పురుగుమందు తాగి తల్లీ్లబిడ్డ ఆత్మహత్య | mother and son commit to suicide | Sakshi
Sakshi News home page

పురుగుమందు తాగి తల్లీ్లబిడ్డ ఆత్మహత్య

Published Mon, Sep 4 2017 8:38 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

పురుగుమందు తాగి తల్లీ్లబిడ్డ ఆత్మహత్య - Sakshi

పురుగుమందు తాగి తల్లీ్లబిడ్డ ఆత్మహత్య

త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో విషాదం
త్రిపురాంతకం :
ఆ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ తీవ్ర మనస్తాపంతో బిడ్డకు పురుగుమందు పట్టించి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని రాజుపాలెంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ త్యాగరాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అలవాల విజయసారథిరెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరులోనే కాపురం ఉండేవాడు. ఇటీవల కుటుంబమంతా గ్రామానికి వచ్చిది. దంపతుల మధ్య జరిగిన గొడవతో ఆయన భార్య కావ్య (25) తీవ్ర మనస్తాపం చెందింది.

దీంతో ఆమె పురుగుమందు తాగి కుమారుడు వర్షిత్‌(2)తో కూడా తాగించింది. బంధువులు గమనించి వారిని చికిత్స కోసం గుంటూరు జిల్లా వినుకొండ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తొలుత తల్లి మృతి చెందింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కుమారుడు కూడా తనువు చాలించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ త్యాగరాజు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement