పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ నటి | Telugu Serial Actress Maheshwari Blessed With Another Child | Sakshi
Sakshi News home page

Maheshwari: మరోసారి తల్లయిన సీరియల్ నటి మహేశ్వరి

Apr 23 2024 12:15 PM | Updated on Apr 23 2024 12:23 PM

Telugu Serial Actress Maheshwari Blessed With Another Child - Sakshi

తెలుగు సీరియల్ నటి మహేశ్వరి మరోసారి తల్లయింది. మంగళవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ.. ఆడ మగ అనేది చెప్పకుండా అందరి చేతులతో తీసిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అలా శుభవార్తని అందరితో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తోటి సీరియల్ నటీనటులు అందరూ మహేశ్వరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

(ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్)

'వదినమ్మ', 'శశిరేఖా పరిణయం' సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మహేశ్వరి.. ఇస్మార్ట్ జోడీ, ఫ్యామిలీ నంబర్ 1 షోల్లోనూ పాల్గొని ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శివనాగ్ ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. 

గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మహేశ్వరిని.. రీసెంట్‌గా తన భర్త శివనాగ్ సడన్‌గా సీమంతం చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈమెకు మరో బిడ్డ పుట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తమ బుజ్జాయికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే అందరూ బుల్లితెర నటి మహేశ్వరికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement