండాలో, ఎవరిని కలవాలో, ఎక్కడి వెళ్లాలో.. కూడా వాళ్లే చెప్తారు.

వారి ఆలోచనల నీడల్లో మీరు జీవించొద్దు. మీ తెలివితేటలతో మీ జీవితాన్ని మీరే లీడ్ చేయాలి. మీ గుణం మంచిది అనడానికి మీరు వేసుకునే స్కర్ట్ పొడవు సింబల్ అనే ఎదుటివారిని మాటలను నమ్మొద్దు. మీ స్నేహితులను మీరే ఎన్నుకోండి. మీకు ఎవరిని పెళ్లాడాలని అనిపిస్తే వారినే వివాహం చేసుకోండి. అనవసర కారణాలతో ఇతరులను వివాహం చేసుకోకండి. ఇతరులు మాట్లాడతారు. కానీ మీరు ప్రతి ఒక్కరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేరేవాళ్లు ఏం అనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించొద్దు. మీ కర్మలకు కర్త, క్రియ మీరే కావాలి. అప్పుడే మీ తప్పులను మీరే సరిదిద్దుకో గలుగుతారు. నవ్య.. నీ ఇంటిపేరు ఓ మహిళ ఎదుర్కొనే కష్టాలనుంచి నిన్ను కాపాడలేదు. ఆ కష్టాల నుంచి నిన్ను నువ్వే రక్షించుకోవాలి.

ఆరాధ్య.. ఈ లేఖ సారాంశం నీకు అర్ధమయ్యే సమయానికి నేను నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ, నేను ఈ రోజు చెబుతున్నవి ఆ సమయానికి ఇలానే ఉంటాయని భావిస్తున్నాను. మహిళగా జీవించడం కష్టమే కావొచ్చు. కానీ నీ లాంటి వాళ్లు ఆ కష్టాలు లేకుండా చేస్తారని నా విశ్వాసం. నీకు నువ్వే హద్దులు పెట్టుకోవడం, నీకు ఇష్టమైన దాన్ని ఎంచుకోవడం, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం అంత సులువు కాకపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్న మహిళలకు నువ్వు ఒక ఉదాహరణగా నిలవొచ్చు. నువ్వు ఇది చేస్తే, నేను సాధించిన దాని కన్నా ఎక్కువ సాధించిన వ్యక్తివి అవుతావు. అది నాకు గొప్ప గౌరవం. అప్పుడు నేను అమితాబ్ బచ్చన్ ను కాదు ఆరాధ్యకు తాతయ్యను అవుతాను!.
ప్రేమతో..
మీ తాతయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement