
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్‌బీ ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం రోజున అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్, మనువరాలు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బిగ్‌బీ కుటుంబ సభ్యులందరికీ కరోనాకు సంబంధించిన టెస్టులను నిర్వహించగా.. నిన్నటి రోజున కేవలం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కి సంబంధించిన రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి.
అందులో కొన్ని ఫలితాలు ఈ రోజు రాగా.. వాటిలో ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. అయితే ఇప్పటికే అమితాబ్ ఇంటిని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. బిగ్‌బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వెంటనే ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment