పెళ్లికానుకగా ‘దంగల్‌’: ఆమిర్‌ ఖాన్‌ | Dangal is my gift to her: Aamir Khan at Geeta Phogat’s wedding | Sakshi
Sakshi News home page

పెళ్లికానుకగా ‘దంగల్‌’: ఆమిర్‌ ఖాన్‌

Published Mon, Nov 21 2016 10:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

పెళ్లికానుకగా ‘దంగల్‌’: ఆమిర్‌ ఖాన్‌

పెళ్లికానుకగా ‘దంగల్‌’: ఆమిర్‌ ఖాన్‌

బిలాలీ: తన సినిమా ‘దంగల్‌’  రెజ్లర్‌ గీతా పొగట్‌ కు పెళ్లికానుక అని బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఆమిర్‌ ఖాన్‌ అన్నాడు. ఆదివారం హర్యానాలో  భివాడీ జిల్లా బిలాలీ గ్రామంలో జరిగిన గీతా పొగట్‌ పెళ్లికి ఆమిర్‌ ఖాన్‌ హాజరయ్యాడు. మహావీర్‌ సింగ్‌ పెద్ద కుమార్తె అయిన గీత... చాక్రిదాద్రికి చెందిన పవన్‌ కుమార్‌ ను పెళ్లాడింది. దీంతో బిలాలీ గ్రామంలో సందడి నెలకొంది. గీత పెళ్లికి ఆమిర్‌ ఖాన్‌ హాజరుకావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ‘దంగల్‌’ సినిమాలో ఆమిర్‌ కు భార్యగా నటించిన సాక్షి తన్వర్‌ కూడా పెళ్లికి వచ్చింది.

గీతా పొగట్‌ కు పెళ్లి బట్టలు తీసుకొచ్చరా అని ఆమిర్‌ ఖాన్‌ ను ప్రశ్నించగా.... ’ఆమెకు పెళ్లి బట్టలు తీసుకురావాలని అనుకున్నాను. అయితే పెళ్లికూతురి మేనమామ బట్టలు పెట్టడం సంప్రదాయమని తెలిసింది. నేను నటించిన దంగల్‌ సినిమా ఆమెకు పెళ్లికానుక. గీతా పొగట్‌ కు పెళ్లి శుభాకాంక్షలు’ అని అన్నారు. దంగల్‌ సినిమాలో తన కూతుళ్ల పాత్రలు చేసిన ముగ్గురు అమ్మాయిలు తన కంటే పదిరెట్లు బాగా చేశారని ఆమిర్‌ ఖాన్‌ చెప్పాడు. తమ కథను తెరపై గొప్పగా చూపించనున్నారని గీతా పొగట్‌ విశ్వాసం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement