టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ అభిమానులకు శుభవార్త! మరో రెండు వారాల్లో ఈ యువ ఆటగాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తోంది. మేజర్ సర్జరీలు విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో అతడిని ఇంటికి తీసుకువెళ్లేందుకు వైద్యులు అనుమతించినట్లు తెలుస్తోంది.
కాగా బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి న్యూఇయర్ వేడుకలు చేసుకునేందుకు స్వదేశానికి తిరిగి వచ్చిన పంత్ ఘోర ప్రమాదానికి గురైన విషయం విదితమే. గతేడాది డిసెంబరు 30న స్వస్థలం ఉత్తరాఖండ్‌కు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్‌ను మెరుగైన చికిత్స కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ముంబైకి తరలించింది. ఈ క్రమంలో కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో అతడికి పలు శస్త్రచికిత్సలు జరిగినట్లు సమాచారం. మోకాలి సర్జరీ పూర్తైన నేపథ్యంలో మరో రెండు వారాల్లో అతడిని డిశ్చార్జ్ చేసేందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత పంత్ రిహాబ్ సెంటర్‌లో ఆరు వారాల పాటు ఉండనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి.. ‘‘లిగమెంట్ల(రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలను కలిపి ఉంచే భాగాలు)కు సంబంధించిన గాయాల నుంచి కోలుకోవడానికి దాదాపు 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది.
ఆ తర్వాత రిహాబిలిటేషన్ మొదలవుతుంది. తను మళ్లీ ఎప్పుడు మైదానంలో దిగాలన్న అంశంపై మరో రెండు నెలల్లో ఓ అంచనాకు రాగలం. పంత్ జీవితంలో ఇదొక కఠిన దశ. తను మానసికంగా కూడా మరింత బలంగా తయారవ్వాలంటే కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సెషన్లవారీగా తనకు కౌన్సిలింగ్ ఉంటుంది. ముందు చెప్పినట్లు మరో నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే తను ఆట మొదలుపెట్టేది లేనిదీ తెలుస్తుంది’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే..
Shakira: మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది
Comments
Please login to add a commentAdd a comment