
సంతానం కలగడం లేదని..
వివాహిత ఆత్మహత్య
నాగోలు: పిల్లలు పుట్టడం లేదని జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన నవ్య (25) అలియాస్ కస్తూరి నాగోల్ జైపురికాలనీకి చెందిన నరేశ్‌తో గత నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.
మధ్యలో గర్భం దాల్చినా అబార్షన్ జరిగింది అప్పటి నుంచి సంతానం కలుగక పోవటంతో మనస్తాపానికి లోనైన నవ్య శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.