
ముంబై: అభిషేక్ బచ్చన్, ఐశర్యారాయ్‌ల గారాలపట్టి ఆరాధ్యకు స్టార్ కిడ్‌గా ప్రత్యేక అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆరాధ్య ఎరుపు, పచ్చని రంగులతో ఉన్న చీరను ధరించి తాను చదివే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలో సందడి చేసింది. ఆరాధ్య ఈ వేడుకల్లో మహిళ సాధికారత, గొప్పతనం గురించి ముద్దుముద్దుగా మాట్లాడింది. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తన మనమరాలు ఆరాధ్య మాట్లాడిన వీడియోను అమితాబ్ బచ్చన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఆరాధ్య మహిళల గొప్పతనం, సాధికారతపై మాట్లాడటం చాలా గర్వించదగిన విషయం’ అని బిగ్ బీ కామెంట్ చేశారు. మహిళల గురించి ఆరాధ్య మాట్లాడిన మాటలకు బిగ్‌బీ ఆనందంతో పొంగిపోయారు.
the proudest moment and voice .. of the girl child .. of Aaradhya , my own .. https://t.co/Gsa9gBIgBA
— Amitabh Bachchan (@SrBachchan) December 22, 2019
ఈ వేడుకలో అభిషేక్ బచ్చన్, ఐశర్యారాయ్‌లతోపాటు స్టార్ కిడ్స్ తల్లిదండ్రులు.. షారుక్‌ఖాన్, కరిష్మా కపూర్, లారాదత్తా తదితరులు పాల్గొన్నారు. స్టార్స్ కిడ్స్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీరంతా తిలకించారు. ఈ వేడుకలకు అమితాబ్ బచ్చన్ హాజరు కాలేకపోయారు. బిగ్ బీ తాజాగా నాగరాజ్ మంజులే చిత్ర షూటింగ్‌లో ఉన్నారు. పాఠశాల వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కనెక్షన్ ద్వారా అమితాబ్ ఆరాధ్య మాట్లాడిన వీడియోను తిలకించారు.