బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం సరిగా లేదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మార్చి 15న రోజంతా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‌లను కోరుతూ వారందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కామెంట్లు చేశారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని అక్కడ ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందారు.
బిగ్ బి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆయన బహిరంగ ప్రదేశంలో కనిపించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబయి, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కుమారుడితో అమితాబ్ హాజరయ్యారు. మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఆయన్ను ఆరోగ్యం గురించి మీడియా వారు ప్రశ్నించగా... అందులో నిజం లేదని, ఆ వార్తలు ఫేక్ అని తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
అంతే కాకుండా ఆయన చికిత్స పొందారు అని ప్రచారంలో ఉన్న కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి కూడా అమితాబ్ గురించి ఎలాంటి ధృవీకరణ లేదు. దీంతో ఇవన్నీ ఫేక్ అని తెలుస్తోంది. (ISPL) ఫైనల్ మ్యాచ్‌లో భారత మాజీ క్రికెటర్ సచిన్‌తో అమితాబ్ కనిపించారు. వారిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసిని అభిమానులు సంబరపడ్డారు.
అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ADలో కనిపించబోతున్నారు, ఇది 2024లో మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ ఉన్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్ వెట్టయన్ చిత్రంలో కూడా అమితాజ్ నటించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ నటీనటుల తెరపై మళ్లీ కలయిక కోసం ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment