Netizens Trolls On Urvashi Rautela For Editing Her Photos In Instagram, Deets Inside - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: సోషల్ మీడియాలో ఊర్వశి రౌతేలా ఫోటోలు వైరల్.. పంత్‌ కోసమేనంటూ ట్రోల్స్..!

Published Wed, Oct 12 2022 12:51 PM | Last Updated on Wed, Oct 12 2022 1:36 PM

Bollywood Actress Urvashi Rautela Trolled For Photos Editing On Instagram - Sakshi

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా రోజుకో కొత్త లుక్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియా చెక్కేసిన ఈ అమ్మడు ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ లుక్‌లో పిక్స్‌తో అదరగొడుతోంది. అయితే ఆమె ఫోజులపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్‌ రిషభ్ పంత్ కోసమే ఇదంతా చేస్తున్నారని ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. 

ఇటీవల ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రీన్‌ లెహెంగా ధరించి ఫోటోను షేర్ చేసింది. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ..' ఎలా మర్చిపోగలను. మరణం మనుషులకే వస్తుంది. జ్ఞాపకాలకు కాదు." అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..' పంత్‌ కోసమే ఆమె తన ఫోటోలు ఎడిటింగ్ చేస్తున్నారని ట్రోలింగ్ చేశారు. తన నడుము చూపించేందుకే నానా తంటాలు పడుతోందని మరో నెటిజన్ కాస్త ఘాటుగా కామెంట్ చేశారు. 

ఆస్ట్రేలియాకు వెళ్లిన బాలీవుడ్ బ్యూటీ రోజుకో కొత్త స్టైల్లో ఫోటోలతో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. అదేస్థాయిలో ఆమెపై నెటిజన్లు ట్రోలర్స్‌తో కౌంటరిస్తున్నారు. తాజాగా నుదుట సింధూరం ఉన్న ఓ ఫోటోను షేర్‌ చేయగా తెగ వైరలవుతోంది.  ఇన్‌స్టాలో ఇలా రాస్తూ..' ప్రేమలో ఉన్న వారికి సింధూరం కంటే గొప్పది ఏముంటుంది. నేను నీతో జీవితాంతం కలిసుండాలనుకుంటున్నా' అంటూ లన్‌ సింబల్‌తో' క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.  మరీ ఈ భామ ప్రేమ కష్టాలు ఎప్పుడు తీరుతాయో.. ఆమెపై వస్తున్న రూమర్స్‌కు ఎప్పుడు చెక్‌ పడుతుందో వేచి చూడాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement