ముంబై: తన కుమారుడు, హీరో అభిషేక్ బచ్చన్ గతంలో రాసిన ఒక లేఖను బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను లాంగ్ అవుట్‌డోర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో అభిషేక్ తనకు రాసిన లేఖను ఈ సందర్భంగా తన అభిమానులతో పంచుకున్నారు.
'డార్లింగ్ పాపా, మీరు ఎలా ఉన్నారు? మేమంతా క్షేమంగానే ఉన్నాము. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. పాపా, మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే ఇంటికి వస్తారని ఆకాంక్షిస్తున్నాను. నేను మీ కోసం ప్రార్థిస్తున్నాను, దేవుడు మన ప్రార్థనలను వింటున్నాడు. పాపా మీరేం బెంగపెట్టుకోవద్దు.. అమ్మను(జయా) బాగా చూసుకుంటాను' అనేది ఆ లేఖ సారాంశం. అయితే లేఖ రాసినప్పుడు అభిషేక్ వయస్సు ఎంత ఉంటుందనే విషయాన్ని బిగ్‌బీ వెల్లడించలేదు.
T 3549 - Abhishek in his glory .. a letter to me when I was away on a long outdoor schedule ..
पूत सपूत तो क्यूँ धन संचय ; पूत कपूत तो क्यूँ धन संचय pic.twitter.com/Tatw1VU1oj
— Amitabh Bachchan (@SrBachchan) November 14, 2019
బిగ్‌బి, అభిషేక్‌లు కలిసి పా, సర్కార్, సర్కార్ రాజ్, బంటీ ఔర్ బబ్లీ, కబీ అల్విదా నా కెహనా సహా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అమితాబ్ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి గులాబో సీతాబో చిత్ర షూటింగ్‌ను పూర్తిచేసుకోగా.. ఇమ్రాన్ హాష్మీతో నటించిన చెహ్రే విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలానే క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోర్‌పతి సీజన్11కు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అభిషేక్ ది బిగ్ బుల్‌తో పాటు బ్రీత్ సీజన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment