చిన్నారితో సహా బావిలో దూకిన తల్లి
Published Fri, Mar 11 2016 12:07 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
మదనపల్లి రూరల్: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడిని బావిలోకి తోసేసి తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడిందో తల్లి. ఈ సంఘటన మదనపల్లి మండలం మామిడిగుంతలపల్లిలో 4 రోజుల క్రితమే చోటుచేసుకున్నా ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. మృతులు కవిత(24), జితేందర్‌రెడ్డి(4)గా గుర్తించారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. 4 రోజుల క్రితం కవిత భర్త సోమశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement