
ముంబై : కపూర్ ఫ్యామిలీలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలె రణ్‌బీర్ కపూర్, నీతూ కపూర్‌లు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా కరీనా కపూర్ తండ్రి, నటుడు రణధీర్ కపూర్‌కు కరోనా సోకింది. 74ఏళ్ల రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆయన్ను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో ప్రస్తుతం రణదీర్‌ను ఐసీయూలోకి షిఫ్ట్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
అయితే గతేడాది సరిగ్గా ఇదే సమయంలో ఏప్రిల్ 30న రణధీర్ కపూర్ సోదరుడు, ప్రముఖ నటుడు రిషి కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడాదికే ఆయన సోదరుడు రణధీర్ కపూర్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే ఆయన రణధీర్ సోదరుడు రాజీవ్ కపూర్ కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవలె రణధీర్ కపూర్ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్‌ను కూడా తీసుకున్నట్లు సమాచారం. రణధీర్ కపూర్ త్వరలోగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
చదవండి : నా కొడుకు లవ్ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం
కరీనా రెండో కొడుకు ఫోటో షేర్ చేసిన రణ్‌ధీర్