ఊర్వశి రౌతేలా అలాంటి కామెంట్స్.. మండిపడ్డ నెటిజన్స్‌! | Urvashi Rautela Height Shame Rishabh Pant Actress Clarification After Backlash | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: 'నా హైట్‌ లేరన్న ఊర్వశి రౌతేలా'.. నెటిజన్స్‌ ఆగ్రహం!

Published Mon, Apr 1 2024 7:42 PM | Last Updated on Mon, Apr 1 2024 8:17 PM

Urvashi Rautela Height Shame Rishabh Pant Actress Clarification After Backlash  - Sakshi

బాలీవుడ్‌ భామ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్‌ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో జేఎన్‌యూ అనే చిత్రంలో నటిస్తోంది.  అయితే గతంలో టీమిండియా క్రికెటర్‌తో ఈ భామ డేటింగ్‌లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. రిషబ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సైతం ఊర్వశి పోస్ట్ చేయడంతో రూమర్స్ మరింత వైరలయ్యాయి. వీరిద్దరు చాలాసార్లు ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్‌లు, పార్టీల్లో కనిపించడంతో డేటింగ్‌లో ఉన్నారని ఫ్యాన్స్‌ భావించారు. కానీ వీటన్నింటినీ రిషబ్ పంత్ కొట్టి పారేశాడు. ప్రస్తుతం రిషబ్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆడుతున్నారు.

ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఊర్వశి తాజాగా ఓ వాణిజ్య ప్రకటనలో మెరిసింది. ఓ మ్యాట్రిమోనీ సైట్‌కు సంబంధించిన ప్రకటనలో నటించింది. అయితే ఇందులో 'ఎవరు కూడా నా అంత ఎత్తు కలిగిన వారు దొరకడం లేదంటూ' నటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రకటనలో భాగంగా చెప్పుకొచ్చింది. కానీ ఇది చూసిన కొందరు నెటిజన్స్‌ ఆమె రిషబ్ పంత్‌ను ఉద్దేశించి అలా మాట్లాడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషబ్ పంత్‌ను అవమానించిందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేశారు.

తాజాగా దీనిపై ఊర్వశి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. అయితే యాడ్ స్క్రిప్ట్ తనకు ఆ కంపెనీ అందించిందేనని.. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేయలేదని స్పష్టం చేసింది. దయచేసి పాజిటివ్‌ తీసుకోవాలని సూచించింది. ఒక బాధ్యతగల వ్యక్తిగా బ్రాండ్ అంబాసిడర్‌గా నా వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోగలను అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఊర్వశి ప్రస్తుతం జేఎన్‌యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement