బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అక్కడ బిగ్‌బీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ ప్రక్రియ జరిగిందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీనికి సంబంధి ఒక కృతజ్ఞతా సందేశాన్ని కూడా బిగ్‌బీ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు క్రికెటర్ గురించి కూడా ఒక ట్వీట్ చేయడం విశేషం. కాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్, దిశా పటానీ, దీపికా పదుకొణె నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి రానుంది.
ఆంజియో ప్లాస్టీ అంటే ఏమిటి? ఎపుడు చేస్తారు?
గుండెలోని క్లాట్స్‌ను తొలగించేందుకు వినియోగించే ఆధునిక టెక్నాలజీ ఆంజియోప్లాస్టీ. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి, అవసరమనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టెంట్‌ను అమర్చడాన్ని ఆంజియోప్లాస్టీ అంటారు. తద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాలలో కొవ్వుపేరుకొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు. రక్తనాళాల్లో బ్లాకేజీ 70 శాతం కంటే ఎక్కువగా ఉండే వారికి ఇది చేస్తారు.
T 4950 - in gratitude ever ..
— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024
ఛాతిలో నొప్పి, వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం రావడం, అలసిపోయినట్టు అనిపించడం బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపించినపుడు, హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి ఆంజియోగ్రామ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. తరువాత హానికరమైన క్లాట్స్‌ను గురించినట్టయితే ఆంజియో ప్లాస్టీ ద్వారా చికిత్స అందించి భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారించడంతోపాటు, ప్రాణాపాయం నుంచి కాపాడతారు.
Comments
Please login to add a commentAdd a comment