భార్యకు ప్రేమతో...బిగ్‌బీ లేఖ | Amitabh Bachchan Writes Letter In his Blog  On Jaya Bachchan Birthday | Sakshi
Sakshi News home page

భార్యకు ప్రేమతో...బిగ్‌బీ లేఖ

Published Mon, Apr 9 2018 1:54 PM | Last Updated on Mon, Apr 9 2018 2:23 PM

Amitabh Bachchan Writes Letter In his Blog  On Jaya Bachchan Birthday - Sakshi

అమితాబ్‌, జయా బచ్చన్‌

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తన ఆలోచనల్ని, తన అనుభూతిని రాతరూపంలో ఎంత చక్కగా వివరిస్తాడో అందరికీ తెలిసిందే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన తన సతీమణి జయాబచ్చన్‌ పుట్టినరోజు సందర్భంగా అందమైన లేఖ రాశారు. ప్రియమైన భార్య గుర్తుచేసుకుంటూ పలు విషయాలు తెలిపారు.

‘అర్థరాత్రి 12 కాగానే శుభాకాంక్షలు తెలుపడానికి ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. స్వీటు తినిపించి తనను 70వ వసంతంలోకి ఆహ్వానించాను. ఆమె భార్యగా, తల్లిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తోంది. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన లేఖలు, కురిపించిన ప్రేమ..ఒక్కసారిగా ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. ఈ రోజు నాకు ప్రత్యేకం’ అని అమితాబ్ లేఖలో పేర్కొన్నారు.

1973 జూన్‌ 3న అమితాబ్, జయా బచ్చన్‌ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు అభిషేక్, శ్వేత. బాలీవుడ్‌లో అన్యోన్యమైన జంటగా బిగ్‌ బీ, జయ పేరు గడించారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ప్రముఖ నటిగా 1992లో జయాబచ్చన్‌కు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. 2004లో జయాబచ్చన్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం అమితాబ్‌ తెలుగులో చిరంజీవి హిరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement