Urvashi Rautela Mother Meera Prays For Rishabh Pant Speedy Recovery - Sakshi
Sakshi News home page

Urvashi Rautela Mother: పంత్‌ కోసం ఊర్వశి రౌతేలా మదర్ పోస్ట్.. నెటిజన్ల ట్రోల్స్

Published Tue, Jan 3 2023 4:19 PM | Last Updated on Tue, Jan 3 2023 4:38 PM

Urvashi Rautela mother Meera prays for Rishabh Pant speedy recovery - Sakshi

టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అభిమానులు షాక్ కు గురయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఊర్వశి మదర్ మీరా రౌతేతా సైతం రిషబ్ పంత్ కోసం సోషల్ మీడియాలో ప్రార్థించింది. ఈ మేరకు రిషబ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది మరియు అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది.

(ఇది చదవండి: పంత్ కోసం కాదట .. ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా..!)

మీరా రౌతేలా ఇన్ ‍స్టాలో రాస్తూ..' ఒక వైపు మీ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తరాఖండ్‌కు పేరు తీసుకొచ్చారు. మీకు సిద్ధ బలిబాబా విశేష ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయి. పంత్ కోసం అందరూ ప్రార్థించండి.' అంటూ పంత్ ఫోటో పోస్ట్ చేశారు మీరా. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో అత్తమ్మ స్పందించారంటూ కామెంట్ చేయగా.. మరికొందరు ఊర్వశి, పంత్ గురించి ఇక మీ అనుమానాలు క్లియర్ అయినట్లే ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement