ముంబై: ముంబైలో ఓ డాక్టర్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్థానికంగా ఓ క్లినిక్ నిర్వహించే ఎంబీబీఎస్ డాక్టర్ జాస్మిన్‌పటేల్(45) ఇంద్రజిత్ దత్త, కుమార్తె ఓసిన్(15) ఉరివేసుకుని ఉసురుతీసుకున్నారు. ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులను మూడు వేరువేరు సూసైడ్ లేఖలను గుర్తించారు. దీంతో హత్య కోణాన్ని పోలీసులు కొట్టి పారేసినప్పటికీ, సంఘటనా స్థలంలో మూడు సూసైడ్ నోట్స్ లభ్యం కావడంపై ఆరా తీస్తున్నారు.
తీవ్ర అనారోగ్యం కారణంగా తనువు చాలిస్తున్నట్టుగా డాక్టర్ జాస్మిన్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే తన కుమార్తెను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేదని రాశారు. అలాగే తమ శరీరాలను కెమ్ హాస్పిటల్ లోని వైద్య విద్యార్థులకోసం దానం చేయాల్సిందిగా రాశారు.
ఈ దంపతుల ఎడతెగని గొడవలతో తాను విసిగిపోయినట్టు ఓసిన్ తన లేఖలో తెలిపింది. ఈ కారణంగానే తాను చదువును మధ్యలోనే విడిచిపెట్టాల్సి వచ్చిందనీ, దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి, అసహనానికి గురైనట్టు తెలిపింది.
అయితే భార్య, కూతురు చనిపోవడంతో తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా లేఖరాసిన దత్తూ తాను ఉరివేసుకున్నారు. అంతేకాదు తమ ఇంటి తాళాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇంటిగుమ్మం ముందు పడేశారు. పొద్దున్నే పనిమనిషి వచ్చి చూడటంతో విషయం వెలుగు చూసింది.
వీరిని మధ్యప్రదేశ్ కు చెందినవారిగా భావిస్తున్న పోలీసులు బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ దంపతులు పెద్దగా ఎవరితోనే మాట్లాడేవారుకాదనీ, కేవలం పాలు, కూరగాయలు లాంటి నిత్యావసరాలకోసం మాత్రమే బయటికి వచ్చేవారని చుట్టపక్కల వారు చెబుతున్నారు.
కనీసం నడవలేని స్థితిలో విపరీతమైన నడుం నొప్పితో డాక్టర్ జలీల్ బాధపడుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారి అశోక్ నాయక్ తెలిపారు. ఇంట్లో వాకింగ్ స్టిక్‌ను కూడా స్వాధీనం చేసకున్నట్టు చెప్పారు. అలాగే చేతిరాతల నిపుణుల ద్వారా వీరి ఆత్మహత్యల లేఖలను పరిశీలించనున్నట్టు చెప్పారు. ముగ్గురు నైలాన్‌తాళ్లతో ఉరివేసుకున్నారని ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నాగ్రేల్ వెల్లడించారు. మద్యంమత్తులో ఉన్న దత్తా, భార్యా బిడ్డల ఆత్మహత్య గమనించిన అనంతరం తాను కూడాసూసైడ్ చేసుకున్నాడని కామోథీ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అశోక్ నాయక్ చెప్పారు. అయితే దత్తా సూసైడ్ నోట్ లో ఓసిల్ తన కూతురు లాంటిదని పేర్కొనడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. బహుశా ఆ యువతి అతని కూతురు కాకపోయి వుండవచ్చని భావిస్తున్నారు.