Babita
-
2 వేల కోట్లు వసూలు చేస్తే.. మాకిచ్చింది కోటే..!
-
35 ఏళ్ల క్రితం విడిపోయారు, ఇన్నాళ్లకు మళ్లీ ఒక్కటైన బాలీవుడ్ జంట
బాలీవుడ్ దిగ్గజ నటుడు రణ్‌ధీర్ కపూర్, సీనియర్ నటి బబితా కపూర్లు విడిపోయి 30 ఏళ్లకు పైనే అవుతోంది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలోనే పెళ్లి పీటలెక్కారు. 1971లో వీరి వివాహం జరగ్గా కరిష్మా కపూర్, కరీనా కపూర్ జన్మించారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ 1988లో రణ్‌ధీర్, బబితా విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగానే నివసిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. భర్త కొత్తగా షిఫ్ట్ అయిన బాంద్రాలోని ఇంటికి తన సామానంతా సర్దేసుకుని మరీ వచ్చేసింది బబిత. ఇకపోతే రణ్‌ధీర్ కొంతకాలం క్రితమే చెంబూర్‌లోని ఇంటి నుంచి బాంద్రాకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే! అదే సమయంలో బబితా కూడా తన భర్తతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి 2007లోనే రణ్‌ధీర్‌తో కలిసి ఉందామని అనుకుందట నటి. కానీ అనివార్య కారణాల వల్ల అది వీలు కాలేదట. ఇకపోతే భర్త నుంచి విడిపోయినప్పుడు బబిత తన ఇద్దరు కూతుర్లను తీసుకుని చెంబూర్‌లోని ఆర్కే బంగ్లా నుంచి బయటకు వచ్చేసింది. లోఖండ్‌వాలాలోని ఓ అపార్ట్మెంట్లో పిల్లలతో కలిసి నివసించింది. రణ్‌ధీర్, బబితా విడిపోయినప్పటికీ వీళ్ల మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండేది కాదట. పైగా కపూర్ ఇంట్లో ఏ అవసరం వచ్చినా బబితా అందుబాటులో ఉండేదట! ఎట్టకేలకు వీళ్లిద్దరూ ఒక్కటవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. -
కళాకాంతులు.. వారి హృదయానికి కళ్లున్నాయి..
వెండితెర, బుల్లితెరపై అంధపాత్రలు ధరించి ఎంతోమంది నటీనటులు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం మనకు తెలిసిందే! మరి ఏ భావోద్వేగాలు పలికించలేరనుకునే అంధులే నటిస్తే... ‘అలాంటి వారు కూడా ఉన్నారా!’ అనే ఆశ్చర్యానికి సమాధానంగా బబిత, హేమేంద్రలు అంధ కళాకారులుగా రాణిస్తున్నారు. ప్రపంచంలో అందమైన దృశ్యాన్ని చూడటానికి వారికి కళ్లు లేవు. అయితేనేం, వారి కళా నైపుణ్యం కారణంగా ప్రపంచమే ఇప్పుడు వారివైపు చూస్తోంది. అంధులైనప్పటికీ రంగుల తెరపై తమదైన ముద్ర వేస్తున్న వీరి నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే! నా దారిని నేను వెతుక్కోగలను.. ముంబైలో ఉంటున్న 24 ఏళ్ల బబిత సరోజ్ మరాఠీ ఫీచర్ ఫిల్మ్ ‘ద్రిశాంత్’లో నటిస్తోంది. దుఃఖం, గాంభీర్యం, కోపం.. ఈ భావాలను పలికించడానికి భయం అక్కర్లేదు. ఏదైనా చేయాలనే తపన, క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టు వీడకుండా ప్రతి ఒక్కరూ తమ కలలను నెరవేర్చుకోగలరనే నమ్మకం ఉంటే చాలని తాను ఎన్నుకున్న దారి ద్వారా సమాధానం చెబుతుంది బబిత. ‘ఇదెలా సాధ్యం..?’ అని అడిగిన వారిపై ‘అంధులు తమంతట తాముగా ఏమీ చేయలేరని, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేరని అనుకుంటారు. ఆలోచించే మెదడు, మాట్లాడే నాలుక ఉన్నప్పుడు ఎవరి సాయం లేకుండానే నడవగలను. నా ఆలోచనా శక్తితో నా దారిని నేను వెతుక్కోగలను. అలాంటప్పుడు నేను ఎందుకు నటించలేను’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. త్వరలో విడుదల కానున్న దృష్ట్ సినిమా షూటింగ్ సన్నివేశంలో బబిత బబిత తన గురించి మరిన్ని వివరాలు చెబుతూ –‘2009లో అనారోగ్యం కారణంగా నా కంటి చూపును కోల్పోయాను. కానీ, నటనపై ఉన్న ఇష్టం నా మనస్సులో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మూడేళ్లకు నా జీవితానికి ఆధారమైన నాన్న దూరమయ్యారు. దీంతో నా చిన్న అవసరాలు కూడా తీర్చుకోవడానికి చాలా కష్టపడేదాన్ని. రోజుల తరబడి ఏడుస్తూనే కూర్చున్నాను. కానీ, ఒక రోజు నా పనులన్నీ నేనే చేసుకోవాలి, ఇలా దుఃఖిస్తూ కూర్చుంటే బతకలేను అని అర్ధమైంది. ఈ ఆలోచన నా మార్గం నన్ను చూసుకునేలా చేసింది. స్నేహితులు, తెలిసిన వారి ద్వారా చాలా టీవీ సీరియల్స్, సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. రోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. చివరికి ఓ రోజు నా కష్టానికి ఫలితం దక్కింది. మరాఠీ బుల్లితెరపై నడిచే సీరియల్, షార్ట్ ఫిల్మ్‌లో హీరోయిన్గా అవకాశం వచ్చింది. షూటింగ్ సమయంలో అడుగుల లెక్కింపుతో కెమెరాను సమన్వయం చేసుకుంటాను. ఇది కష్టమైనప్పటికీ కొన్ని రోజుల సాధనతో సాధించగలిగాను. దర్శకుడు చెప్పిన దాని ప్రకారం నా పని నేను పూర్తి చేస్తాను. సెట్స్‌లో అంధురాలిగా అస్సలు భావించను. ఎలాంటి పాత్ర చేసినా ముందుగా నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. దానిని దాచడం వల్ల ప్రయోజనం లేదు, దానిని బహిర్గతం చేసి అధిగమించడమే మనముందున్న సవాల్. నాకు కావల్సింది నేను పొందాలనుకున్నప్పుడు వెనుకంజ వేసేది లేదు అని ఆత్మవిశ్వాసంతో చెప్పే బబిత న టించిన ‘దృష్ట్’ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. చీకటిని తొలగించే మార్గం... వారణాసిలో ఉంటున్న 25 ఏళ్ల హేమేంద్ర తన మనసులోని చీకటిని తొలగించే మార్గాన్ని కనుక్కొన్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓటీటీ ఫిల్మ్ ‘మిస్టరీ థ్రిల్లర్ బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ మూడవ సీజన్లో హేమేంద్ర సైబర్ క్రైమ్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ‘అంధాధున్’ సినిమా సమయం లో నటుడు ఆయుష్మాన్ ఖురానాకు దృష్టిలోపం ఉన్నవారు ఎలా జీవిస్తారో హేమేంద్ర స్వయంగా నేర్పించాడు. అదే సమయంలో ‘శుభో బిజోయ్’ చిత్రానికి నటుడు గుర్మీత్చౌదరి అంధుడి పాత్రకు హేమేంద్ర నుంచే శిక్షణ తీసుకున్నాడు. 17 ఏళ్ల వయసులో ఆప్టిక్ న్యూరైటిస్ అనే వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయిన హేమేంద్ర ‘ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. అయితే, నేను ఎందుకు రాణించలేను అని నాకు నేను ప్రశ్న వేసుకుని ఆ తర్వాత నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకోగలిగా’’ అని తెలియజేస్తాడు. ‘చూపు కోల్పోవడంతో నా కలలన్నీ కల్లలయ్యాయి. ఈ షాక్‌ని భరించడం చాలా కష్టమైంది. కానీ, నా కుటుంబ సభ్యులు మాత్రం నాలో ధైర్యాన్ని నింపారు. నా భవిష్యత్తును నేను ప్రకాశవంతం చేసుకోవాలనుకున్నాను. అందుకోసం కష్టపడటం మొదలుపెê్టను. ఈ ప్రయత్నంలో భాగంగా ముంబైలో దృష్టిలోపం ఉన్నవారికోసం పనిచేస్తున్న ఒక సంస్థను కలిశాను. అక్కడ అంధులైన పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. అటు తర్వాత పరిచయమైనవారి ద్వారా కళారంగంవైపుగా అడుగులు వేశాను. షూటింగ్ సమయంలో కెమరాను ఫేస్ చేయడం చాలా కష్టం. అయితే, యాక్టింగ్, ఎమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కొన్నిసార్లు అడవి, సముద్రం వంటి ప్రదేశాల్లోనూ షూటింగ్స్ జరుగుతాయి. అలాంటి చోట అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో నేను నా చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని, దానిలోపలే ఉంటూ పని పూర్తిచేస్తుంటాను’ అని వివరిస్తాడు హేమేంద్ర. సాధించాలనే తపనకు అవయవలోపం అడ్డంకి కానేకాదు అని నిరూపిస్తున్న ఈ యువ కళాకారులు ‘మేమూ సాధించగలం’ అనే స్ఫూర్తిని తమలాంటి వారెందరిలోనూ నింపుతున్నారు. -
మళ్లీ మెరిసిన బబిత జాక్వెలిన్
5000మీ. పరుగులో స్వర్ణం కాంస్యంతో రాణించిన సుఖ్వీందర్ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు బబిత జాక్వెలిన్, సుఖ్వీందర్ సింగ్ సత్తా చాటారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన పోటీల్లో బబిత స్వర్ణాన్ని గెలుచుకోగా... సుఖ్వీందర్ సింగ్ కాంస్య పతకంతో రాణించాడు. ఈ టోర్నీలో బబితకిది మూడో స్వర్ణం కావడం విశేషం. మహిళల 45 ప్లస్ వయోవిభాగంలో జరిగిన 5000మీ. పరుగు ఈవెంట్‌ను బబిత 25: 21.6 నిమిషాల్లో పూర్తిచేసి విజేతగా నిలిచింది. ప్రేరణ అగర్వాల్ (ఢిల్లీ), అర్చన (ఛత్తీస్‌గఢ్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. 35 ప్లస్ పురుషుల డిస్కస్‌త్రో ఈవెంట్లో సుఖ్వీందర్ సింగ్ డిస్క్‌ను 36.67మీ. దూరం విసిరి మూడోస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో ఆకాశ్ మాథుర్ (ఢిల్లీ, 42.62మీ.), పర్వేశ్ తోమర్ (ఢిల్లీ, 39.08మీ.) తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. 65 ప్లస్ మహిళల విభాగంలో ఏపీ చెందిన నీరజ రాణించింది. ట్రిపుల్‌జంప్‌లో ఆమె మూడోస్థానంలో నిలిచి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇతర వయోవిభాగాల విజేతలు 35+ మహిళలు 200మీ.: 1. వినీత (ఢిల్లీ), 2. బల్జీత్ కౌర్ (హరియాణా), 3. జోసెఫ్ (కేరళ). 5000మీ.: 1. జయంతి (ఢిల్లీ), 2. అశ్విని (మహారాష్ట్ర), 3. రీటామోని (అస్సాం). ట్రిపుల్ జంప్: 1. రచన (ఢిల్లీ), 2. అశా (గుజరాత్), 3. బబిత (ఢిల్లీ). 40+ మహిళలు 5000మీ.: 1. శారద (మహారాష్ట్ర), 2. శోభాదేశాయ్ (మహారాష్ట్ర), 3. భగవతి (ఢిల్లీ). ట్రిపుల్ జంప్: 1. శైలు (ఢిల్లీ), 2. స్నేహలత (రాజస్థాన్), 3. రూప సోనోవాల్ (అస్సాం). పురుషులు 200మీ.: 1. సాహా (పశ్చిమ బెంగాల్), 2.భగవంత్ సింగ్ (పంజాబ్), 3.మెమెర్నోశ్ (మహారాష్ట్ర). 5000మీ.: 1. రాజ్‌పాల్ (ఢిల్లీ), 2. విజయ రాఘవన్ (కేరళ), 3. తపస్ (పశ్చిమ బెంగాల్). డిస్కస్ త్రో: 1. సురేందర్ సింగ్ (ఢిల్లీ), 2. రాజేశ్ కుమార్ (ఢిల్లీ), 3. సురేంద్ర కుమార్ (బిహార్). 45+ మహిళలు 200మీ.: 1. జయలక్ష్మీ (తమిళనాడు), 2. రోషిని (ఢిల్లీ), 3. హేమలత (మహారాష్ట్ర). పురుషులు 200మీ.: 1. జోస్ పీజే (కేరళ), 2. బిజేందర్ సింగ్ (హరియాణా), 3. ఉన్నికృష్ణన్ హైజంప్: 1. లేజు (కేరళ), 2. రాజు పటేల్ (గుజరాత్), 3. జగ్దేవ్ సింగ్ (హరియాణా). 50+ మహిళలు 5000మీ.: 1. మీనా (అస్సాం), 2. బిడేశిని దేవి (మణిపూర్), 3. కస్తూరి (కేరళ). ట్రిపుల్ జంప్: 1. స్వప్న (పశ్చిమ బెంగాల్), 2. శాంతి (తమిళనాడు), 3. యామిని పురుషులు 200మీ.: 1. చిదంబరం (తమిళనాడు), 2. చంద్రబాబు (కేరళ), 3. రామకృష్ణ (ఏపీ). 55+ మహిళలు 5000మీ.: 1 లత (మహారాష్ట్ర), 2. జును సాయ్ సాయ్కియా (అస్సాం), 3. ఇలా దత్తా (పశ్చిమ బెంగాల్). ట్రిపుల్ జంప్: 1. భవాని (కేరళ), 2. శోభన (కేరళ), 3. జీనత్ (తమిళనాడు). పురుషులు 200మీ.: 1.గులాబ్ భోలే (మహారాష్ట్ర), 2. ప్రవీణ్ జోలీ (ఉత్తరాఖండ్), 3. డొమినిక్ మిచెల్ (తమిళనాడు). 60+ మహిళలు 5000మీ.: 1. పూజమ్మ (కేరళ), 2. వసంతి (కేరళ), 3. మోనిక (అస్సాం). ట్రిపుల్ జంప్: 1. థంకమ్మ (కేరళ), 2. దత్తా (అస్సాం), 3. నీరజ (ఏపీ). పురుషులు 5000మీ.: 1. అమూల్య కుమార్ (ఒడిశా), 2. తికమ్ సింగ్ (ఉత్తరాఖండ్), 3. కిరణ్ (మహారాష్ట్ర). 70+ మహిళలు 800మీ.: 1. చిన్మయి (పశ్చిమ బెంగాల్), 2. పుతుల్ (అస్సాం), 3. మంగి దేవీ( మణిపూర్). 5000మీ.: 1. లలితమ్మ (కేరళ), 2. లిల్లీ (పశ్చిమ బెంగాల్), 3. సంతోష్ (పంజాబ్). పురుషులు 5000మీ.: 1. మహేంద్ర (అస్సాం), 2. జస్బీర్ సింగ్ (ఉత్తరాఖండ్), 3. శామ్యూల్ (కేరళ). 80+ మహిళలు ట్రిపుల్ జంప్: 1. వసంత శామ్యూల్ (తమిళనాడు), 2. రాశి దేవి (మణిపూర్), 3. సీత పురుషులు 400మీ.: 1. లాల్‌బాబు సింగ్ (మణిపూర్), 2. సురేశ్ (మహారాష్ట్ర) 5000మీ.: 1. నంబి శేషన్(తమిళనాడు), 2. జనార్ధన్ (కేరళ), 3. రాజేంద్రన్ (తమిళనాడు). 85+ పురుషులు 5000మీ.: 1. జుగోల్ సింగ్ (మణిపూర్), 2. రాజేంద్ర ప్రసాద్ (రాజస్థాన్), 3. దేబానంద పాత్రో (ఒడిశా). -
బబిత జాక్వెలిన్‌కు స్వర్ణం
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్ బబిత జాక్వెలిన్ జేవియర్ సత్తా చాటింది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ పోటీల్లో రెండోరోజు స్వర్ణంతో మెరిసింది. మహిళల 45 ఏళ్లు పైబడిన వయోవిభాగంలో తలపడిన బబిత 1500 మీ. ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 6:37.7 నిమిషాల్లో లక్ష్య దూరాన్ని చేరుకొని విజేతగా నిలిచింది. ఈ విభాగంలో ఢిల్లీకి చెందిన ప్రీనా అగర్వాల్ (6:49.4), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అర్చన (6:50.9) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 65 ఏళ్లు పైబడిన వయోవిభాగంలో ఏపీకి చెందిన సీతారామ రాణించాడు. పోల్‌వాల్ట్ ఈవెంట్లో సీతారామ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ విభాగంలో జాయ్ (తమిళనాడు) అగ్రస్థానాన్ని దక్కించుకోగా... తంగరాజ్ (తమిళనాడు) రెండోస్థానంలో ఉన్నాడు. ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు 35+ పురుషులు: 1500మీ.: 1. రాజు (ఢిల్లీ), 2. నంద సాహా (పశ్చిమ బెంగాల్), 3. టి. రాజ్ (తమిళనాడు). హ్యామర్ త్రో: 1. గురేం దర్ పాల్ సింగ్ (పంజాబ్), 2. లాల్‌బహదూర్ (యూపీ), 3. నరేందర్ కుమార్ (ఢిల్లీ). మహిళలు: 1500మీ.: 1. జయంతి (ఢిల్లీ), 2. లలిత (ఢిల్లీ), 3. రీటా (అస్సాం). లాంగ్‌జంప్: 1. రచన శర్మ (ఢిల్లీ), 2. సవిత (కర్ణాటక), 3. సీని (కేరళ). 40+ పురుషులు: 110 మీటర్ల హర్డిల్స్: 1. సెంథన్ (తమిళనాడు), 2. కలైచెల్వన్ (తమిళనాడు), 3. అనిల్ (గుజరాత్). 1500మీ.: 1. రాజ్‌పాల్ (ఢిల్లీ), 2. రమేశ్ యాదవ్ (యూపీ), 3. విజయ రాఘవన్ (కేరళ). మహిళలు: 1500మీ.: 1. శోభ (మహారాష్ట్ర), 2. శారద (మహారాష్ట్ర), 3. భగవతి (ఢిల్లీ).లాంగ్‌జంప్: 1. చిత్ర (తమిళనాడు), 2. జోలీ (కేరళ), 3. ఎస్.జైన్ (రాజస్తాన్). 45+ పురుషులు: 110 మీటర్ల హర్డిల్స్: 1. అమర్నాథ (కర్ణాటక), 2. సుగుణన్ (తమిళనాడు), అనూప్ (హరియాణా). 1500మీ.: 1. సందీప్ (ఢిల్లీ), 2. సోమ్జీ భాయ్ (గుజరాత్), 3. శ్యామ్ (పశ్చిమ బెంగాల్). 50+ పురుషులు: 1500మీ.: 1. దినేశ్ కుమార్ (ఢిల్లీ), 2. గోరా సింగ్ (హరియాణా), 3. ఉదయ్ కుమార్ (తమిళనాడు). పోల్‌వాల్ట్: 1. లకీ‡్ష్వందర్ సింగ్ (పంజాబ్), 2. ఆర్. మాణిక్ రాజ్ (తమిళనాడు), 3. సులేమాన్ (తమిళనాడు). మహిళలు: 1500మీ.: 1. మీనా బోర్డోలోయ్ (అస్సాం), 2. దీపాళి (అస్సాం), 3. బిడేశిని దేవి (మణిపూర్). 55+ పురుషులు: 100మీటర్ హార్డిల్స్: 1. జగదీశ్ (పశ్చిమ బెంగాల్), 2. ఆష్రఫ్ (కేరళ), 3. జోయ్చంద్ (అస్సాం). 1500మీ.: 1. పరేశ్ (అస్సాం), 2. గోవింద్ (ఉత్తరాఖండ్), 3. రామస్వామి (కేరళ). పోల్‌వాల్ట్: 1. శ్యామ్ గుప్తా (పశ్చిమ బెంగాల్), 2. గ్రెగోరియస్ (కేరళ), 3. జస్బీర్ (హరియాణా). మహిళలు: 1500మీ.: 1.దేవీందర్ కౌర్ (పంజాబ్), 2. లత (మహారాష్ట్ర), 3. పూర్ణిమ (ఉత్తరాఖండ్). 60+ పురుషులు: 100 మీటర్ల హర్డిల్స్: 1. సుభాశ్ చంద్ర రాయ్ ( కేరళ), 2. చంద్రన్ (కేరళ), 3. ప్రభాకర్ (కేరళ). పోల్‌వాల్ట్: 1. పూల్ కుమార్ (ఢిల్లీ), 2. బాలన్ (కేరళ), 3. చంద్రశేఖరన్ (తమిళనాడు). మహిళలు:1500మీ.: 1. ధన్ కౌర్ (హరియా ణా), 2.అలేయమ్మ (కేరళ), 3. సర్వేశ్ (ఢిల్లీ). 65+ పురుషులు: 100మీటర్ల హర్డిల్స్: 1. అరుణ్ సింగ్ (పశ్చిమ బెంగాల్), 2. పార్థసారథి (కేరళ), 3. జోస్ (కేరళ). మహిళలు: 400మీ.: 1. జయ కులకర్ణి (గో వా), 2. పదుమీ దేవి (అస్సాం), 3. విమల (కేరళ). 1500మీ.: 1. దేవి (మణిపూర్), 2. జయ కులకర్ణి (గోవా), 3. పూజమ్మ (కేరళ). 70+ పురుషులు: 1500మీ.: 1. పరమాణిక్ (జార్ఖండ్), 2. మహేంద్ర (అస్సాం), 3. జస్బీంగ్ సింగ్ (ఉత్తరాఖండ్). పోల్‌వాల్ట్: 1. రాజ్ (తమిళనాడు), 2. కుప్పుస్వామి (తమిళనాడు), 3. భానుప్రతాప్ (రాజస్తాన్). n మహిళలు: 1500మీ.: 1. చిన్మయి (పశ్చిమ బెంగాల్), 2. లలితమ్మ (కేరళ), 3. లిల్లీ (పశ్చిమ బెంగాల్). 80+ పురుషులు: 1500మీ.: 1. నంబిశేషన్ (తమిళనాడు), 2. నషైన్ (ఛత్తీస్‌గఢ్), 3. డొమనిక్ (కేరళ). n 85+ పురుషులు: 1500మీ.: 1. జగుల్ సింగ్ (మణిపూర్), 2. రాజేంద్రప్రసాద్ (రాజస్తాన్), 3. బలరామ్ (ఒడిశా). -
కలలు కనండి... సాకారం చేసుకోండి
కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబై: తాము అనుకున్న లక్ష్యాల వైపు అకుంఠిత దీక్షతో ముందుకెళితే తప్పకుండా విజయం అందుతుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 49వ ఆలిండియా సెంట్రల్ రెవిన్యూ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. ‘మీ మీద మీకు నమ్మకముంటే ఏమైనా సాధించగలరు. ఇదే సూత్రంపై నేను ముందుకు సాగుతుంటాను. ఎంత పెద్ద కలలైనా కనండి.. వాటిని అందుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి. ఇటీవలే ఇద్దరు సిస్టర్స్ (రెజ్లర్లు బబిత, గీతా ఫోగట్)ల జీవిత చరిత్ర చూశాను. నా హృదయాన్ని కదిలించింది. దేశం గర్వించే స్థాయిలో వారు ఎదిగారు. జీవితంలో అయినా క్రీడల్లో అయినా దేశానికి పేరు తెచ్చే విధంగా మెలగాలి’ అని క్రీడాకారులకు కోహ్లి సూచించాడు. రెజ్లర్ బబితా, మహారాష్ట్ర మంత్రి వినోద్, గాయకుడు శంకర్ మహదేవన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
భర్తతో చనువుగా ఉండటాన్ని తట్టుకోలేక..
జైపూర్: తన భర్తతో చనువుగా ఉంటుందనే అనుమానంతో చిన్ననాటి స్నేహితురాలిని పథకం ప్రకారం హతమార్చిందో యువతి. అనంతరం ప్రమాదవశాత్తు స్నేహితురాలు మరణించిదంటూ కట్టుకథలు అల్లింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో ఆమె చివరకు కటకటాల పాలైంది. ఈ సంఘటన రాజస్తాన్ జైపూర్‌లోని చురులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.... బబిత, మనీషా బాల్య స్నేహితులు కాగా, ఆర్మీ జవాన్ అజయ్‌తో మనీషా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో తన భర్తతో బబితకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానం కలిగింది. అంతేకాకుండా వారిద్దరూ గంటలకొద్ది ఫోన్లలో మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో ఆమెపై మనీషా ఆగ్రహం పెంచుకుంది. దీంతో ఎలాగైనా స్నేహితురాలిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అజయ్ వస్తున్నాడని, తనకు తోడు రావాలంటూ మనీషా ఈ నెల 6న బబితను రతన్‌ఘర్ సమీపంలోని చర్న్వాసి బస్టాండ్‌కు తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా ఇద్దరు స్నేహితురాళ్లు బస్టాండ్ సమీపంలోని ఓ చెరువు వద్ద కూర్చున్నారు. కొంత సమయం గడిచాక, మనీషా అనుకోకుండా పడిపోయినట్లుగా తన చేతికున్న ఉంగరాన్ని నీళ్లలోకి జారవిడిచింది. అది తన ఎంగేజ్మెంట్ రింగ్ అని అదిపోతే అజయ్ ఫీల్ అవుతాడని, తీసివ్వాల్సిందిగా బబితను కోరింది. రింగ్ కోసం చెరువులోకి దిగిన బబిత, లోతు ఎక్కువగా ఉండటంతో తాడు సాయంతో బయటకు వచ్చేందుకు యత్నించింది. అయితే మనీషా...స్నేహితురాలు పైకిరాకుండా గుండెలపై బలంగా కాలితో తన్నడంతో ఆమె నీళ్లలో మునిగిపోయింది. తన కుమార్తె మృతిపై బబిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పోస్ట్‌మార్టం నివేదికతో పాటు మనీషాను తమదైన శైలిలోవిచారణ జరపటంతో నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు బుధవారం మనీషాను అదుపులోకి తీసుకుని ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.