
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా క్రికెటర్ పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు మరోసారి ఊర్వశి రౌతేలాను ట్రోల్ చేస్తున్నారు. డెహ్రడూన్‌లో చికిత్స పొందిన పంత్‌ను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. దీంతో రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఫోటోను ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఊర్వశి నిజంగా పంత్‌ను కలిసిందా అని ఆశ్చర్యపోతున్నారు.
దిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి వస్తుండగా టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అభిమానులు షాక్ కు గురయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవలే ఊర్వశి మదర్ మీరా రౌతేలా సైతం రిషబ్ పంత్ కోసం సోషల్ మీడియాలో ప్రార్థించింది. ఈ మేరకు రిషబ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment