బబిత జాక్వెలిన్‌కు స్వర్ణం
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్ బబిత జాక్వెలిన్ జేవియర్ సత్తా చాటింది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ పోటీల్లో రెండోరోజు స్వర్ణంతో మెరిసింది. మహిళల 45 ఏళ్లు పైబడిన వయోవిభాగంలో తలపడిన బబిత 1500 మీ. ఈవెంట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 6:37.7 నిమిషాల్లో లక్ష్య దూరాన్ని చేరుకొని విజేతగా నిలిచింది. ఈ విభాగంలో ఢిల్లీకి చెందిన ప్రీనా అగర్వాల్ (6:49.4), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అర్చన (6:50.9) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 65 ఏళ్లు పైబడిన వయోవిభాగంలో ఏపీకి చెందిన సీతారామ రాణించాడు. పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో సీతారామ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ విభాగంలో జాయ్ (తమిళనాడు) అగ్రస్థానాన్ని దక్కించుకోగా... తంగరాజ్ (తమిళనాడు) రెండోస్థానంలో ఉన్నాడు.
ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు
35+ పురుషులు: 1500మీ.: 1. రాజు (ఢిల్లీ), 2. నంద సాహా (పశ్చిమ బెంగాల్), 3. టి. రాజ్ (తమిళనాడు). హ్యామర్ త్రో: 1. గురేం దర్ పాల్ సింగ్ (పంజాబ్), 2. లాల్‌బహదూర్ (యూపీ), 3. నరేందర్ కుమార్ (ఢిల్లీ).
మహిళలు: 1500మీ.: 1. జయంతి (ఢిల్లీ), 2. లలిత (ఢిల్లీ), 3. రీటా (అస్సాం). లాంగ్‌జంప్: 1. రచన శర్మ (ఢిల్లీ), 2. సవిత (కర్ణాటక), 3. సీని (కేరళ).
40+ పురుషులు: 110 మీటర్ల హర్డిల్స్: 1. సెంథన్ (తమిళనాడు), 2. కలైచెల్వన్ (తమిళనాడు), 3. అనిల్ (గుజరాత్). 1500మీ.: 1. రాజ్‌పాల్ (ఢిల్లీ), 2. రమేశ్ యాదవ్ (యూపీ), 3. విజయ రాఘవన్ (కేరళ).
మహిళలు: 1500మీ.: 1. శోభ (మహారాష్ట్ర), 2. శారద (మహారాష్ట్ర), 3. భగవతి (ఢిల్లీ).లాంగ్‌జంప్: 1. చిత్ర (తమిళనాడు), 2. జోలీ (కేరళ), 3. ఎస్.జైన్ (రాజస్తాన్).
45+ పురుషులు: 110 మీటర్ల హర్డిల్స్: 1. అమర్‌నాథ (కర్ణాటక), 2. సుగుణన్ (తమిళనాడు), అనూప్ (హరియాణా). 1500మీ.: 1. సందీప్ (ఢిల్లీ), 2. సోమ్‌జీ భాయ్ (గుజరాత్), 3. శ్యామ్ (పశ్చిమ బెంగాల్).
50+ పురుషులు: 1500మీ.: 1. దినేశ్ కుమార్ (ఢిల్లీ), 2. గోరా సింగ్ (హరియాణా), 3. ఉదయ్ కుమార్ (తమిళనాడు). పోల్‌వాల్ట్: 1. లకీ‡్ష్వందర్ సింగ్ (పంజాబ్), 2. ఆర్. మాణిక్ రాజ్ (తమిళనాడు), 3. సులేమాన్ (తమిళనాడు).
మహిళలు: 1500మీ.: 1. మీనా బోర్డోలోయ్ (అస్సాం), 2. దీపాళి (అస్సాం), 3. బిడేశిని దేవి (మణిపూర్).
55+ పురుషులు: 100మీటర్ హార్డిల్స్: 1. జగదీశ్ (పశ్చిమ బెంగాల్), 2. ఆష్రఫ్ (కేరళ), 3. జోయ్‌చంద్ (అస్సాం). 1500మీ.: 1. పరేశ్ (అస్సాం), 2. గోవింద్ (ఉత్తరాఖండ్), 3. రామస్వామి (కేరళ). పోల్‌వాల్ట్: 1. శ్యామ్ గుప్తా (పశ్చిమ బెంగాల్), 2. గ్రెగోరియస్ (కేరళ), 3. జస్బీర్ (హరియాణా).
మహిళలు: 1500మీ.: 1.దేవీందర్ కౌర్ (పంజాబ్), 2. లత (మహారాష్ట్ర), 3. పూర్ణిమ (ఉత్తరాఖండ్).
60+ పురుషులు: 100 మీటర్ల హర్డిల్స్: 1. సుభాశ్ చంద్ర రాయ్ ( కేరళ), 2. చంద్రన్ (కేరళ), 3. ప్రభాకర్ (కేరళ). పోల్‌వాల్ట్: 1. పూల్ కుమార్ (ఢిల్లీ), 2. బాలన్ (కేరళ), 3. చంద్రశేఖరన్ (తమిళనాడు).
మహిళలు:1500మీ.: 1. ధన్ కౌర్ (హరియా ణా), 2.అలేయమ్మ (కేరళ), 3. సర్వేశ్ (ఢిల్లీ).
65+ పురుషులు: 100మీటర్ల హర్డిల్స్: 1. అరుణ్ సింగ్ (పశ్చిమ బెంగాల్), 2. పార్థసారథి (కేరళ), 3. జోస్ (కేరళ).
మహిళలు: 400మీ.: 1. జయ కులకర్ణి (గో వా), 2. పదుమీ దేవి (అస్సాం), 3. విమల (కేరళ).
1500మీ.: 1. దేవి (మణిపూర్), 2. జయ కులకర్ణి (గోవా), 3. పూజమ్మ (కేరళ).
70+ పురుషులు: 1500మీ.: 1. పరమాణిక్ (జార్ఖండ్), 2. మహేంద్ర (అస్సాం), 3. జస్బీంగ్ సింగ్ (ఉత్తరాఖండ్).
పోల్‌వాల్ట్: 1. రాజ్ (తమిళనాడు), 2. కుప్పుస్వామి (తమిళనాడు), 3. భానుప్రతాప్ (రాజస్తాన్). n మహిళలు: 1500మీ.: 1. చిన్మయి (పశ్చిమ బెంగాల్), 2. లలితమ్మ (కేరళ), 3. లిల్లీ (పశ్చిమ బెంగాల్).
80+ పురుషులు: 1500మీ.: 1. నంబిశేషన్ (తమిళనాడు), 2. నషైన్ (ఛత్తీస్‌గఢ్), 3. డొమనిక్ (కేరళ). n 85+ పురుషులు: 1500మీ.: 1. జగుల్ సింగ్ (మణిపూర్), 2. రాజేంద్రప్రసాద్ (రాజస్తాన్), 3. బలరామ్ (ఒడిశా).