
కరీనా కపూర్ తండ్రి, బాలీవుడ్ నటుడు రణ్‌ధీర్ కపూర్ ప్రస్తుతం మతిమరుపుతో బాధపడుతున్నట్లు హీరో రణ్‌బీర్ కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నారని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. షర్మాజీ నమ్‌కిమ్ సినిమా చూసిన తర్వాత రణ్‌ధీర్ అంకుల్ నా దగ్గరకు వచ్చి, ఆ సినిమాలో మీ నాన్న అద్భుతంగా నటించాడు.
అతను ఎక్కడ ఉన్నాడు? నేను అతడితో మాట్లాడాలి ఫోన్ చెయ్ అని అడిగాడు. నాన్న చనిపోయారన్న సంగతి అంకుల్ మర్చిపోయారు. ఇప్పుడిప్పుడే ఆయనకు వ్యాధి ప్రారంభమైంది అంటూ వివరించాడు. కాగా దిగ్గజ నటుడు రాజ్‌కపూర్‌కు రణ్‌ధీర్, రాజీవ్, రిషి కపూర్‌లు కుమారులన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం రణ్‌బీర్ తండ్రి, రిషి కపూర్ చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment