మళ్లీ మెరిసిన బబిత జాక్వెలిన్
5000మీ. పరుగులో స్వర్ణం
కాంస్యంతో రాణించిన సుఖ్వీందర్
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు బబిత జాక్వెలిన్, సుఖ్వీందర్ సింగ్ సత్తా చాటారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన పోటీల్లో బబిత స్వర్ణాన్ని గెలుచుకోగా... సుఖ్వీందర్ సింగ్ కాంస్య పతకంతో రాణించాడు. ఈ టోర్నీలో బబితకిది మూడో స్వర్ణం కావడం విశేషం. మహిళల 45 ప్లస్ వయోవిభాగంలో జరిగిన 5000మీ. పరుగు ఈవెంట్‌ను బబిత 25: 21.6 నిమిషాల్లో పూర్తిచేసి విజేతగా నిలిచింది. ప్రేరణ అగర్వాల్ (ఢిల్లీ), అర్చన (ఛత్తీస్‌గఢ్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. 35 ప్లస్ పురుషుల డిస్కస్‌త్రో ఈవెంట్‌లో సుఖ్వీందర్ సింగ్ డిస్క్‌ను 36.67మీ. దూరం విసిరి మూడోస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో ఆకాశ్ మాథుర్ (ఢిల్లీ, 42.62మీ.), పర్వేశ్ తోమర్ (ఢిల్లీ, 39.08మీ.) తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. 65 ప్లస్ మహిళల విభాగంలో ఏపీ చెందిన నీరజ రాణించింది. ట్రిపుల్‌జంప్‌లో ఆమె మూడోస్థానంలో నిలిచి పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇతర వయోవిభాగాల విజేతలు 35+ మహిళలు
200మీ.: 1. వినీత (ఢిల్లీ), 2. బల్జీత్ కౌర్ (హరియాణా), 3. జోసెఫ్ (కేరళ).
5000మీ.: 1. జయంతి (ఢిల్లీ), 2. అశ్విని (మహారాష్ట్ర), 3. రీటామోని (అస్సాం).
ట్రిపుల్ జంప్: 1. రచన (ఢిల్లీ), 2. అశా (గుజరాత్), 3. బబిత (ఢిల్లీ).
40+ మహిళలు
5000మీ.: 1. శారద (మహారాష్ట్ర), 2. శోభాదేశాయ్ (మహారాష్ట్ర), 3. భగవతి (ఢిల్లీ).
ట్రిపుల్ జంప్: 1. శైలు (ఢిల్లీ), 2. స్నేహలత (రాజస్థాన్), 3. రూప సోనోవాల్ (అస్సాం).
పురుషులు
200మీ.: 1. సాహా (పశ్చిమ బెంగాల్), 2.భగవంత్ సింగ్ (పంజాబ్), 3.మెమెర్నోశ్ (మహారాష్ట్ర).
5000మీ.: 1. రాజ్‌పాల్ (ఢిల్లీ), 2. విజయ రాఘవన్ (కేరళ), 3. తపస్ (పశ్చిమ బెంగాల్).
డిస్కస్ త్రో: 1. సురేందర్ సింగ్ (ఢిల్లీ), 2. రాజేశ్ కుమార్ (ఢిల్లీ), 3. సురేంద్ర కుమార్ (బిహార్).
45+ మహిళలు
200మీ.: 1. జయలక్ష్మీ (తమిళనాడు), 2. రోషిని (ఢిల్లీ), 3. హేమలత (మహారాష్ట్ర).
పురుషులు
200మీ.: 1. జోస్ పీజే (కేరళ), 2. బిజేందర్ సింగ్ (హరియాణా), 3. ఉన్నికృష్ణన్
హైజంప్: 1. లేజు (కేరళ), 2. రాజు పటేల్ (గుజరాత్), 3. జగ్దేవ్ సింగ్ (హరియాణా).
50+ మహిళలు
5000మీ.: 1. మీనా (అస్సాం), 2. బిడేశిని దేవి (మణిపూర్), 3. కస్తూరి (కేరళ).
ట్రిపుల్ జంప్: 1. స్వప్న (పశ్చిమ బెంగాల్), 2. శాంతి (తమిళనాడు), 3. యామిని
పురుషులు
200మీ.: 1. చిదంబరం (తమిళనాడు), 2. చంద్రబాబు (కేరళ), 3. రామకృష్ణ (ఏపీ).
55+ మహిళలు
5000మీ.: 1 లత (మహారాష్ట్ర), 2. జును సాయ్ సాయ్‌కియా (అస్సాం), 3. ఇలా దత్తా (పశ్చిమ బెంగాల్).
ట్రిపుల్ జంప్: 1. భవాని (కేరళ), 2. శోభన (కేరళ), 3. జీనత్ (తమిళనాడు).
పురుషులు
200మీ.: 1.గులాబ్ భోలే (మహారాష్ట్ర), 2. ప్రవీణ్ జోలీ (ఉత్తరాఖండ్), 3. డొమినిక్ మిచెల్ (తమిళనాడు).
60+ మహిళలు
5000మీ.: 1. పూజమ్మ (కేరళ), 2. వసంతి (కేరళ), 3. మోనిక (అస్సాం).
ట్రిపుల్ జంప్: 1. థంకమ్మ (కేరళ), 2. దత్తా (అస్సాం), 3. నీరజ (ఏపీ).
పురుషులు
5000మీ.: 1. అమూల్య కుమార్ (ఒడిశా), 2. తికమ్ సింగ్ (ఉత్తరాఖండ్), 3. కిరణ్ (మహారాష్ట్ర).
70+ మహిళలు
800మీ.: 1. చిన్మయి (పశ్చిమ బెంగాల్), 2. పుతుల్ (అస్సాం), 3. మంగి దేవీ( మణిపూర్).
5000మీ.: 1. లలితమ్మ (కేరళ), 2. లిల్లీ (పశ్చిమ బెంగాల్), 3. సంతోష్ (పంజాబ్).
పురుషులు
5000మీ.: 1. మహేంద్ర (అస్సాం), 2. జస్బీర్ సింగ్ (ఉత్తరాఖండ్), 3. శామ్యూల్ (కేరళ).
80+ మహిళలు
ట్రిపుల్ జంప్: 1. వసంత శామ్యూల్ (తమిళనాడు), 2. రాశి దేవి (మణిపూర్), 3. సీత
పురుషులు
400మీ.: 1. లాల్‌బాబు సింగ్ (మణిపూర్), 2. సురేశ్ (మహారాష్ట్ర)
5000మీ.: 1. నంబి శేషన్(తమిళనాడు), 2. జనార్ధన్ (కేరళ), 3. రాజేంద్రన్ (తమిళనాడు).
85+ పురుషులు
5000మీ.: 1. జుగోల్ సింగ్ (మణిపూర్), 2. రాజేంద్ర ప్రసాద్ (రాజస్థాన్), 3. దేబానంద పాత్రో (ఒడిశా).