Kokilaben Hospital
-
అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం సరిగా లేదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మార్చి 15న రోజంతా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్లను కోరుతూ వారందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కామెంట్లు చేశారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని అక్కడ ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందారు. బిగ్ బి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆయన బహిరంగ ప్రదేశంలో కనిపించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబయి, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కుమారుడితో అమితాబ్ హాజరయ్యారు. మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఆయన్ను ఆరోగ్యం గురించి మీడియా వారు ప్రశ్నించగా... అందులో నిజం లేదని, ఆ వార్తలు ఫేక్ అని తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ఆయన చికిత్స పొందారు అని ప్రచారంలో ఉన్న కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి కూడా అమితాబ్ గురించి ఎలాంటి ధృవీకరణ లేదు. దీంతో ఇవన్నీ ఫేక్ అని తెలుస్తోంది. (ISPL) ఫైనల్ మ్యాచ్‌లో భారత మాజీ క్రికెటర్ సచిన్‌తో అమితాబ్ కనిపించారు. వారిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసిని అభిమానులు సంబరపడ్డారు. అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ADలో కనిపించబోతున్నారు, ఇది 2024లో మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ ఉన్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్ వెట్టయన్ చిత్రంలో కూడా అమితాజ్ నటించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ నటీనటుల తెరపై మళ్లీ కలయిక కోసం ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆసుపత్రిలో బిగ్ బీ : ఆంజియోప్లాస్టీ అంటే ఏమిటి?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అక్కడ బిగ్‌బీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ ప్రక్రియ జరిగిందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీనికి సంబంధి ఒక కృతజ్ఞతా సందేశాన్ని కూడా బిగ్‌బీ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు క్రికెటర్ గురించి కూడా ఒక ట్వీట్ చేయడం విశేషం. కాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్, దిశా పటానీ, దీపికా పదుకొణె నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి రానుంది. ఆంజియో ప్లాస్టీ అంటే ఏమిటి? ఎపుడు చేస్తారు? గుండెలోని క్లాట్స్‌ను తొలగించేందుకు వినియోగించే ఆధునిక టెక్నాలజీ ఆంజియోప్లాస్టీ. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి, అవసరమనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టెంట్‌ను అమర్చడాన్ని ఆంజియోప్లాస్టీ అంటారు. తద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాలలో కొవ్వుపేరుకొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు. రక్తనాళాల్లో బ్లాకేజీ 70 శాతం కంటే ఎక్కువగా ఉండే వారికి ఇది చేస్తారు. T 4950 - in gratitude ever .. — Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024 ఛాతిలో నొప్పి, వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం రావడం, అలసిపోయినట్టు అనిపించడం బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపించినపుడు, హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి ఆంజియోగ్రామ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. తరువాత హానికరమైన క్లాట్స్‌ను గురించినట్టయితే ఆంజియో ప్లాస్టీ ద్వారా చికిత్స అందించి భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారించడంతోపాటు, ప్రాణాపాయం నుంచి కాపాడతారు. -
ఆస్పత్రిలో ప్రముఖ సింగర్.. కుమారుడు చేసిన పనికి తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ సింగర్ అంగారాగ్ మహంత అలియాస్ పాపోన్ ఆస్పత్రిలో చేరాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. తన కుమారుడు కూడా పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) పాపోన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మనమందరం ఈ చిన్న చిన్న యుద్ధాలను ఒంటరిగా పోరాడుతున్నాం. ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ నిన్న రాత్రి జరిగింది మాత్రం వేరు. ఎందుకంటే మొదటిసారి 13 ఏళ్ల నా కుమారుడు ఆసుపత్రిలో రాత్రి నాకు కాపలాగా ఉన్నాడు. ఈ భావోద్వేగ క్షణం గురించి నా స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలనుకుంటున్నా. నా తల్లితండ్రుల కోసం నేను ఇలాగే చేసినట్లు నాకు గుర్తుంది. ఇప్పుడు వారి మనవడు పుహోర్ తన బాధ్యతను తీసుకోవడం చూసేందుకు వారు చుట్టూ ఉన్నారని అనుకుంటున్నా. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు! నేను ఇప్పుడు చాలా బాగున్నా.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. (ఇది చదవండి: Prabhas: ప్రభాస్ పేరుతో రూ.4 వేల కోట్ల దందా!) కాగా.. పాపోన్ 1998లో తన మ్యూజిక్ కెరీర్‌ను మొదలుపెట్టారు. అస్సామీలో మంచి ఆల్బమ్స్ చేశారు. 2006లో స్ట్రింగ్స్ అనే సినిమాలో ఓం మంత్ర అనే పాట పాడి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అస్సామీతో పాటు హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో సాంగ్స్ ఆలపించారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Papon (@paponmusic) -
రిషభ్ పంత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! మరో రెండు వారాల్లో..
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ అభిమానులకు శుభవార్త! మరో రెండు వారాల్లో ఈ యువ ఆటగాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తోంది. మేజర్ సర్జరీలు విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో అతడిని ఇంటికి తీసుకువెళ్లేందుకు వైద్యులు అనుమతించినట్లు తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి న్యూఇయర్ వేడుకలు చేసుకునేందుకు స్వదేశానికి తిరిగి వచ్చిన పంత్ ఘోర ప్రమాదానికి గురైన విషయం విదితమే. గతేడాది డిసెంబరు 30న స్వస్థలం ఉత్తరాఖండ్‌కు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్‌ను మెరుగైన చికిత్స కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ముంబైకి తరలించింది. ఈ క్రమంలో కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో అతడికి పలు శస్త్రచికిత్సలు జరిగినట్లు సమాచారం. మోకాలి సర్జరీ పూర్తైన నేపథ్యంలో మరో రెండు వారాల్లో అతడిని డిశ్చార్జ్ చేసేందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పంత్ రిహాబ్ సెంటర్లో ఆరు వారాల పాటు ఉండనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి.. ‘‘లిగమెంట్ల(రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలను కలిపి ఉంచే భాగాలు)కు సంబంధించిన గాయాల నుంచి కోలుకోవడానికి దాదాపు 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత రిహాబిలిటేషన్ మొదలవుతుంది. తను మళ్లీ ఎప్పుడు మైదానంలో దిగాలన్న అంశంపై మరో రెండు నెలల్లో ఓ అంచనాకు రాగలం. పంత్ జీవితంలో ఇదొక కఠిన దశ. తను మానసికంగా కూడా మరింత బలంగా తయారవ్వాలంటే కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సెషన్లవారీగా తనకు కౌన్సిలింగ్ ఉంటుంది. ముందు చెప్పినట్లు మరో నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే తను ఆట మొదలుపెట్టేది లేనిదీ తెలుస్తుంది’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. Shakira: మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
రిషభ్ పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పంత్‌కు శుక్రవారం శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కోకిలాబెన్ ఆసుపత్రిలోనే అతడి మోకాలి లిగమెంట్లకు సర్జరీ చేయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా పంత్ ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక లండన్‌లో సర్జరీ చేయంచాలని తొలుత బీసీసీఐ భావించింది. కానీ ఇప్పడు ముంబైలోనే చేయించినట్లు సమాచారం. "రిషభ్ పంత్ మోకాలి లిగమెంట్ల శస్త్రచికిత్స శుక్రవారం విజయవంతమైంది. ప్రస్తుతం అతడు వైద్యుల పరిశీలనలో ఉంచారు. తదుపరిగా ఏం చేయాలో, పునరావాసం(రిహాబిలిటేషన్)కు ఎప్పుడు పంపించాలో డాక్టర్ దిన్షా పార్ధీవాలా నేతృత్వంలోని వైద్యబృందం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ వైద్య బృందం, బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ టీంతో నిరంతరం టచ్‌లో ఉంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. అయితే పంత్ మాత్రం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు 7 నుంచి 9 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో అతడు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: IPL 2023: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! కానీ పాపం.. -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. వన్డే వరల్డ్‌కప్‌కు పంత్ దూరం!
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. అతడు ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. తొలుత డెహ్రడూన్‌లోని మ్యాక్స్ అసుపత్రిలో చికిత్స పొందిన పంత్‌ను మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్ ఆసుపత్రికి తాజాగా తరలించారు. అయితే పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8 నుంచి 9 నెలల సమయం పడుతుందని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో పంత్ ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. "పంత్ మోకాలి గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా సృష్టంగా తెలియదు. రాబోయో మూడు నాలుగు రోజుల్లో మొత్తం స్కాన్ రిపోర్టులు వస్తాయి. అయితే రిషభ్ లిగమెంట్ టియర్‌కు సర్జరీ జరగనుంది. అతడు మళ్లీ దాదాపు 8 నుంచి 9 నెలల తర్వాతే తిరిగి మైదానంలో అడుగుపెట్టగలడని మేము భావిస్తున్నాము" అని కోకిలాబెన్ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ఒకరు బీసీసీఐ మెడికల్ టీంతో పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. "రిషబ్ ట్రావెల్ చేయాడానికి సిద్దంగా ఉన్నాడని వైద్యులు బావిస్తే, వెంటనే అతడిని శస్త్రచికిత్స కోసం లండన్‌కు పంపుతారు. అయితే అతడు ప్రాధమికంగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా తెలియదు. పంత్ ప్రస్తుతం కోకిలాబెన్ ఆసుపత్రిలో డాక్టర్ పార్దివాలా బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రస్తుత రిపోర్ట్స్ ప్రకారం రిషబ్ మోకాలికి, చీలమండ రెండింటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి కచ్చితంగా తొమ్మిది నెలల సమయం పడుతుంది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: AP Vs HYD: రికీ, కరణ్ సెంచరీలు! చెలరేగిన శశికాంత్.. హైదరాబాద్‌పై ఆంధ్ర భారీ విజయం -
పంత్ ఉన్న ఆస్పత్రికి ఊర్వశి.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా క్రికెటర్ పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు మరోసారి ఊర్వశి రౌతేలాను ట్రోల్ చేస్తున్నారు. డెహ్రడూన్‌లో చికిత్స పొందిన పంత్‌ను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. దీంతో రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఫోటోను ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఊర్వశి నిజంగా పంత్‌ను కలిసిందా అని ఆశ్చర్యపోతున్నారు. దిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి వస్తుండగా టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అభిమానులు షాక్ కు గురయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవలే ఊర్వశి మదర్ మీరా రౌతేలా సైతం రిషబ్ పంత్ కోసం సోషల్ మీడియాలో ప్రార్థించింది. ఈ మేరకు రిషబ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. -
ఐసీయూలో కరీనా కపూర్ తండ్రి రణదీర్
ముంబై : కపూర్ ఫ్యామిలీలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలె రణ్‌బీర్ కపూర్, నీతూ కపూర్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా కరీనా కపూర్ తండ్రి, నటుడు రణధీర్ కపూర్‌కు కరోనా సోకింది. 74ఏళ్ల రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆయన్ను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో ప్రస్తుతం రణదీర్‌ను ఐసీయూలోకి షిఫ్ట్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే గతేడాది సరిగ్గా ఇదే సమయంలో ఏప్రిల్ 30న రణధీర్ కపూర్ సోదరుడు, ప్రముఖ నటుడు రిషి కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడాదికే ఆయన సోదరుడు రణధీర్ కపూర్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే ఆయన రణధీర్ సోదరుడు రాజీవ్ కపూర్ కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవలె రణధీర్ కపూర్ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్‌ను కూడా తీసుకున్నట్లు సమాచారం. రణధీర్ కపూర్ త్వరలోగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. చదవండి : నా కొడుకు లవ్ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం కరీనా రెండో కొడుకు ఫోటో షేర్ చేసిన రణ్‌ధీర్ -
సర్జరీ చేశారు.. ఇంటికి వచ్చేశా: నటుడు
ముంబై: తన క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని నటుడు శివిన్ నారంగ్ అన్నాడు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని.. తనను జాగ్రత్తగా చూసుకున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. ముంబైలోని తన నివాసంలో శివిన్ జారిపడిన విషయం తెలిసిందే. కళ్లు తిరిగి గాజు గ్లాసుపై పడిపోవడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో హుటాహుటిన కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి చేరుకున్న శివిన్ సోషల్ మీడియా వేదికగా తన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపాడు. (టీవీ నటుడికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు) తాను ఆస్పత్రి బెడ్ మీద పడుకుని ఉన్న ఫొటోలు షేర్ చేసి.. ‘‘ స్నేహితులు, నన్ను ప్రేమించే వాళ్లు, నా కుటుంబ సభ్యులు మీ ఆశీర్వాదాలతో ఇంటికి తిరిగి వచ్చేశాను. దురదృష్టవశాత్తూ ఇంట్లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఆస్పత్రి పాలయ్యాను. సర్జరీ చేశారు. కోకిలాబెన్ ఆస్పత్రి డాక్టర్లు, ఇతర సిబ్బందికి రుణపడి ఉంటా. కఠిన పరిస్థితుల్లో(కోవిడ్-19 వ్యాప్తిని ఉద్దేశించి)నూ వారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మీకు ఇదెలా సాధ్యమని.. ఓ వ్యక్తిని అడిగాను. ‘‘ మేం చేయకపోతే ఇంకెవరు సేవ చేస్తారు’’అని వారు సమాధానమిచ్చారు. నిజమైన హీరోలు వాళ్లే. వారిని అందరూ గౌరవించాల్సిందే’’ అని శివిన్ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందిన అభిమానుల భయాలు తొలగించాడు. కాగా శివిన్ ప్రస్తుతం బేహద్ 2 సీరియల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పలు రియాలిటీ షోల్లోనూ అతడు పాల్గొన్నాడు. View this post on Instagram All is well ❤️ For all my frnds , family n loved ones I’m back home 😇 Thankuu fr all your prayers & blessings 🙏❤️ unfortunately met with an accident at home injuring myself badly due to which I had undergone a surgery. Thankuu to the doctors and healthcare staff of @kokilabenhospital for taking such good care of me in this difficult scenario..... I remember one of the hospital staff saying ‘Sir hum nhi karenge toh kaun karega ‘ #respect #realheroes #grateful 🙏🙏🙏 A post shared by Shivin Narang (@shivin7) on May 6, 2020 at 6:17am PDT -
నాకు మంచి గుణపాఠం...
ముంబై: నోబెల్ బహుమతి గెల్చుకున్నందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో డిన్నర్ ఉన్నాసరే .. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.. అలా చేస్తే మీ శరీరం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది.. దయచేసి మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండకండి అని గట్టి సలహా ఇస్తున్నారు ప్రఖ్యాత గాయకుడు కైలాష్ ఖేర్. న్యూయార్క్ నుంచి వచ్చీ రావడంతోనే అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యానంటూ ఆయన కామెంట్ చేశారు. తాను ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో ఒకదాన్ని ఆయన ఈ సందర్భంగా శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్లనే తొలిసారి గుజరాత్లో ఏర్పాటుచేసిన ఒక షోను రద్దు చేసుకున్నానని కైలాష్ తెలిపారు. ఇది తనకు మంచి గుణపాఠమని, అందుకే ఆరోగ్యం విషయంలో ఎవ్వరూ అశ్రద్ధగా ఉండొద్దని, ఎప్పటికీ ప్రపంచమంతా ఆరోగ్యంతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తేరీ దీవానీ.. దీవానీ అంటూ సంగీతాభిమానులను మైమరపింపజేసిన గాయకుడు కైలాష్ అనారోగ్యం పాలై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
నా బ్యాక్ పెయిన్‌కీ ఆస్ట్రేలియా ట్రిప్‌కీ లింకేంటి?
‘‘విరాట్ బాగా ఆడితే అభినందనలు... ఆడకపోతే నిందలు. మొత్తానికి అతనికి సంబంధించిన ఏ విషయాన్నయినా నాతో ముడిపెట్టాలని చాలామంది ఫిక్స్ అయినట్లున్నారు’’ అని ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ పేర్కొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో తలపడిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తీసి, విరాట్ కోహ్లి అవుట్ అయిన విషయం తెలిసిందే. అనుష్క శర్మ ఆ మ్యాచ్‌ని తిలకించడానికి సిడ్నీ వెళ్లినందువల్లే, విరాట్ సరిగ్గా ఆడలేదని చాలామంది ఈ బ్యూటీని నిందించారు. అలాగే, సిడ్నీ నుంచి వచ్చాక ‘బ్యాక్ పెయిన్’ భరించలేక ముంబయ్‌లోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లారు అనుష్క. ఈ విషయం గురించి కొంతమంది లేనిపోని ఊహాగానాలు చేసి, సెటైర్లు వేస్తున్నారట. ఈ సెటైర్లకు అనుష్క స్పందిస్తూ -‘‘నేను ‘ఎన్‌హెచ్ 10’ సినిమా చేస్తున్నప్పుడు నాకు వెన్ను నొప్పి మొదలైంది. అప్పట్నుంచీ తీరిక లేక చూపించుకోలేదు. ఇప్పుడు బాధ భరించలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాను. అయినా నా బ్యాక్ పెయిన్‌కీ ఆస్ట్రేలియా ట్రిప్‌కీ లింకేంటి? ఊహాగానాలకు కూడా ఓ హద్దు ఉండాలి’’ అన్నారు. విరాట్, తానూ తమ అనుబంధాన్ని దాచకుండా బయటికి చెప్పేశామనీ, చివరికి పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు తమను ఫొటోలు తీసినా ఏమీ అనడంలేదనీ, అయినా కనికరం చూపించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధాకరం అనీ అనుష్క పేర్కొన్నారు. విమర్శలు, ఊహాగానాల వల్ల తమ అనుబంధంలో ఎలాంటి మార్పు రాదని కూడా ఆమె స్పష్టం చేశారు.