నా బ్యాక్ పెయిన్‌కీ ఆస్ట్రేలియా ట్రిప్‌కీ లింకేంటి? | "If Virat doesn't play well, I'm blamed for it" | Sakshi
Sakshi News home page

నా బ్యాక్ పెయిన్‌కీ ఆస్ట్రేలియా ట్రిప్‌కీ లింకేంటి?

Published Wed, Apr 1 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

నా బ్యాక్ పెయిన్‌కీ ఆస్ట్రేలియా ట్రిప్‌కీ లింకేంటి?

నా బ్యాక్ పెయిన్‌కీ ఆస్ట్రేలియా ట్రిప్‌కీ లింకేంటి?

‘‘విరాట్ బాగా ఆడితే అభినందనలు... ఆడకపోతే నిందలు. మొత్తానికి అతనికి సంబంధించిన ఏ విషయాన్నయినా నాతో ముడిపెట్టాలని చాలామంది ఫిక్స్ అయినట్లున్నారు’’ అని ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ పేర్కొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో తలపడిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తీసి, విరాట్ కోహ్లి అవుట్ అయిన విషయం తెలిసిందే. అనుష్క శర్మ ఆ మ్యాచ్‌ని తిలకించడానికి సిడ్నీ వెళ్లినందువల్లే, విరాట్ సరిగ్గా ఆడలేదని చాలామంది ఈ బ్యూటీని నిందించారు. అలాగే, సిడ్నీ నుంచి వచ్చాక ‘బ్యాక్ పెయిన్’ భరించలేక ముంబయ్‌లోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లారు అనుష్క. ఈ విషయం గురించి కొంతమంది లేనిపోని ఊహాగానాలు చేసి, సెటైర్లు వేస్తున్నారట.

ఈ సెటైర్లకు అనుష్క స్పందిస్తూ -‘‘నేను ‘ఎన్‌హెచ్ 10’ సినిమా చేస్తున్నప్పుడు నాకు వెన్ను నొప్పి మొదలైంది. అప్పట్నుంచీ తీరిక లేక చూపించుకోలేదు. ఇప్పుడు బాధ భరించలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాను. అయినా నా బ్యాక్ పెయిన్‌కీ ఆస్ట్రేలియా ట్రిప్‌కీ లింకేంటి? ఊహాగానాలకు కూడా ఓ హద్దు ఉండాలి’’ అన్నారు. విరాట్, తానూ తమ అనుబంధాన్ని దాచకుండా బయటికి చెప్పేశామనీ, చివరికి పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు తమను ఫొటోలు తీసినా ఏమీ అనడంలేదనీ, అయినా కనికరం చూపించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధాకరం అనీ అనుష్క పేర్కొన్నారు. విమర్శలు, ఊహాగానాల వల్ల తమ అనుబంధంలో ఎలాంటి మార్పు రాదని కూడా ఆమె స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement