national athletic championship
-
106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ
డెహ్రాడున్: హర్యానాలోని కద్మ అనే కుగ్రామానికి చెందిన రమాబాయి 18వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని 106 ఏళ్ల వయసులో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం తోపాటు షాట్ పుట్ లో కూడా బంగారు పతకాలను గెలుచుకున్నారు. నడుము వాల్చి సేదదీరాల్సిన వయస్సులో రమాబాయి సాధించిన ఈ ఫీట్ నడుమొంచని నేటి యువతకు చెంపపెట్టు లాంటిది. ప్రపంచ రికార్డుతో మొదలు.. రెండేళ్ల క్రితం అంటే బామ్మ వయసు 104 ఏళ్ళున్నప్పుడు మనవరాలు షర్మిలా సంగ్వాన్ నింపిన స్ఫూర్తితో అథ్లెటిక్స్ వైపు అడుగులేసింది. సరిగ్గా ఏడాది దాటేసరికి 85 ఏళ్ళు పైబడిన కేటగిరీలో 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది. వడోదరలో జరిగిన ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును 45.50 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇక అక్కడి నుండి బామ్మ వెనుదిరిగి చూడలేదు. ఈ వ్యవధిలో రమాబాయి మొత్తం 14 ఈవెంట్లలో సుమారు 200 మెడల్స్ సాధించింది. తాజాగా జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో ఏకంగా మూడు బంగారు పతకాలను చేజిక్కించుకుని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పతకాలను అందుకోవడానికి పోడియం వద్దకు వెళ్లిన బామ్మ తన కాళ్లకు శక్తినిచ్చిన మనవరాలికి కృతఙ్ఞతలు చెప్పారు. అలా మొదలైంది.. 2016లో వాంకోవర్‌లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్ ఈవెంట్లో పంజాబ్ కు చెందిన కౌర్ అనే బామ్మ 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుని 1 నిముషం 26 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌర్ ఆ తర్వాత ఏడాదే ఆక్లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఈవెంట్లో మరో ఏడు సెకన్లను తగ్గిస్తూ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. రమాబాయి మనవరాలు కౌర్ గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారి రమాబాయికి కూడా అథ్లెటిక్స్ లో పాల్గొనాలన్న తృష్ణ కలిగింది. ఫిట్నెస్ కోసం.. అప్పటివరకు గృహిణి గాను, ఎప్పుడైనా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీసిన బామ్మ రూటు మార్చింది. మైదానంలో అడుగుపెట్టి వయసు అడ్డంకులన్నిటినీ చెరిపేసి సాధన చేసింది. ఫిట్నెస్ కోసం పాలు, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంది. భారీ వాహనాన్ని నడిపే రమాబాయి మనవరాలు షర్మిల మొదట తన బామ్మకు క్రీడలవైపు వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినప్పుడు మొత్తం కుటుంబం భయపడింది... ఈ వయసులో బామ్మను సరిగ్గా చూసుకోకపోతే గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తారని భయపడినట్లు వెల్లడించారు. కానీ తన బామ్మ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లేటు వయసులో చాంపియన్ గా అవతరించి మొత్తం గ్రామానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది కూడా చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
ద్యుతీచంద్‌కు స్వర్ణం
లక్నో: జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా అథ్లెట్ ద్యుతీచంద్ ఆకట్టుకుంది. శుక్రవారం జరిగిన 100మీ. పరుగులో ద్యుతీచంద్ విజేతగా నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. పరుగును అందరికన్నా వేగంగా 11.38 సెకన్లలో పూర్తిచేసి ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 100మీ. హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి విజేతగా నిలిచింది. ఆమె 13.91సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది. హెప్టాథ్లాన్ ఈవెంట్లోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ 5321 పాయింట్లతో పసిడి పతకాన్ని అందుకుంది. అనస్ తప్పిదం... జట్టుపై అనర్హత వేటు పురుషుల 4–400మీ. రిలేలో భారత అథ్లెట్ మొహమ్మద్ అనస్ తప్పిదంతో ఏఎఫ్ఐ ‘బి’ జట్టుపై అనర్హత వేటు పడింది. ఏఎఫ్ఐ ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అనస్... 400మీ. రిలే ఫైనల్లో ‘బి’ జట్టు ఆటగాడి వద్ద నుంచి బ్యాటన్ అందుకొని పరుగెత్తాడు. దీంతో ‘బి’ జట్టు అనర్హత పాలైంది. నిజానికి అనస్‌కు బ్యాటన్ అందించాల్సిన అతని ‘ఎ’ జట్టు సహచరుడు అలెక్స్ ఆంథోని థర్డ్ లెగ్ రేసు మధ్యలో కండరాల గాయంతో వైదొలిగాడు. ఫైనల్ లెగ్‌లో బ్యాటన్ కోసం వేచిచూస్తోన్న అనస్ అదే సమయానికి థర్డ్ లెగ్‌ను పూర్తిచేసిన ‘బి’ జట్టు ఆటగాడు సాజన్ నుంచి బ్యాటన్ తీసుకొని పరుగు పెట్టాడు. దీంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. -
మళ్లీ మెరిసిన బబిత జాక్వెలిన్
5000మీ. పరుగులో స్వర్ణం కాంస్యంతో రాణించిన సుఖ్వీందర్ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు బబిత జాక్వెలిన్, సుఖ్వీందర్ సింగ్ సత్తా చాటారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన పోటీల్లో బబిత స్వర్ణాన్ని గెలుచుకోగా... సుఖ్వీందర్ సింగ్ కాంస్య పతకంతో రాణించాడు. ఈ టోర్నీలో బబితకిది మూడో స్వర్ణం కావడం విశేషం. మహిళల 45 ప్లస్ వయోవిభాగంలో జరిగిన 5000మీ. పరుగు ఈవెంట్‌ను బబిత 25: 21.6 నిమిషాల్లో పూర్తిచేసి విజేతగా నిలిచింది. ప్రేరణ అగర్వాల్ (ఢిల్లీ), అర్చన (ఛత్తీస్‌గఢ్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. 35 ప్లస్ పురుషుల డిస్కస్‌త్రో ఈవెంట్లో సుఖ్వీందర్ సింగ్ డిస్క్‌ను 36.67మీ. దూరం విసిరి మూడోస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో ఆకాశ్ మాథుర్ (ఢిల్లీ, 42.62మీ.), పర్వేశ్ తోమర్ (ఢిల్లీ, 39.08మీ.) తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. 65 ప్లస్ మహిళల విభాగంలో ఏపీ చెందిన నీరజ రాణించింది. ట్రిపుల్‌జంప్‌లో ఆమె మూడోస్థానంలో నిలిచి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇతర వయోవిభాగాల విజేతలు 35+ మహిళలు 200మీ.: 1. వినీత (ఢిల్లీ), 2. బల్జీత్ కౌర్ (హరియాణా), 3. జోసెఫ్ (కేరళ). 5000మీ.: 1. జయంతి (ఢిల్లీ), 2. అశ్విని (మహారాష్ట్ర), 3. రీటామోని (అస్సాం). ట్రిపుల్ జంప్: 1. రచన (ఢిల్లీ), 2. అశా (గుజరాత్), 3. బబిత (ఢిల్లీ). 40+ మహిళలు 5000మీ.: 1. శారద (మహారాష్ట్ర), 2. శోభాదేశాయ్ (మహారాష్ట్ర), 3. భగవతి (ఢిల్లీ). ట్రిపుల్ జంప్: 1. శైలు (ఢిల్లీ), 2. స్నేహలత (రాజస్థాన్), 3. రూప సోనోవాల్ (అస్సాం). పురుషులు 200మీ.: 1. సాహా (పశ్చిమ బెంగాల్), 2.భగవంత్ సింగ్ (పంజాబ్), 3.మెమెర్నోశ్ (మహారాష్ట్ర). 5000మీ.: 1. రాజ్‌పాల్ (ఢిల్లీ), 2. విజయ రాఘవన్ (కేరళ), 3. తపస్ (పశ్చిమ బెంగాల్). డిస్కస్ త్రో: 1. సురేందర్ సింగ్ (ఢిల్లీ), 2. రాజేశ్ కుమార్ (ఢిల్లీ), 3. సురేంద్ర కుమార్ (బిహార్). 45+ మహిళలు 200మీ.: 1. జయలక్ష్మీ (తమిళనాడు), 2. రోషిని (ఢిల్లీ), 3. హేమలత (మహారాష్ట్ర). పురుషులు 200మీ.: 1. జోస్ పీజే (కేరళ), 2. బిజేందర్ సింగ్ (హరియాణా), 3. ఉన్నికృష్ణన్ హైజంప్: 1. లేజు (కేరళ), 2. రాజు పటేల్ (గుజరాత్), 3. జగ్దేవ్ సింగ్ (హరియాణా). 50+ మహిళలు 5000మీ.: 1. మీనా (అస్సాం), 2. బిడేశిని దేవి (మణిపూర్), 3. కస్తూరి (కేరళ). ట్రిపుల్ జంప్: 1. స్వప్న (పశ్చిమ బెంగాల్), 2. శాంతి (తమిళనాడు), 3. యామిని పురుషులు 200మీ.: 1. చిదంబరం (తమిళనాడు), 2. చంద్రబాబు (కేరళ), 3. రామకృష్ణ (ఏపీ). 55+ మహిళలు 5000మీ.: 1 లత (మహారాష్ట్ర), 2. జును సాయ్ సాయ్కియా (అస్సాం), 3. ఇలా దత్తా (పశ్చిమ బెంగాల్). ట్రిపుల్ జంప్: 1. భవాని (కేరళ), 2. శోభన (కేరళ), 3. జీనత్ (తమిళనాడు). పురుషులు 200మీ.: 1.గులాబ్ భోలే (మహారాష్ట్ర), 2. ప్రవీణ్ జోలీ (ఉత్తరాఖండ్), 3. డొమినిక్ మిచెల్ (తమిళనాడు). 60+ మహిళలు 5000మీ.: 1. పూజమ్మ (కేరళ), 2. వసంతి (కేరళ), 3. మోనిక (అస్సాం). ట్రిపుల్ జంప్: 1. థంకమ్మ (కేరళ), 2. దత్తా (అస్సాం), 3. నీరజ (ఏపీ). పురుషులు 5000మీ.: 1. అమూల్య కుమార్ (ఒడిశా), 2. తికమ్ సింగ్ (ఉత్తరాఖండ్), 3. కిరణ్ (మహారాష్ట్ర). 70+ మహిళలు 800మీ.: 1. చిన్మయి (పశ్చిమ బెంగాల్), 2. పుతుల్ (అస్సాం), 3. మంగి దేవీ( మణిపూర్). 5000మీ.: 1. లలితమ్మ (కేరళ), 2. లిల్లీ (పశ్చిమ బెంగాల్), 3. సంతోష్ (పంజాబ్). పురుషులు 5000మీ.: 1. మహేంద్ర (అస్సాం), 2. జస్బీర్ సింగ్ (ఉత్తరాఖండ్), 3. శామ్యూల్ (కేరళ). 80+ మహిళలు ట్రిపుల్ జంప్: 1. వసంత శామ్యూల్ (తమిళనాడు), 2. రాశి దేవి (మణిపూర్), 3. సీత పురుషులు 400మీ.: 1. లాల్‌బాబు సింగ్ (మణిపూర్), 2. సురేశ్ (మహారాష్ట్ర) 5000మీ.: 1. నంబి శేషన్(తమిళనాడు), 2. జనార్ధన్ (కేరళ), 3. రాజేంద్రన్ (తమిళనాడు). 85+ పురుషులు 5000మీ.: 1. జుగోల్ సింగ్ (మణిపూర్), 2. రాజేంద్ర ప్రసాద్ (రాజస్థాన్), 3. దేబానంద పాత్రో (ఒడిశా). -
బబిత జాక్వెలిన్‌కు స్వర్ణం
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్ బబిత జాక్వెలిన్ జేవియర్ సత్తా చాటింది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ పోటీల్లో రెండోరోజు స్వర్ణంతో మెరిసింది. మహిళల 45 ఏళ్లు పైబడిన వయోవిభాగంలో తలపడిన బబిత 1500 మీ. ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 6:37.7 నిమిషాల్లో లక్ష్య దూరాన్ని చేరుకొని విజేతగా నిలిచింది. ఈ విభాగంలో ఢిల్లీకి చెందిన ప్రీనా అగర్వాల్ (6:49.4), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అర్చన (6:50.9) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 65 ఏళ్లు పైబడిన వయోవిభాగంలో ఏపీకి చెందిన సీతారామ రాణించాడు. పోల్‌వాల్ట్ ఈవెంట్లో సీతారామ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ విభాగంలో జాయ్ (తమిళనాడు) అగ్రస్థానాన్ని దక్కించుకోగా... తంగరాజ్ (తమిళనాడు) రెండోస్థానంలో ఉన్నాడు. ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు 35+ పురుషులు: 1500మీ.: 1. రాజు (ఢిల్లీ), 2. నంద సాహా (పశ్చిమ బెంగాల్), 3. టి. రాజ్ (తమిళనాడు). హ్యామర్ త్రో: 1. గురేం దర్ పాల్ సింగ్ (పంజాబ్), 2. లాల్‌బహదూర్ (యూపీ), 3. నరేందర్ కుమార్ (ఢిల్లీ). మహిళలు: 1500మీ.: 1. జయంతి (ఢిల్లీ), 2. లలిత (ఢిల్లీ), 3. రీటా (అస్సాం). లాంగ్‌జంప్: 1. రచన శర్మ (ఢిల్లీ), 2. సవిత (కర్ణాటక), 3. సీని (కేరళ). 40+ పురుషులు: 110 మీటర్ల హర్డిల్స్: 1. సెంథన్ (తమిళనాడు), 2. కలైచెల్వన్ (తమిళనాడు), 3. అనిల్ (గుజరాత్). 1500మీ.: 1. రాజ్‌పాల్ (ఢిల్లీ), 2. రమేశ్ యాదవ్ (యూపీ), 3. విజయ రాఘవన్ (కేరళ). మహిళలు: 1500మీ.: 1. శోభ (మహారాష్ట్ర), 2. శారద (మహారాష్ట్ర), 3. భగవతి (ఢిల్లీ).లాంగ్‌జంప్: 1. చిత్ర (తమిళనాడు), 2. జోలీ (కేరళ), 3. ఎస్.జైన్ (రాజస్తాన్). 45+ పురుషులు: 110 మీటర్ల హర్డిల్స్: 1. అమర్నాథ (కర్ణాటక), 2. సుగుణన్ (తమిళనాడు), అనూప్ (హరియాణా). 1500మీ.: 1. సందీప్ (ఢిల్లీ), 2. సోమ్జీ భాయ్ (గుజరాత్), 3. శ్యామ్ (పశ్చిమ బెంగాల్). 50+ పురుషులు: 1500మీ.: 1. దినేశ్ కుమార్ (ఢిల్లీ), 2. గోరా సింగ్ (హరియాణా), 3. ఉదయ్ కుమార్ (తమిళనాడు). పోల్‌వాల్ట్: 1. లకీ‡్ష్వందర్ సింగ్ (పంజాబ్), 2. ఆర్. మాణిక్ రాజ్ (తమిళనాడు), 3. సులేమాన్ (తమిళనాడు). మహిళలు: 1500మీ.: 1. మీనా బోర్డోలోయ్ (అస్సాం), 2. దీపాళి (అస్సాం), 3. బిడేశిని దేవి (మణిపూర్). 55+ పురుషులు: 100మీటర్ హార్డిల్స్: 1. జగదీశ్ (పశ్చిమ బెంగాల్), 2. ఆష్రఫ్ (కేరళ), 3. జోయ్చంద్ (అస్సాం). 1500మీ.: 1. పరేశ్ (అస్సాం), 2. గోవింద్ (ఉత్తరాఖండ్), 3. రామస్వామి (కేరళ). పోల్‌వాల్ట్: 1. శ్యామ్ గుప్తా (పశ్చిమ బెంగాల్), 2. గ్రెగోరియస్ (కేరళ), 3. జస్బీర్ (హరియాణా). మహిళలు: 1500మీ.: 1.దేవీందర్ కౌర్ (పంజాబ్), 2. లత (మహారాష్ట్ర), 3. పూర్ణిమ (ఉత్తరాఖండ్). 60+ పురుషులు: 100 మీటర్ల హర్డిల్స్: 1. సుభాశ్ చంద్ర రాయ్ ( కేరళ), 2. చంద్రన్ (కేరళ), 3. ప్రభాకర్ (కేరళ). పోల్‌వాల్ట్: 1. పూల్ కుమార్ (ఢిల్లీ), 2. బాలన్ (కేరళ), 3. చంద్రశేఖరన్ (తమిళనాడు). మహిళలు:1500మీ.: 1. ధన్ కౌర్ (హరియా ణా), 2.అలేయమ్మ (కేరళ), 3. సర్వేశ్ (ఢిల్లీ). 65+ పురుషులు: 100మీటర్ల హర్డిల్స్: 1. అరుణ్ సింగ్ (పశ్చిమ బెంగాల్), 2. పార్థసారథి (కేరళ), 3. జోస్ (కేరళ). మహిళలు: 400మీ.: 1. జయ కులకర్ణి (గో వా), 2. పదుమీ దేవి (అస్సాం), 3. విమల (కేరళ). 1500మీ.: 1. దేవి (మణిపూర్), 2. జయ కులకర్ణి (గోవా), 3. పూజమ్మ (కేరళ). 70+ పురుషులు: 1500మీ.: 1. పరమాణిక్ (జార్ఖండ్), 2. మహేంద్ర (అస్సాం), 3. జస్బీంగ్ సింగ్ (ఉత్తరాఖండ్). పోల్‌వాల్ట్: 1. రాజ్ (తమిళనాడు), 2. కుప్పుస్వామి (తమిళనాడు), 3. భానుప్రతాప్ (రాజస్తాన్). n మహిళలు: 1500మీ.: 1. చిన్మయి (పశ్చిమ బెంగాల్), 2. లలితమ్మ (కేరళ), 3. లిల్లీ (పశ్చిమ బెంగాల్). 80+ పురుషులు: 1500మీ.: 1. నంబిశేషన్ (తమిళనాడు), 2. నషైన్ (ఛత్తీస్‌గఢ్), 3. డొమనిక్ (కేరళ). n 85+ పురుషులు: 1500మీ.: 1. జగుల్ సింగ్ (మణిపూర్), 2. రాజేంద్రప్రసాద్ (రాజస్తాన్), 3. బలరామ్ (ఒడిశా).