Geeta Phogat
-
ఈ రెజ్లర్ ఎవరో గుర్తుపట్టగలరా? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గానూ..
-
అక్కడ ఖాతా తెరవని బీజేపీ.. అందుకే బరిలో ఆమె
చంఢీగర్ : హరియాణలోని దాద్రి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తన చెల్లెలు బబితా ఫోగాట్ (29) విజయం తథ్యమని ఆమె సోదరి గీతా ఫోగాట్ ధీమా వ్యక్తం చేశారు. రెజ్లింగ్‌లో మాదిరిగానే రాజకీయాల్లోను బబితా సత్తా చాటుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, జాట్ల ప్రాబల్యం ఉన్న దాద్రి నియోజకవర్గకంలో బీజేపీ ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈస్థానం నుంచి రాజ్‌దీప్ ఫోగాట్ (ఐఎన్ఎల్డీ) విజయం సాధించారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ బబితాను బరిలో నిలిపింది. మోదీ ర్యాలీ కలిసొస్తుందా.. బబితతో పాటు దాద్రి స్థానానికి జేజేపీ నుంచి సత్పాల్ సంగ్వాన్, కాంగ్రెస్ నుంచి మేజర్ నిర్పేందర్ సంగ్వాన్, స్వతంత్ర అభ్యర్థిగా సోమ్‌వీర్ సంగ్వాన్ పోటీలో ఉన్నారు. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన బబితా ఎంతమేరకు ప్రత్యర్థులను ఢీకొడుతుందో చూడాలి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘నా చెల్లెల్ని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. బబితా దేశానికి చేసిన సేవల పట్ల అందరికీ గౌరవం ఉంది. ఆమె రాజకీయాల్లో కూడా రాణిస్తుంది. అయితే, గెలుపోటములు ఎక్కడైనా సహజం. మేము క్రీడాకారులం. చమత్కారమైన లేక జాలి, సానుభూతితో కూడిన రాజకీయాలు చేతకావు’ అని గీతా చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇద్దరు రెజ్లర్ సోదరీమణుల ఇతివృత్తంగా తెరకెక్కి దంగల్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కలలు కనండి... సాకారం చేసుకోండి
కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబై: తాము అనుకున్న లక్ష్యాల వైపు అకుంఠిత దీక్షతో ముందుకెళితే తప్పకుండా విజయం అందుతుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 49వ ఆలిండియా సెంట్రల్ రెవిన్యూ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. ‘మీ మీద మీకు నమ్మకముంటే ఏమైనా సాధించగలరు. ఇదే సూత్రంపై నేను ముందుకు సాగుతుంటాను. ఎంత పెద్ద కలలైనా కనండి.. వాటిని అందుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి. ఇటీవలే ఇద్దరు సిస్టర్స్ (రెజ్లర్లు బబిత, గీతా ఫోగట్)ల జీవిత చరిత్ర చూశాను. నా హృదయాన్ని కదిలించింది. దేశం గర్వించే స్థాయిలో వారు ఎదిగారు. జీవితంలో అయినా క్రీడల్లో అయినా దేశానికి పేరు తెచ్చే విధంగా మెలగాలి’ అని క్రీడాకారులకు కోహ్లి సూచించాడు. రెజ్లర్ బబితా, మహారాష్ట్ర మంత్రి వినోద్, గాయకుడు శంకర్ మహదేవన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
గంభీర్ ఫైర్ అయ్యాడు
న్యూఢిల్లీ: ‘దంగల్’ నటి జైరా వసీంకు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాసటగా నిలిచాడు. ఆమె చేసిన తప్పేంటని నిలదీశాడు. జైరాతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం అవమానకరమని పేర్కొన్నాడు. ఈ వ్యవహారమంతా లింగ వివక్షతో కూడుకున్నట్టు కనబడుతోందని మండిపడ్డాడు. ‘దంగల్ సినిమాలో నటించడం లేదా కశ్మీర్ సీఎం ముఫ్తీని కలవడం ఇస్లాంకు విరుద్ధమని చెప్పడం దారుణమైన అణచివేత. ఆమెతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం అవమానకరం. ఈ వ్యవహారంలో లింగ వివక్ష స్పష్టంగా కనబడుతోంది. జైరాను అడిగినట్టే ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లను ప్రశ్నించగలరా? అభద్రతా భావంతోనే జైరా వసీం లాంటి బాలికపై విమర్శలు చేస్తున్నార’ని గంభీర్ ట్వీట్ చేశాడు. జైరా వసీంకు రెజ్లర్స్ గీతా పొగట్, బబితా పొగట్ కూడా అండగా నిలిచారు. తామంతా ఆమె వెంటే ఉంటామని భరోసాయిచ్చారు. Calling @zairawasim "unislamic" for acting in Dangal or meeting @MehboobaMufti is naked suppression. Ashamed dat she had 2 apologise. — Gautam Gambhir (@GautamGambhir) 17 January 2017 Calling @zairawasim "unislamic" for acting in Dangal or meeting @MehboobaMufti is naked suppression. Ashamed dat she had 2 apologise. — Gautam Gambhir (@GautamGambhir) 17 January 2017 Men will be men. Insecure 2 see a girl like @zairawasim get wings. Sadly we think "Maahri Choriyan AAJ B Choron se kum hain." @aamir_khan — Gautam Gambhir (@GautamGambhir) 17 January 2017 -
'దంగల్' సిస్టర్స్‌కు ఏమైంది..?
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా దంగల్ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అందరి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. హరియాణాకు చెందిన కుస్తీవీరుడు మహావీర్ పొగట్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పొగట్ కుమార్తెలు గీతా పొగట్, బబితా పొగట్ చాంపియన్లుగా ఎదిగిన తీరు ఈ సినిమా కథ. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పతకాలు అందించిన గీత, బబితలు క్రీడాభిమానులకు సుపరిచితమే. కాగా దంగల్ సినిమా తర్వాత ఈ సిస్టర్స్‌కు మరింత క్రేజ్ పెరిగింది. అసలు విషయం ఏంటంటే ప్రో రెజ్లింగ్ లీగ్‌లో పొగట్ సిస్టర్స్ యూపీ దంగల్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈ సీజన్లో వీరిద్దరూ కొనసాగేది సందేహంగా మారింది. గీత జ్వరంతో, బబిత గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో వీరిద్దరూ టోర్నీకి అందుబాటులో ఉండేది కష్టమని యూపీ దంగల్ టీమ్ వర్గాలు తెలిపాయి. వీరి స్థానాల్లో ఇతరులను తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్యను కోరినట్టు తెలుస్తోంది. మహిళల 53 కిలోల విభాగంలో బబిత స్థానంలో పింకి, 58 కిలోల విభాగంలో గీత స్థానంలో మనీషా పేర్లను సూచించారు. కాగా జట్టు నుంచి గీత, బబిత వైదొలగరని, టోర్నీలో వారు జట్టుతో కలసి ఉంటారని, అయితే తదుపరి పోటీలలో పాల్గొనకపోవచ్చని ఓ అధికారి చెప్పారు. -
‘దంగల్’ హంగామా...
నేటి నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్–2 అందరి దృష్టి సాక్షి, ఫోగట్ సిస్టర్స్ పైనే బరిలో ఆరు జట్లు తొలి రోజు హరియాణా, ముంబై పోరు న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన సాక్షి మలిక్‌తో పాటు ‘ఫోగట్ సిస్టర్స్’ జీవితాలను ప్రతిబింబిస్తూ ఇటీవల విడుదలై దుమ్మురేపుతున్న ‘దంగల్’ చిత్రంతో ఇప్పుడు రెజ్లింగ్ అంటే సర్వత్రా ఆసక్తి రెట్టింపయ్యింది. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో దేశంలోని క్రీడాభిమానులను అలరించేందుకు నేటి (సోమవారం) నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ రెండో సీజన్ ప్రారంభం కానుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మద్దతుతో 18 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌కు స్థానిక కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ గతేడాది చాంపియన్‌గా నిలిచిన ముంబై మహారథి, రన్నరప్ హరియాణా హ్యామర్స్ మధ్య జరుగనుంది. ఇక ఈ లీగ్‌కు బజరంగ్ పూనియా, అమిత్ కుమార్, జితేంద్ర, సందీప్ తోమర్, సాక్షి, గీతా ఫోగట్, బబితా కుమారిలే కాకుండా ప్రపంచ చాంపియన్లు, ఒలింపిక్ పతకాలు సాధించిన అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు స్టార్ అట్రాక్షన్‌గా మారనున్నారు. అయితే సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లీగ్‌కు దూరంగా ఉండటం అభిమానులకు కాస్త నిరాశే. రూ.15 కోట్ల ప్రైజ్‌మనీతో తొలి సీజన్‌కు మించి భారీగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇవీ జట్లు... ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో ముంబై మహారథి, హరియాణా హ్యామర్స్, ఢిల్లీ సుల్తాన్స్, జైపూర్ నింజా, యూపీ దంగల్, ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ పాల్గొంటున్నాయి. ప్రతీ జట్టులో తొమ్మిది మంది రెజ్లర్లుంటారు. ఇందులో భారత్‌కు చెందిన పురుష రెజ్లర్లు ముగ్గురు, మహిళా రెజ్లర్లు ఇద్దరు ఉంటారు. అలాగే విదేశీ కోటా కింద ఇద్దరేసి పురుషుల, మహిళల రెజ్లర్లు ఉంటారు. ఓవరాల్‌గా మొత్తం 54 మంది పాల్గొంటున్నారు. లీగ్ ఫార్మాట్... లీగ్ దశలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈనెల 17, 18న సెమీఫైనల్స్ ఉంటాయి. 19న జరిగే తుదిపోరులో నెగ్గిన విజేత రెండో సీజన్లో చాంపియన్‌గా అవతరిస్తుంది. ఇక పోటీలు తొమ్మిది విభాగాల్లో జరుగుతాయి. పురుషుల విభాగంలో 57 కేజీలు, 65 కేజీలు, 70 కేజీలు, 74 కేజీలు, 97 కేజీల్లో నిర్వహిస్తుండగా... మహిళా రెజ్లర్లు 48 కేజీలు, 53 కేజీలు, 58 కేజీలు, 69–75 కేజీలలో సత్తా చూపనున్నారు. సూపర్ బౌట్.. ఈ లీగ్‌లో ఈనెల 15న మహిళల 58 కేజీల విభాగంలో జరిగే బౌట్ అత్యంత ఆసక్తి రేపనుంది. ఎందుకంటే ఈ బౌట్... రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (ఢిల్లీ సుల్తాన్స్)... ‘దంగల్’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ గీత ఫోగట్ (యూపీ దంగల్) మధ్య జరుగనుంది. అయితే వీరిద్దరిపై విపరీతమైన ఒత్తిడి, అంచనాలు ఉండడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రొ రెజ్లింగ్‌లో నేడు ముంబై మహారథి గీ హరియాణా హ్యామర్స్ రాత్రి 7 గంటల నుంచి సోనీ మ్యాక్స్, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
'దంగల్'లో ఆ సీన్ చూసి ఏడ్చేశాను!
ముంబై: హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ 'దంగల్' వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది. మరోసారి ఆమీర్ మ్యాజిక్ చేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీలో ఓ సీన్ తనకు అంతగా నచ్చలేదని, తన మనసు నొచ్చుకుందని రెజ్లర్ గీతా ఫోగట్ అన్నారు. ఆ సీన్ ఏంటంటే.. కొన్ని అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఓటమిపాలైన గీతా వ్యవహారం మహావీర్ ఫోగట్ కు నచ్చదు. ఈ విషయంపై గురువుగా గీతను మందలించగా, తండ్రితో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుంది. తన పాత్రలో కనిపించిన ఫాతిమా సనా షేక్, ఆమీర్ మధ్య జరిగిన కుస్తీ సీన్ తో తాన మనసు ఎంతో వేదనకు గురైందన్నారు. ఆ సీన్ చూసి తాను ఏడ్చేశానని రెజ్లర్ గీతా వెల్లడించారు. వాస్తవానికి తాను తన తండ్రి మహావీర్ తో ఒక్కసారి మాత్రమే తలపడ్డానని అంతటితో విషయం ముగిసిపోయింది. కానీ, మూవీలో తండ్రితో కాస్త కఠినంగా ప్రవర్తించినట్లు చూపించారంటూ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. అయితే ఓవరాల్‌గా మూవీని తాను ఎంతో ఎంజాయ్ చేశానని, సహజరీతిలో అఖారాలో కుస్తీ ప్రాక్టీస్ సీన్లను చిత్రించడంపై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు. జీవిత కథాంశాన్ని తెరపై చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని రెజ్లర్ గీతా ఫోగట్ అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. -
పెళ్లికానుకగా ‘దంగల్’: ఆమిర్ ఖాన్
బిలాలీ: తన సినిమా ‘దంగల్’ రెజ్లర్ గీతా పొగట్ కు పెళ్లికానుక అని బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ అన్నాడు. ఆదివారం హర్యానాలో భివాడీ జిల్లా బిలాలీ గ్రామంలో జరిగిన గీతా పొగట్ పెళ్లికి ఆమిర్ ఖాన్ హాజరయ్యాడు. మహావీర్ సింగ్ పెద్ద కుమార్తె అయిన గీత... చాక్రిదాద్రికి చెందిన పవన్ కుమార్ ను పెళ్లాడింది. దీంతో బిలాలీ గ్రామంలో సందడి నెలకొంది. గీత పెళ్లికి ఆమిర్ ఖాన్ హాజరుకావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ‘దంగల్’ సినిమాలో ఆమిర్ కు భార్యగా నటించిన సాక్షి తన్వర్ కూడా పెళ్లికి వచ్చింది. గీతా పొగట్ కు పెళ్లి బట్టలు తీసుకొచ్చరా అని ఆమిర్ ఖాన్ ను ప్రశ్నించగా.... ’ఆమెకు పెళ్లి బట్టలు తీసుకురావాలని అనుకున్నాను. అయితే పెళ్లికూతురి మేనమామ బట్టలు పెట్టడం సంప్రదాయమని తెలిసింది. నేను నటించిన దంగల్ సినిమా ఆమెకు పెళ్లికానుక. గీతా పొగట్ కు పెళ్లి శుభాకాంక్షలు’ అని అన్నారు. దంగల్ సినిమాలో తన కూతుళ్ల పాత్రలు చేసిన ముగ్గురు అమ్మాయిలు తన కంటే పదిరెట్లు బాగా చేశారని ఆమిర్ ఖాన్ చెప్పాడు. తమ కథను తెరపై గొప్పగా చూపించనున్నారని గీతా పొగట్ విశ్వాసం వ్యక్తం చేసింది.