Randhir Kapoor And Babita Kapoor Reunite After 35 Years Of Separation, Deets Inside - Sakshi
Sakshi News home page

Randhir Kapoor - Babita: ఇద్దరు కూతుళ్లతో ఇంటి నుంచి బయటకు.. 35 ఏళ్ల తర్వాత భర్త చెంతకు

Published Sat, Mar 4 2023 6:20 PM | Last Updated on Sat, Mar 4 2023 6:39 PM

Randhir Kapoor Babita Reunite after 35 Years Separation - Sakshi

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌, సీనియర్‌ నటి బబితా కపూర్‌లు విడిపోయి 30 ఏళ్లకు పైనే అవుతోంది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలోనే పెళ్లి పీటలెక్కారు. 1971లో వీరి వివాహం జరగ్గా కరిష్మా కపూర్‌, కరీనా కపూర్‌ జన్మించారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ 1988లో రణ్‌ధీర్‌, బబితా విడిపోయారు. అప్పటి నుంచి ఇ‍ద్దరూ వేర్వేరుగానే నివసిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. భర్త కొత్తగా షిఫ్ట్‌ అయిన బాంద్రాలోని ఇంటికి తన సామానంతా సర్దేసుకుని మరీ వచ్చేసింది బబిత.

ఇకపోతే రణ్‌ధీర్‌ కొంతకాలం క్రితమే చెంబూర్‌లోని ఇంటి నుంచి బాంద్రాకు షిఫ్ట్‌ అయిన విషయం తెలిసిందే! అదే సమయంలో బబితా కూడా తన భర్తతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి 2007లోనే రణ్‌ధీర్‌తో కలిసి ఉందామని అనుకుందట నటి. కానీ అనివార్య కారణాల వల్ల అది వీలు కాలేదట. ఇకపోతే భర్త నుంచి విడిపోయినప్పుడు బబిత తన ఇద్దరు కూతుర్లను తీసుకుని చెంబూర్‌లోని ఆర్కే బంగ్లా నుంచి బయటకు వచ్చేసింది. లోఖండ్‌వాలాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పిల్లలతో కలిసి నివసించింది. రణ్‌ధీర్‌, బబితా విడిపోయినప్పటికీ వీళ్ల మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండేది కాదట. పైగా కపూర్‌ ఇంట్లో ఏ అవసరం వచ్చినా బబితా అందుబాటులో ఉండేదట! ఎట్టకేలకు వీళ్లిద్దరూ ఒక్కటవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement