కలలు కనండి... సాకారం చేసుకోండి | realization of the dreams - virat | Sakshi
Sakshi News home page

కలలు కనండి... సాకారం చేసుకోండి

Published Fri, Feb 17 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

కోహ్లితో రెజ్లర్‌ బబిత సెల్ఫీ

కోహ్లితో రెజ్లర్‌ బబిత సెల్ఫీ

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

ముంబై: తాము అనుకున్న లక్ష్యాల వైపు అకుంఠిత దీక్షతో ముందుకెళితే తప్పకుండా విజయం అందుతుందని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 49వ ఆలిండియా సెంట్రల్‌ రెవిన్యూ స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. ‘మీ మీద మీకు నమ్మకముంటే ఏమైనా సాధించగలరు. ఇదే సూత్రంపై నేను ముందుకు సాగుతుంటాను. ఎంత పెద్ద కలలైనా కనండి.. వాటిని అందుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి.

ఇటీవలే ఇద్దరు సిస్టర్స్‌ (రెజ్లర్లు బబిత, గీతా ఫోగట్‌)ల జీవిత చరిత్ర చూశాను. నా హృదయాన్ని కదిలించింది. దేశం గర్వించే స్థాయిలో వారు ఎదిగారు. జీవితంలో అయినా క్రీడల్లో అయినా దేశానికి పేరు తెచ్చే విధంగా మెలగాలి’ అని క్రీడాకారులకు కోహ్లి సూచించాడు. రెజ్లర్‌ బబితా, మహారాష్ట్ర మంత్రి వినోద్, గాయకుడు శంకర్‌ మహదేవన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement