
బుల్లితెరపై హీరోయిన్‌కు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి నవ్య స్వామి. కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీకి అడుగుపెట్టి తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అబ్‌డేట్స్‌ని షేర్ చేస్తుంటుంది. కన్నడలో ఆమె నటించి తొలి సీరియల్ 'తంగళి' సూపర్ హిట కావడంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. ఈ నేపథ్యంలో తమిళంలో కూడా ఓ సీరియల్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక కొంతకాలంగా టీవీ నటుడు రవి కృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇద్దరూ కలిసి ఈవెంట్లు, షోలు చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చూకూరినట్లయ్యింది.
తాజాగా ఓ షోలో పాల్గొన్న నవ్య తనకు సంబంధించి చాలా విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్‌లో తాను చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, తనకు కరోనా వచ్చిందని తెలిసి గేటెడ్ కమ్యూనిటీలోకి రానివ్వలేదని తెలిపింది. ఆ సమయంలో ఎంతో బాధ పడ్డానని, తన లైఫ్‌లో అంతలా ఏడ్చిన సందర్బం అదేనని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇక తనకు ఇళ్లు సర్దడం, వంటి చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పాలంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. దీంతో మరో నటి తన ఇంటికి రావాలంటూ ఫన్నీగా సెటైర్ వేసింది.
చదవండి : Pavala syamala : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన నటుడు
కరోనా బాధితుల కోసం యాంకర్ వింధ్య వినూత్న ఆలోచన
Comments
Please login to add a commentAdd a comment